జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ మంజూరు
జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ మంజూరు
Published Mon, Sep 19 2016 10:06 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
– పనితీరును పరిశీలించిన ఎస్పీ
కర్నూలు: డీజీపీ ఆఫీస్ నుంచి జిల్లా పోలీసు శాఖకు డ్రోన్ కేటాయించారు. నేరాల నియంత్రణకు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించిన పోలీసు అధికారులు ఇకపై డ్రోన్ నిఘాతో అసాంఘిక శక్తుల ఆట కట్టించనున్నారు. రద్దీ, జనసమూహ, ఎత్తు ప్రదేశాల్లో జరిగే నేరాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించే అవకాశం ఉంది. కెమెరా నిర్వహణపైన జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు 6వ బెటాలియన్ మంగళగిరిలో శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్పీ ఆకే రవికృష్ణ డ్రోన్ కెమెరాను రిమోట్‌తో ఆపరేట్ చేసి పనితీరును పరిశీలించారు. టెక్నాలజీ వాడకంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండే విధంగా డ్రోన్ కెమెరా వాడకాన్ని వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సి.వి.నరసింహులు, ఆర్‌ఎస్‌ఐ నగేష్, ఏఆర్‌పీసీలు ఓబులేసు, విజయ్‌కుమార్, ఐటీ కోర్డు టీం పీసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దీని ప్రత్యేకత:
డ్రోన్ కెమెరా 2006లో చైనా దేశస్థులు కనుగొన్నారు (ద జియాన్ ఇన్నోవేషన్) డీజేఐ ప్యాంథమ్ 4 బరువు 1380 గ్రాములు, 800 నుంచి 1000 మీటర్ల ఎత్తు వరకు ఆకాశంలోకి వెళ్తుంది. 3 నుంచి 5 కిలో మీటర్ల దూరం వరకు రిమోట్, జీపీఎస్ సహాయంతో పనిచేస్తుంది. ట్యాబ్, ఐప్యాడ్, సెల్‌ఫోన్ సహాయంతో కూడా ఆపరేట్ చేయవచ్చు.
Advertisement