chinna
-
నా భార్య చనిపోయేవరకు వీల్‌చైర్‌లోనే.. అదే చివరిమాట.. : చిన్నా భావోద్వేగం
కబలి (కబడ్డీ).. కబలి.. నేను ఆళ్తా.. అంటూ తన డైలాగులతో నవ్వించాడు చిన్నా అలియాస్ జితేంద్ర రెడ్డి. కామెడీ పాత్రలే కాదు ఆ ఇంట్లో వంటి చిత్రాలతో సీరియ్ పాత్రలు కూడా చేశాడు. శివ, పుట్టింటి పట్టుచీర, మనీ మనీ, మధురానగరిలో, పిట్టల దొర, అల్లుడా మజాకా, మురారి, సొంతం, గౌతమ్ ఎస్ఎస్సీ, ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా నటుడు చిన్నా ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. మాజీ సీఎం మేనల్లుడిని..చిన్నా (Actor Chinna) మాట్లాడుతూ.. మాకు 25 ఎకరాల భూమి.. పొలంలోనే ఇల్లు, ఊర్లో థియేటర్లో ఉంది. కానీ నాకు సినిమాలపై ఆసక్తి. ఫిలిం ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధించాను. తొలిసారి ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు సీనియర్ డైరెక్టర్ వంశీ హేయ్.. వెళ్లు అంటూ తరిమేశారు. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా? అనిపించింది. అయినా ప్రయత్నాలు ఆపలేదు. కష్టపడి అవకాశాలు సాధించాను. ఇక్కడో విషయం చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సోదరే మా అమ్మ. అనారోగ్యం బారిన చిన్నా భార్యనేను నటుడిగా పేరు తెచ్చుకున్నాక కేబినెట్ మీటింగ్‌కు పిలిచాడు. ఈయనెవరో తెలుసా? నా మేనల్లుడు అంటూ అక్కడున్నవారికి గర్వంగా చెప్పుకున్నాడు. కానీ ఎవరికీ నేను నా బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకునేవాడిని కాదు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ పెళ్లయిన పదేళ్లకు ఆమె ఆరోగ్యం దెబ్బతింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన రోజు ఆమె నడవలేకపోతున్నానంది. మల్టిపుల్ క్లీరోసిస్ వ్యాధి వల్ల వీల్‌చైర్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. రెడీ చేయడం దగ్గర్నుంచి అన్నీ నేనే..రూ.4 లక్షలు పెట్టి తైవాన్ నుంచి వీల్‌చైర్ తెప్పించాను. అది మనం కూర్చోవడానికే కాకుండా నిలబడేందుకు సాయపడుతుంది. ట్రీట్మెంట్లో భాగంగా చాలాసార్లు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఐదారేళ్లపాటు వీల్‌చైర్‌లోనే ఉంది. చివరి రెండేళ్లయితే తనకు రెడీ చేయడం, డ్రెస్ వేయడం, తినిపించడం.. అన్నీ నేనే చేశాను. అయితే ఎక్కువసేపు మంచానికే పరిమితవడం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. అది ఎక్కువవడంతో ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే శ్వాస తీసుకోవడానికి ఎక్కువ ఇబ్బందిపడింది. నా చేయి పట్టుకుని..మా ఆయన్ను చూడాలనుందని అక్కడివారికి చెప్పింది. ఆ విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఏదైనా తాగాలనుందంది. గ్లూకోజ్ తెప్పించి గ్లాసులో కలిపి మూడు, నాలుగు చెంచాలు తాగిపించాను. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ బాగోలేదు అని చిరాకు పడటంతో స్పెషల్ ఐసీయూకు షిఫ్ట్ చేయిస్తానన్నాను. తనను స్ట్రెచర్‌పై పడుకోబెట్టగానే నా చేయి పట్టుకుని నేనిక బతకనేమో అంది. అదే తన చివరి మాట. ఏం కాదు అని ధైర్యం చెప్పాను. కానీ 24 గంటల్లో అంతా అయిపోయింది.ఒంటరినయ్యా..ఇద్దరు కూతుర్ల పెళ్లి చూడకుండా 42 ఏళ్ల వయసులోనే తను మాకు దూరమైంది. కొన్ని నెలలపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా కూతుర్లిద్దరిదీ లవ్ మ్యారేజ్. ఇద్దరికీ పెళ్లయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో ఒంటరినయ్యాను. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే శూన్యంలా అనిపిస్తుంది. రోజూ నా భార్య ఫోటోకు పూలు పెట్టి దండం పెట్టుకుంటాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: నటుడు చేసిన పనికి ఏడ్చేసిన అత్త.. గ్రేట్ అంటూ ప్రశంసలు! -
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
-
టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుంది: ఎంపీ కేశినేని నాని
సాక్షి, విజయవాడ: కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం కంచికచర్ల మండలం పెండ్యాలలో 70 లక్షల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక.. ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నానని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒక్కటేనని.. స్థాయిలో లోకేష్.. తన కంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడేవాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానిలో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. చదవండి: అంబేద్కర్‌ను పచ్చ మీడియా అవమానించింది: ఆర్కే. రోజా -
సురేశ్ కొండేటికి సిద్ధార్థ్ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్. ఈ చిత్రంలో జెనీలియా అతనికి జంటగా నటించింది. ప్రస్తుతం ఆయన చిత్తా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాగా.. తెలుగు ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌కు ఆయన హాజరయ్యారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? ) అయితే ఈ ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సినిమా ఈవెంట్స్‌లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి కూడా హాజరయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్.. అతనిపై సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'కొండేటి సురేశ్‌కు ఒక వార్నింగ్. మొత్త ఇంటర్నెట్ నీకు వార్నింగ్ ఇవ్వమంది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేశ్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పా' అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) Sariponu....... pic.twitter.com/DBYIHOGOAl — Arehoo_official (@tweetsbyaravind) October 3, 2023 -
ఆర్జీవీ నన్ను హీరోగా పెట్టి రమ్యకృష్ణతో సినిమా...
-
నందమూరి తారకరత్న చిన్న కర్మ (ఫొటోలు)
-
నటుడు చిన్నాతో సరదాగా కాసేపు
-
ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్
-
గాల్లో చక్కర్లు కొట్టిన బైక్ !
-
నా జీవితంలో డ్రగ్స్ చూడలేదు
-
మద్యం మత్తులో ఈతకు వెళ్లి..
హయత్‌నగర్: మద్యం మత్తులో ఈత కొట్టేందుకు బావిలోకి దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. శనివారం హయత్‌నగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.... మౌలాలికి చెందిన సత్తయ్య కొడుకు చిన్నా (28) కూలీ. ఇతను గతంలో తారామతిపేటలో ఖుర్షిద్ అనే వ్యక్తి వ్యవసాయ బావి వద్ద పనిచేశాడు. ఈ క్రమంలో కుషాయిగూడకు చెందిన తోటి స్నేహితులు వెంకటేశ్, జాఫర్లతో కలిసి చిన్నా ఆ బావి వద్దకు శుక్రవారం వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. అనంతరం ఈత కొడతానని బావిలోకి దిగిన చిన్నా..ఎంతకూ పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. శనివారం ఉదయం బావిలో మృతదేహం తేలియాడుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి స్నేహితులను పిలిపించి విచారించారు. కాగా చిన్నా ఈతకు వెళ్లి మృతి చెందాడా? లేక స్నేహితుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రశేఖరపాళెంకు చెందిన చిట్టిబాబు(40), చిన్న(44) అనే వ్యక్తులు నార్తురాజుపాళెం వైపు ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ది్వచక్రవాహనాన్ని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయిన లారీని కోవూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు. -
వందశాతం వినోదంతో...
నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన చిన్నా 2009లో మెగా ఫోన్ చేతబట్టి ‘ఆ ఇంట్లో’ అనే హారర్ సినిమా డెరైక్ట్ చేశారు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత ఆయనో సినిమా డెరైక్ట్ చేస్తున్నారు. విహారిక సమర్పణలో వికాస్ ప్రొడక్షన్ పతాకంపై ఆడార్ రవికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి చిన్నా మాట్లాడుతూ -‘‘ ఇందులో వంద శాతం వినోదం ఉంటుంది. అందరినీ అలరించడంతో పాటు నవ్విస్తుంది. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే. ఇప్పటి పరిస్థితుల్లో బాధలు, ఏడుపులు, రక్తపాతాలు ఉన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరని నా అభిప్రాయం. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించి, ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’’ అన్నారు. నిర్మాత ఆడార్ రవికుమార్ మాట్లాడుతూ ‘‘నిర్మాత బాగుంటే మనం బాగుంటాం అనే మనస్తత్వం దర్శకుడు చిన్నాది. ఆయన ‘ఆ ఇంట్లో’ చిత్రం డెరైక్ట్ చేస్తున్నప్పుడు చూశా. ఆ ప్రతిభ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నా. ఫిబ్రవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసి, మే ఆఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బొత్స నాయుడు. -
రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి
మెదక్: రాత్రి కరెంట్‌కు తండ్రీ కొడుకులు బలయ్యారు. ఈ సంఘటన మెదక్ మండలం కొచ్చెర్వు తండాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మూడావత్ జగ్న (66), పేమ్ని దంపతుల చిన్న కుమారుడు చిన్నా (25) పొలం వద్దకు వెళ్లారు. చెరకును కొంత మేర నాటారు. ఆ తరువాత ఏమైందో ఏమో కాని ఇరువురూ స్టార్టర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా తండ్రి, సోదరుడు ఇంటికి రాకపోవడంతో మరో కుమారుడు తిన్యా పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే తండ్రి, సోదరుడు విగత జీవులుగా పడి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చిన్నాది హత్యే
ముమ్మిడివరం, న్యూస్‌లైన్ :ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి, టీడీపీ కార్యకర్త ధూళిపూడి పట్టాభిరామయ్య(చిన్నా) (51) మృతిపై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. మృతుని బంధువు ధూళిపూడి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ధూళిపూడి చక్రం, అతని అనుచరులు జామిశెట్టి అజయకుమార్, గోకవరపు శ్రీనివాసరావు, ధూళిపూడి స్వామి, ధూళిపూడి దుర్గారావు మరికొంతమంది వ్యక్తులు కలిసి ఈహత్యకు పాల్పడ్డారంటూ రాము గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత పంచాయతీ ఎన్నికల్లో చక్రం అనుచరులకు ధూళిపూడి చిన్నాకు మధ్య వివాదం చోటుచేసుకుందని, ఈ నేపథ్యంలోనే చిన్నాను చక్రం అనుచరులు పథకం ప్రకారం దాడిచేసి హతమార్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ముమ్మిడివరం ఇన్చార్జి సీఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి ముమ్మిడివరం మండలం నడిమిలంక వంతెన సమీపంలో 216 జాతీయ రహదారిపై చిన్నా మృతదేహం కనిపించింది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు మృతుని శరీరంపై కత్తి గాట్లు కనిపించడంతో హత్య కేసుగా మార్చారు. చక్రం కుటుంబ సభ్యులను, ఇతర అనుమానితులను ప్రశ్నించడం ద్వారా దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి సాధించారంటున్నారు. టీడీపీ నాయకుడైన చిన్నా హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. దీంతో అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. మృతుడు చిన్నా, ధూళిపూడి చక్రం సమీప బంధువులే. వీరిద్దరికీ గతంలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయని మృతుని బంధువులు చెబుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో కూడా వీరి మధ్య వర్గపోరు నడిచి విభేదాలు మరింత ముదిరాయంటున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన చిన్నా ఆ సందర్భంగా జరిగిన సభలో ధూళిపూడి చక్రంపై ఆర్థిక విషయాలకు సంబంధించి ఆరోపణలు గుప్పించారు. దీంతో వీరిమధ్య వివాదాలు ముదిరిన తరుణంలోనే చిన్నాను హత్య చేయించారని మృతుని వర్గీయులు బుధవారం రాత్రి సంఘటనస్థలంలోనే ఆందోళనకు దిగారు. కాగా గురువారం ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రినుంచి చిన్నా స్వగ్రామం పశువుల్లంక వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజక వర్గ ఇన్చార్జి దాట్ల బుచ్చిబాబు, ఇంకా పలువురు టీడీపీనాయకులు, కార్యకర్తలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.