
లండన్ : పగటి వేళ పనిచేసే మహిళలతో పోలిస్తే నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలకు క్యాన్సర్ ముప్పు అధికమని ఓ అథ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలంగా రాత్రి వేళల్లో పనిచేసే మహిళలకు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం 50 శాతం అధికంగా ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక బ్రెస్ట్ క్యాన్సర్ మూడు రెట్లు, పొత్తికడుపు క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదు రెట్లు అధికమని కనుగొన్నారు.
రాత్రి షిఫ్ట్‌ల్లో పనిచేసే నర్సులకు పగటిపూట పనిచేసే వారితో పోలిస్తే 58 శాతం అధికంగా బ్రెస్ట్ క్యాన్సర్‌కు లోనవుతున్నారని అథ్యయనం పేర్కొంది. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే నర్సుల్లో లంగ్ క్యాన్సర్ కేసులు కూడా మూడో వంతు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ర్టేలియా, ఆసియాలో 40 లక్షల మందిని కవర్ చేస్తూ సాగిన 61 విభిన్న అథ్యయనాల్లోని డేటా ఆధారంగా చైనాకు చెందిన సిచువన్ యూనివర్సిటీ ఈ పరిశోధన చేపట్టింది.
మహిళల్లో సాధారణ క్యాన్సర్‌లకు నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేయడం ప్రధాన ముప్పుకారకంగా వెల్లడైందని అసిస్టెంట్ ప్రొఫెసర్ లీమా చెప్పారు. రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులు తరచూ వైద్య పరీక్షలు, క్యాన్సర్ స్ర్కీనింగ్ చేయించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment