కల్తీ ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం తొర్రూరులోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది.
తొర్రూరు టౌన్ : కల్తీ ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం తొర్రూరులోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. ఉదయం 7 గంటలకు విద్యార్థులకు టిఫిన్ పెట్టారు. కొంత సమయానికి ఐదుగురు విద్యార్థులకు విరేచనాలు మొదలయ్యాయి. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి భోజనం వల్లే విరేచనాలవుతున్నాయని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు.
వీరితోపాటు మరో ఏడుగురికి కూడా అవే లక్షణాలు కని పించడంతో వెంటనే హాస్టల్‌లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ డాక్టర్ రవీందర్‌రెడ్డి హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్‌జేడీ, డీఈఓకు సమాచారం అందించారు. ఉదయం అందించిన టిఫిన్, నీటి శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపించనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన ఆహారం అందించాలని యాజమాన్యానికి సూచించారు.