రాత్రి కరెంట్‌కు రైతు బలి | night Current sacrifice farmer | Sakshi
Sakshi News home page

రాత్రి కరెంట్‌కు రైతు బలి

Published Mon, Sep 30 2013 3:19 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

night Current sacrifice farmer

కొల్చారం, న్యూస్‌లైన్: రాత్రి కరెంట్‌కు మరో రైతు మృ త్యువాతపడ్డాడు. ఈ సంఘటన కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. మృతుని కుటుంబీకుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన మౌలాన్‌సాబ్, అబేదాబిలకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. పెద్ద కొడుకు జమాల్(23) గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివా రం రాత్రి అన్నం తిన్నాక పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు జమాల్ ఇంటికి రాక పోవడంతో ఆందోళనకు గురైన తండ్రి మౌలాన్‌సాబ్ పొలం వద్దకు వెళ్ళాడు. అక్కడ బోరుమోటర్‌కు చెందిన స్టార్టర్ వద్ద జమాల్ పడి ఉన్నాడు. దగ్గరికి వెళ్లి చూడగా మరణించి ఉన్నాడు. దీంతో మృతుడి తండ్రి లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎదిగిన కొడుకు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అయితే రాత్రి వేళ కరెంట్ ఇవ్వడం వల్లనే తమ కొడుకు మరణించాడని వారు ఆరోపించారు. స్టార్టర్‌ను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడు జమాల్‌కు పెళ్లికాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement