సాక్షి, న్యూఢిల్లీ: చలి పులి పంజా నుంచి నిరాశ్రయులను తప్పించడానికి ‘ఆప్’ సర్కారు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం నగరంలో ఉన్న రాత్రి షెల్టర్లు కొద్దిమందికి మాత్రమే ఆశ్రయం కల్పించగలుగుతున్నాయి. ఇంకా వందలాదిమంది చలినుం చి ఎటువంటి రక్షణ పొందలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో నిరాశ్రయులకు తక్షణ రక్షణ కల్పించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకునేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటినుంచో పనికిరావని వదిలేసిన డీటీసీ బస్సులను తాత్కాలిక నైట్ షెల్టర్లుగా ఉపయోగించాలని యోచిస్తోంది.
నగరంలో పనికిరాకుండా పోయిన అన్ని డీటీ సీ బస్సులను నైట్‌షెల్టర్లుగా మారుస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ఫేస్ బుక్‌లో వెల్లడిం చింది.
నైట్‌షెల్టరుగా మార్చిన ఓ బస్సు ఫోటోను కూడా దానికి జోడించారు. పనికి రాకుండా పోయి న బస్సులను తాత్కాలిక నైట్ షెల్టర్లుగా మార్చి వాటిలో బ్లాంకెట్ల వంటి కనీస వసతులను సమకూరుస్తున్నారని, దీని వల్ల నిరాశ్రయులు కనీసం కం టినిండా నిద్ర పోగలుగుతారని అందులో పేర్కొం ది. నగరంలోని ఓ ఎన్జీఓ సహాయంతో ఇప్పటికే రెండు బస్సులను నైట్ షెల్టర్లుగా మార్చి వాడుతున్నారు. నగరంలోని నిరాశ్రయులకు రాత్రి పూట నిద్రించే ందుకు నైట్ షెల్టర్లను అందచేయాలని ఆప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం మేరకు రాత్రి పూట ఆరుబయట గడిపే నిరాశ్రయులపై సర్కారు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం నగరంలోని 212 ప్రాంతాల్లో 4,018 మంది చలిలో రాత్రు లు రోడ్డుపక్కన గడుపుతున్నారు. అయితే వాస్తవ సంఖ్య దీనికన్నా ఎక్కువే ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా నగరంలో నిరాశ్రయుల కోసం త్వరలో 100 నైట్ షెల్టర్లు నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.
రాత్రి షెల్టర్లుగా పాత డీటీసీ బస్సులు
Published Wed, Jan 8 2014 11:38 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
Advertisement