
రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి
మెదక్: రాత్రి కరెంట్‌కు తండ్రీ కొడుకులు బలయ్యారు. ఈ సంఘటన మెదక్ మండలం కొచ్చెర్వు తండాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మూడావత్ జగ్న (66), పేమ్ని దంపతుల చిన్న కుమారుడు చిన్నా (25) పొలం వద్దకు వెళ్లారు. చెరకును కొంత మేర నాటారు. ఆ తరువాత ఏమైందో ఏమో కాని ఇరువురూ స్టార్టర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా తండ్రి, సోదరుడు ఇంటికి రాకపోవడంతో మరో కుమారుడు తిన్యా పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే తండ్రి, సోదరుడు విగత జీవులుగా పడి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.