Adulterated food
-
ప్రజారోగ్యంతో రెస్టారెంట్ల చెలగాటం
-
హైదరాబాద్ హోటళ్లలో కల్తీ.. మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.‘‘హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం’’ అని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.కాగా, పురుగులు పట్టిన పిండి.. చింతపండు, బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్.. కిచెన్లలో అపరిశుభ్రత.. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో లభించే ఆహారం ప్రజారోగ్యానికి హానికరంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా సాచిపోయిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ.. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా
-
పాడైనయి పెడ్తున్నరట ఇడ్లీలు...కోపంతోని రోడ్డెక్కిండ్రు విద్యార్థులు
-
కల్తీ కనిపిస్తే ‘కాల్’చేయండి: హరీశ్
సాక్షి,హైదరాబాద్: ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిని ఉపేక్షించకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), ఆహార భద్రత విభాగం, ల్యాబ్‌ల పనితీరు వాటి పురోగతిపై హరీశ్‌రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆహార కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందని, ఇందులో భాగంగా రూ. 2.4 కోట్లతో నాలుగు అత్యాధునిక ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ వాహనా లను సమకూర్చుకుందన్నారు. ఐపీఎంలో రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత నిర్ధారణ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఆహార కల్తీని అరికట్టేందుకు జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయ డంతోపాటు స్పెషల్ డ్రైవ్ వీక్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలని సూచించారు. ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఆహార కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే 040–21111111 నంబర్‌కి కాల్ చేయవచ్చని లేదా ఃఅఊఇఎఏMఇ ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు అందించ వచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు పెంచేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరిం చాలన్నారు. ఏరియా ఆస్పత్రులకు బ్లడ్ బ్యాంకులు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయాలని, తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశిం చారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, పాల్గొన్నారు. -
కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు
అనంతపురం న్యూసిటీ: నగరంలోని అరవిందనగర్‌లో ఓ బేకరీ నిర్వాహకుడు కల్తీ కేకులు విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలింది. మంగళవారం ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు నగరంలోని వివిధ బేకరీలపై ఆకస్మిక దాడులు చేశారు. అరవిందనగర్ మసీదు వెనుక ఓ షెడ్డులో ప్రసాద్ అనే వ్యాపారి కల్తీ కేకులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, తూనికలు, కొలతల శాఖ సీఐ మహ్మద్‌గౌస్‌కు సమాచారం వచ్చింది. కేకులకు వాడే మైదా పురుగులు పట్టి ఉండడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేకుల్లో కలర్లు అధికంగా కలపడంతో పాటు చాక్లెట్ ఫ్లేవర్ కోసం వాడే పౌడర్‌కు తయారీ తేదీ లేదు. ఇప్పటికే వేలాది కేకులు బేకరీలకు సరఫరా అయ్యాయి. 8 బేకరీలకు నోటీసులు అనంతరం అధికారులు నగరంలోని ఎనిమిది బేకరీలు, హోటళ్లపై దాడులు నిర్వహించారు. క్లాక్‌టవర్, సప్తగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలకు నోటీసులు జారీ చేశారు. స్వగృహ స్వీట్స్, న్యూ బెంగళూరు బేకరీ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలనందజేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా, వినియోగదారుల సంఘం నాయకులు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
అంతా కల్తీ
సాక్షి, సిటీబ్యూరో: మీరు రోడ్డు వెంట వెళ్తుంటే పానీపూరీ.. కబాబ్.. బిర్యానీ.. పాయా ఇలా విభిన్న వంటకాలు నోరూరిస్తున్నాయా? కానీ వాటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తే.. జిహ్వాచాపల్యం తీరడం మాటేమో గానీ.. వాంతులు, విరేచనాలతో మంచం పట్టడం ఖాయం. గ్రేటర్లో ఇప్పడు వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో కల్తీ ఆహారం కేసులు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీలో సరిపడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఏడాదిలో సుమారు 3వేల ఆహార కల్తీ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరో 978 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 23 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు తెలిపారు. జరిమానా అరకొరే... ఆహార కల్తీ నిరోధక చట్టం కింద వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడితే ప్రస్తుతం రూ.500 నుంచి రూ.3,000 వరకు మాత్రమే జరిమానాలు విధిస్తుండడంతో ఉల్లంఘనులు వెరవడం లేదు. అపరిశుభ్ర పరిసరాల్లో వండిన వంటకాలనే వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల తనిఖీల్లో అక్రమాలు బయటపడితే తక్కువ మొత్తంలో జరిమానాలను చెల్లించి చేతులు దులుపుకుంటుండడం గమనార్హం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో నగరవ్యాప్తంగా తనిఖీలు చేయడం వీలుకావడం లేదు. వీరి సంఖ్యను 50కి పెంచాల్సి ఉంది. మొబైల్ ల్యాబ్స్ ఎక్కడ? ఆహార కల్తీని నిరోధించేందుకు మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్న బల్దియా అధికారులు... ఒక వాహనాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది అలంకారప్రాయంగానే మారింది. ఇవి కనీసం 50 వరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలోనూ 54 రకాల ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించేలా వసతులు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నాచారంలోని ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌లో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు తీసుకున్న ఆహార నమూనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో అక్రమార్కులు సులభంగా తప్పించుకుంటున్నారు. ఇక భారీ జరిమానాలు ఆహార కల్తీని నిరోధించేందుకు భారీ జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్ ఆమోదంతో ఈ చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. నూతన చట్టంలో ఆహార కల్తీకి పాల్పడే వారిపై జరిమానాలు... ప్రసుతం ఉన్న దానికి పది రెట్లు ఉంటాయని తెలిసింది. తద్వారా అక్రమార్కులు దారికొస్తారని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కల్తీ ఆహారంతో రోగాలు కల్తీ ఆహారంతో వాంతులు, విరేచనాలు, డయేరియా, జీర్ణకోశ వ్యాధులు, టైఫాయిడ్, హెపటైటిస్, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. రుచి కోసం శుచి లేని ఆహారం తీసుకొని ఇబ్బందులకు గురికావొద్దు. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ పంజా విసురుతున్న నేపథ్యంలో సదా అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ బీరప్ప,గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నిమ్స్ -
కల్తీపై విజిలెన్స్ కొరడా
ఒంగోలు: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఆహార పదార్థాల తనిఖీ విభాగం, తూనికలు కొలతల శాఖ అధికారులు నగరంలో గురువారం సంయుక్తంగా పలు బేకరీలు, షాపులపై కొరడా ఝులిపించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పదార్థాల తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సామూహికంగా దాడులు నిర్వహించారు. నగరంలోని కావేరి గ్రాండ్ హోటల్లో చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ శాంపిల్స్ సేకరించారు. స్థానిక పాత మార్కెట్ సెంటర్లోని హిందూస్థాన్ హోటల్లో మటన్ కర్రీ శాంపిల్ తీశారు. స్థానిక పద్మాలయ బేకరీలో రంగురంగుల కేకులు, పలు రకాల వస్తువులను గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ బీటీ నాయక్ మాట్లాడుతూ అదనపు ఎస్పీ రజని, డీఎస్పీ అంకమ్మరావుల ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తనిఖీ విభాగం అధికారులతో కలిపి సంయుక్తంగా రెండు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు చెప్పారు. మటన్, చికెన్లకు సంబంధించి నిల్వ ఉన్న పదార్థాలా కాదా అనేది ల్యాబ్‌కు పంపి నిర్థారణ చేస్తామని వివరించారు. పద్మాలయ బేకరీలో కేకులు, దిల్‌పసంద్‌లు శాంపిల్స్ తీసుకున్నామన్నారు. కేకులపై చాక్లెట్ కలర్ క్రీమ్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని, తాము సీజ్ చేసిన ఆరు డబ్బాలు పది నెలల గడువు మీరాయన్నారు. మరో వైపు బ్రెడ్లకు సంబంధించి ప్యాకింగ్ నిబంధనలు పాటించడం లేదని, ఫుడ్‌సేఫ్టీ లైసెన్స్ నంబర్ కూడా ప్యాకింగ్‌లపై ఉండటం లేదన్నారు. పలు కూల్డ్రింకు బాటిళ్లు కూడా గడువు మీరి ఉన్నాయన్నారు. ప్రధానంగా అధిక మోతాదులో రంగు కలిగిన పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందని, వ్యాపారులు మాత్రం నిల్వ ఉన్న పదార్థాలు విక్రయించడంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు అధిక రంగులు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తాము గుర్తించిన ఆహార పదార్థాల శాంపిల్స్ తనిఖీ విభాగం జిల్లా అధికారి వీర్రాజు నేతృత్వంలో సీజ్ చేసి ల్యాబ్‌కు పంపుతామని, ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సీఐ బీటీ నాయక్, టీఎక్స్ అజయ్‌కుమార్, ఎస్ఐ వెంకట్రావు, హెడ్‌కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ శివకుమార్, నరసయ్య, తహసీల్దార్ శామ్యూల్‌పాల్, తూనికలు, కొలతల శాఖ అధికారి అనీల్, ఆహారపదార్థాల తనిఖీ అధికారి వీర్రాజు పాల్గొన్నారు. -
డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి...
సాక్షి, హైదరాబాద్: యూరియాతో పాలు.. ఇనుప రజను పౌడర్‌తో టీ పొడి.. ఇటుక పొడితో కారం... బట్టల సోడాతో చక్కెర.. పసుపు పచ్చ మోటానిల్‌తో పసుపు పౌడర్... జంతువుల కొవ్వుతో వంట నూనె.. నగరంలో ఇలా ప్రతి వస్తువూ కల్తీమయంగా మారింది. ఏ వస్తువు తింటే ఏ రోగమొస్తుందోనని జనం అల్లాడే పరిస్థితి దాపురించింది. నగర శివారు ప్రాంతాలు అడ్డాగా కోట్ల రూపాయల కల్తీ సరుకు తయారు చేసి నగర మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర స్థాయిలో హాని కల్గిస్తుందన్న విషయం తెలిసినా కూడా కేవలం ధనార్జనే ధ్యేయంగా కల్తీ దందా జోరుగా కొనసాగుతోంది. భారీ స్థాయిలో ఎతైన గోడలతో గోదాములు నిర్మించి, సెక్యూరిటీ గార్డులను నియమించి లోపలికి ఎవరికీ ప్రవేశం లేకుండా నగర శివారు ప్రాంతాల్లో కల్తీ కర్మాగారాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఉదయం లేవగానే తాగే కాఫీ లేదా చాయ్ పౌడర్‌లో చెక్కపొట్టు.. లేదంటే ఇనుప రజను ఉండి ఉంటుందంటే మీకు ఆశ్చర్యంగా కలగవచ్చు! చాయ్ లేదా కాఫీ తయారుచేయడానికి మీరు వాడే పాలలో పంటపొలాలకు వేసే యూరియా ఆనవాళ్లు ఉంటాయంటే మీరు భయకలగ వచ్చు...ఇడ్లీ లేదా దోశ లేదా ఉప్మా లేదా.. చపాతీలు వేసుకునే గోధుమపిండిలో మీరు తినకూడని, మీ కడుపులోకి ప్రవేశించకూడని పదార్థాలు యథేచ్ఛగా కలసిపోతున్నాయన్న వాస్తవం మీరు జీర్ణించుకోలేక పోవచ్చు. కానీ ఇవన్నీ వాస్తవాలు. జీర్ణించుకోలేని సత్యాలు! బ్రాండ్ ఎదో...లోకల్ మేడ్ ఎదో...ఏది స్వచ్ఛమో.. ఏది నకిలీయో..అంతా మాయాబజార్. ఆహార పదార్థాలే ఎక్కువ చిన్న పిల్లలకు తాగించే పాల నుంచి మొదలుకొని బియ్యం, నునె, కారం, ఉప్పు, పప్పు, నెయ్యి, మసాలాలతో సహా ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులు సైతం కల్తీకి గురవుతున్నాయి. అసలుకు ఏ మాత్రం తేడా లేకుండా నకలీ వస్తువుల్ని తయారు చేస్తున్నారు. నగర శివారు నుంచే.. గతంలో నిత్యావసర వస్తువులన్నీ గ్రామాల నుంచి నగరానికి ఎగుమతి అయ్యేవి. కల్తీగాళ్ల పుణ్యమాని ఇప్పుడు ప్రతి వస్తువు పట్టణాల్లోనే తయారు చేసి గ్రామాలకు చేరుస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్, ప్రాంతాల్లోని శివారు ప్రాంతాలను కల్తీగాళ్లు తమ అడ్డాలుగా మార్చుకున్నారు. రాచకొండ పరిధిలోని పహాడీషరీఫ్, జల్పల్లి, షాహీన్‌నగర్, బాలాపూర్ శివారు, శ్రీరాంనగర్ కాలనీ, మీర్పేట్, నాదర్గుల్, బడంగ్పేట్, కందుకూరు, మామిడిపల్లి, హయాత్ నగర్, పెద్ద అంబర్పేట్, అదిభట్ల, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి మేడ్చల్ తదితర ప్రాంతాలతో పాటు సైబరాబాద్ పరిధిలోని బాలానగర్, శంషాబాద్, కాటేదాన్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, పటాన్ చెరు తదితర ప్రాంతాలను కల్తీగాళ్లు అడ్డాగా మార్చుకున్నారు. రూ.50కి అమ్మే పదార్థం పది రూపాయలకే తయారవుతుంది. ఏకంగా రూ.40 లాభం పొందుతున్నారు. ఇంకాస్త లాభం ఎక్కువ రావాలంటే ప్యాకింగ్ మార్చేసి..బ్రాండ్ అలంకారం చేసి లారీల్లో గ్రామాలకు, బస్తీలు, కాలనీల్లోని చిన్నాచితక కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కల్తీ మాఫియాతో సంబంధాలు ఏర్పరుచుకొని వినియోగదారులకు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అంటగడుతున్నారు. ఈ కల్తీ వస్తువులు మార్కెట్లో తక్కువ ధరకు లభించడంతో వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువే. కల్తీకి గురవుతున్న కొన్ని వస్తువులు ఇలా.... కారం ఇలా కల్తీ ఫ్రీజర్ గోదాముల నుంచి బూజు పట్టిన మిరపకాయలు కోనుగోలు చేస్తారు. వాటిని మర పట్టించి చెక్కపొడి, నూనె, కొన్ని రకాల రసాయానాలు కలిపి కారాన్ని తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఏ బ్రాండెడ్ కారం పొడికి డిమాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ కవర్లు తయారు చేయించి అందులో ఆ కారం వేసి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు దాన్ని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. యూరియాతో పాలు... యూరియా, నూనె, క్రిమిసంహారక మందులతో పాటు క్యాస్టిక్ సోడా, అమ్మోనియం వంటి రసాయనాలతో కల్తీ పాలను తయారు చేస్తున్నారు. శివారు ప్రాంతాలలోని పలు ఇళ్లలో కల్తీ పాలు తయారు చేసే యూనిట్లపై ఇటీవల ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్... రేషన్ బియ్యాన్ని మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి మిల్లుల్లో పాలిషింగ్ చేయించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ప్రజలకు సన్న బియ్యం అని ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. నూనె..నెయ్యి కల్తీ ఇలా... జంతు కళేబరాలతో, వ్యర్థాలను ఉపయోగించి నూనె తయారు చేస్తున్నారు. కళేబరాలను, జంతువుల వ్యర్థాలను మరిగించి వాటి ద్వారా వచ్చే కొవ్వులతో పలు రకాల రసాయనాలు కలిపి నూనె, నెయ్యిని తయారు చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో తేలింది. ఏది అసలు..ఏది నకిలీ? కల్తీ దందా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నది. అక్రమార్కులు ఏదో ఒక ఫుడ్స్ పేరుతో ఒక చోట కంపెనీ నెలకొల్పడం.. కుటీర పరిశ్రమ కింద రిజిస్టర్ చేయించుకోవడం.. ఇకపై దందా షురూ! ఓ భారీ షెడ్.. లోపల జరిగే బాగోతం బయటకు కనిపించకుండా చుట్టూ కోటను తలపించే ఎత్తయిన గోడలు.. ఎవరైనా తనిఖీ కోసం వస్తే వారిని మేనేజ్ చేసుకోవడం...ఇలా కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.. పోలీసు నిఘా పెరిగినా.. కల్తీని నిర్మూలించడానికి వాస్తవంగా ఫుడ్స్, పీసీబీ, జీహెచ్ఎంసీ, పరిశ్రమల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పనిని ప్రస్తుతం ఒక్క పోలీసులే చేస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా కల్తీ అడ్డాలపై పోలీసులు ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. పోలీసులు దాడులు పెరుగడంతో కొందరు కల్తీదారులు పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. పోలీసులు సోదాలు చేసి.. కల్తీల బండారం బయటపెడుతున్నప్పటికీ.. ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయన్నది మాత్రం సందేహమే. రాచకొండ పరిధిలోనే ఎక్కువ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే కల్తీ కార్ఖానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, కుర్కురే నుంచి మొదలుకొని నిత్యం వాడే వస్తువులు..నూనె, మసాలాలు, అల్లం వెల్లుల్లి, టీ పొడి, పాల పౌడర్ వరకు అన్ని కల్తీల కార్ఖానాలు ఇక్కడే ఉన్నాయి. రాచకొండ ఎస్వోటీ అధికారులు గత కొన్ని నెలల్లో 100 కార్ఖానాలపై దాడులు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. రోగాల దాడి ఇది నగరంలో ఒక యువతి వ్యథ. తీవ్ర జ్వరం.. ముఖంపై ఎర్రని మచ్చలు. ఇంట్లో ఏదో అలర్జీ అనుకున్నారు. వేడివల్ల వచ్చాయేమోనని సీరియస్‌గా తీసుకోలేదు. నెల గడిచినా తగ్గలేదు. ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళితే. అక్కడ రక్త పరీక్షలు చేస్తే అసలు సంగతి తేలింది. కల్తీ ఆహారం తినడంవల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధికి గురైనట్టు అక్కడ డాక్టర్లు నిర్థారించారు. నగరంలో ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. రసాయనాలు, విష పదార్థాలతో కల్తీ అవుతున్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లే జనం ఇలాంటి వ్యాధుల బారినపడుతున్నారు. కాగా కల్తీ నేరానికి ప్రస్తుతం వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ కొత్తగా కల్తీ నేరానికి 10 లక్షల జరిమానా, యావజ్జీవ జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించింది. డబ్బాశతో ఇంజినీరింగ్ విద్యార్థి.... ఇంజినీరింగ్ చదివిన ఓ యువకుడు నగర శివారు ప్రాంతమైన బడంగ్పేట్లో తన తేలితెటలతో కల్తీ నూనె, నెయ్యి తయారు చేసి జోరుగా విక్రయాలు చేశాడు. కల్తీ కోసం ప్రత్యేకంగా ఓ షెడ్‌తో పాటు మిషనరీ ఏర్పాటు చేసి ప్లాంట్ నెలకొల్పాడు. తయారు చేసిన కల్తీ నూనె, నెయ్యిని బ్రాండెడ్ స్టికర్లతో ప్యాకింగ్ చేసి నగరంతో పాటు శివారు జిల్లాలకు సరఫరా చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి 250 కిలోల కల్తీ నెయ్యి , 50 కిలోల డాల్డా, 2 వేల లీటర్ల నకలీ పామాయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
బ్రాండెడ్‌కు బదులుగా...
కేయూ క్యాంపస్: టెండర్లలో పేర్కొన్న విధంగా బ్రాండెండ్ నిత్యావసర వస్తువులు కాకుండా వేరే కల్తీ వస్తువులను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కేయూలోని కామన్ మెస్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి లారీలో కామన్మెస్కు వివిధ రకాల నిత్యావసరాల వస్తువులను తీసుకొచ్చారు. వాటిని కామన్ మెస్‌లోని స్టోర్‌కు తరలిస్తుండగా మెస్ కమిటీ బాధ్యులు పరిశీలించారు. టెండర్లో పేర్కొన్నట్లు కారం, పసుపు, ధాన్యాలు, గోదుమ పిండి బ్రాండెండ్వి కాకుండా ఇతర కంపెనీలకు చెందినవి తీసుకొచ్చారు. ఆగ్రహం చెందిన విద్యార్థులు సరుకులను లోనికి తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఆ కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లారీని కామన్ మెస్లోనికి వెళ్లనీయకుండా గేట్‌కు తాళం వేయడంతో వాటర్ క్యాన్లు బయటే ఉన్నాయి. దీంతో కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఇస్తారి వచ్చి గేట్ తాళం పగలగొట్టించి నీటి క్యాన్లను లోనికి పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డైరెక్టర్ ఇస్తారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విద్యార్థుల సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిత్యావసర వస్తువుల శాంపిళ్లనుతీసుకెళ్లారు. కాగా టెంటర్లలో పేర్కొన్న బ్రాండెడ్ వస్తువులను రెండు రోజుల్లో తీసుకురాకుంటే కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేస్తామని డైరెక్టర్ హామీ ఇవ్వ డంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. నాలుగు రకాల వస్తువుల్లో వ్యత్యాసం టెండర్లో పేర్కొన్న విధంగా 36 రకాల సరకులను కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. ఆదివారం తీసుకొచ్చిన సరకుల్లో కారం, పసుపు, గోదుమ పిండి, ధనియాలు బ్రాండెడ్‌వి తీసుకురాలేదు. మెస్ కమిటీ బాధ్యులు గుర్తించగా నేను వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాను. రెండురోజుల్లో మళ్లీ బ్రాండెండ్ వస్తువులు తీసుకురాకుంటే టెండర్‌ను రద్దుచేస్తాం. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఇస్తారి -
కలుషిత ఆహారం తిని చిన్నారుల మృతి
చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. కపుర్తలా జిల్లా కేంద్రంలోని సుఖ్ జీత్ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిన్న 33 మంది దివ్యాంగ బాలలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. -
గ్రేటర్లో ఆహారం.. అపాయం
మహానగరంలో ప్రమాదఘంటికలు మోగిస్తున్న కల్తీ పదార్థాలు... అనారోగ్యం పాలవుతున్న సిటీజనులు గ్రేటర్లో ఆహార నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ‘కల్తీ’ వ్యాపారం కట్టలు తెంచుకుంటోంది. హోటళ్లలో కనీస శుభ్రత కూడా కానరావడం లేదు. హోటళ్లు, తినుబండారాల విక్రయశాలలు, సరుకుల దుకాణాలు.. అంతటా కల్తీ జరుగుతూనే ఉంది. నగర జనాభా సుమారు కోటికి చేరింది. రోజుకు సగటున 8 లక్షల మంది బయట ఆహారం తీసుకుంటున్నారు. వీరిలో కల్తీ ఆహారం, తదితర కారణాల వల్ల ఏటా 40 వేల మంది అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారంటే నగరంలో పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. కల్తీ జరుగుతోందిలా.. : నగరంలో ‘కల్తీ’ మాఫియా వేళ్లూనుకుంది. నూనెలు, పప్పులు, పండ్లు, మాంసం, స్వీట్లు, కూల్‌డ్రింక్స్.. తదితరాల్లో వాటిలో కలిసిపోయే ప్రమాదకర పదార్థాలను కలుపుతున్నారు. వీటిని తిన్నవారు అనారోగ్యం పాలవుతున్నారు. కోటి జనాభాకు నలుగురే.. ప్రజారోగ్యం దృష్ట్యా హోటళ్లు, తినుబండారాలు, ఆహార ధాన్యాల విక్రయశాలలను నిర్ణీత వ్యవధుల్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలి. ఇందుకు నగర జనాభా నాలుగు లక్షలున్నప్పుడు నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. ప్రస్తుతం గ్రేటర్ జనాభా సుమారు కోటి. కానీ ఇప్పటికీ నలుగురే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లున్నారు. 26 పోస్టులు వుంజూరైనా భర్తీ కాలేదు. దీంతో తనిఖీలు సక్రమంగా జరగడం లేదు. చట్టం అమలేదీ..? ఆహార పదార్థాల్లో కల్తీ నిరోధానికి ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం ఉన్నప్పటికీ అమలవుతున్న దాఖలాల్లేవు. దీని ప్రకారం.. ► ప్రజలకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలి. ► ముడిసరుకు, నిల్వ ఉంచే ప్రదేశం, తయారీలో శుచి, పరిశుభ్రంగా వడ్డించడం వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఎక్కువ కాలం నిల్వ ఉంచే పదార్థాలను నిర్ణీత ఉష్ణోగ్రతల్లో తగిన జాగ్రత్తలతో ఉంచాలి. ► ఆహారంలో కల్తీ కారణంగా ఎవరైనా మృతి చెందితే.. బాధిత కుటుంబానికి హోటల్ యజమాని రూ.5 లక్షలు చెల్లించాలి. ► అంతేకాదు.. అందుకు బాధ్యుడ్ని చేస్తూ హోటల్ యజమానికి ఆరునెలల జైలు శిక్ష విధించడంతో పాటు హోటల్ సీజ్ చేయాలి. ► లెసైన్సు లేకుండా ఆహార పదార్థాల ఉత్పత్తి, సరఫరా చేస్తే రూ.25 వేల జరిమానా. తూతూమంత్రంగా తనిఖీలు... ఆహార నాణ్యతపై జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఐదేళ్లుగా అధికారులు ఆహార కల్తీలపై నమోదు చేసిన కేసుల సంఖ్యను చూస్తే వారి పనితీరు ఏ విధంగా ఉందో అంచనా వేయొచ్చు. 2014 జూన్- 2015 జులై వరకు నమోదైన కేసుల్లో 92 కోర్టుల్లో ఉన్నాయి. కల్తీ జరిగినట్లు నిర్ధరణ అయినప్పటికీ నామమాత్రపు జరిమానాలు మాత్రమే విధిస్తున్నారు. ఎవరికీ శిక్షలు పడకపోవడంతో ఈ తంతు కొనసాగుతూనే ఉంది. చాలా ప్రమాదకరం.. కల్తీ ఆహారం తినడం వల్ల ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కల్తీ ఆహారంతో డయేరియా, వాంతులు సాధారణంగా కనిపిస్తాయి. పచ్చకామెర్లకు అవకాశం ఎక్కువ. ఏ, ఈ, వైరస్ల దాడి ఉంటుంది. వివిధ అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె, మెదడు, కాలేయం వంటి పైనా ప్రభావం తప్పదు. జీర్ణవ్యవస్థ పైనా ఎఫెక్ట్ ఉంటుంది. వంటవాళ్లు, వడ్డించే వాళ్లు వ్యక్తిగత శుభ్రత పాటించకపోయినా తినేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్ నాణ్యత కరవు... నేహ, ఎంటర్పెన్యూర్ నగరం విస్తరణతో పాటే రెస్టారెంట్లూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పైకి హంగులు కనిపిస్తున్నా రెస్టారెంట్లలో నాణ్యత పాటించడం లేదనేది వాస్తవం. నిర్వాహకులు నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ రిసార్ట్‌కు వెళ్లాం. వెజ్ సూప్ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ కనిపించింది. ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింక వచ్చింది. దీంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఆహార నాణ్యత విషయంలో అన్ని నిబంధనలు అమలు చేసే వారినే ప్రజలు గెలిపించాలి. కల్తీ.. కల్తీ.. అంతా కల్తీ..పాల నుంచి పండ్ల వరకు.. జామ్ నుంచి జెల్లీ వరకు.. నెయ్యి నుంచి నీళ్ల వరకు.. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు... ఎక్కడ తిన్నా.. ఏది తిన్నా.. ఏ సమయంలో తిన్నా.. అంతా కల్తీ.. కల్తీ.. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో భాగ్యనగరిలో ‘కల్తీ’ వ్యాపారం పడగవిప్పుతోంది. ఆహారం విషమై సిటీజనుల ఆరోగ్యాన్ని కబలిస్తోంది. పర్యవేక్షణ పట్టాలు తప్పి.. ప్రజలు పాట్లు పడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఆహార నాణ్యతకు ప్రాధాన్యమిచ్చే పార్టీకే పట్టం కడతామంటున్నారు నగరవాసులు. - సాక్షి, సిటీబ్యూరో,అంబర్‌పేట చర్యలు శూన్యం.. శ్రీనివాస్‌నాయుడు, ముషీరాబాద్ నగరంలో అంతా కల్తీ అయిపోయింది. చివరికి ఆవాలు, మిర్యాలు కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఫుడ్ పాయిజాన్ జరిగి సిటీలో కలకలం రేపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హోటళ్లలో ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి. నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా కృషి చేసే నాయకుడికే నా ఓటు. -
అంగట్లో అన్నీ కల్తీ..
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండాపోయింది. తాగునీరు మొదలు రోగమొస్తే జబ్బును నయం చేసేఔషధాల్లోనూ కల్తీ. మార్కెట్లో దొరికే వస్తువు అస లా..? నకిలీనా..? అని వినియోగదారులకు అంతుచిక్కకుండా వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. స్వచ్ఛత లేని.. కల్తీ ఆహార పదార్థాలు తిన డంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కల్తీ పదార్థాలు తిని ఆస్పత్రుల పాలవుతున్న కేసుల సంఖ్య ఉత్తర తెలంగాణ జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లాలో ఆహార కల్తీ నిరోధక(ఫుడ్ ఇన్స్పెక్టర్) శాఖ మాత్రం కళ్లు తెరవడం లేదు. జిల్లాలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నా పట్టించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది. పదేళ్ల కాలంలో 3,193 నమూనాలు సేకరించిన అధికారులు.. కేవలం 170 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కల్తీ వ్యాపారంలో ఆరితేరిన కొందరు వ్యాపారులు వినియోగదారులకు గుర్తించలేని విధంగా అన్నింట్లో కల్తీ చేస్తున్నారు. పంటలు పండక.. పంట చేతికందక.. ఆర్థికంగా దెబ్బతిన్న రైతుల దుస్థితిని అవకాశంగా మలుచుకున్న కొందరు వ్యాపారులు అసలు సరుకును కల్తీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని భావించిన వినియోగదారులు ముందూ వెనకా ఆలోచించకుండానే ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. చాలా చోట్ల ‘కల్తీ’పై అవగాహన లేని ప్రజలు నాణ్యతలేని సరుకులు తిని ఆస్పత్రి పాలవుతున్నారు. అడ్రస్ లేని అధికారులు.. కల్తీని అరికట్టాల్సిన అధికారులు ఎక్కడుంటారు..? కల్తీ పదార్థాల విక్రయం గురించి ఎవరికి..? ఏ నెంబర్‌పై..? ఎలా ఫిర్యాదు చేయాలో ఫిర్యాదుదారులకు అసలే తెలియదు. కల్తీపై ప్రజల్లో అవగాహన కల్పించలేని అధికారులు.. కనీసం కల్తీపై సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. గ్రామాల పరిస్థితిని పక్కనబెడితే.. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు పట్టణ ప్రాంతాలైన నిర్మల్, మంచిర్యాల, భైంసా, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్‌లోనూ కల్తీ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలేవీ..? జిల్లా కో గెజిటెడ్ ఫుడ్ఇన్స్పెక్టర్తోపాటు ఉట్నూరు, మంచిర్యాలలో ఆహార భద్రతా అధికారి పోస్టు మంజూరై ఉంది. ప్రస్తుతం గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ బాపూతో పాటు మంచిర్యాలలో అధికారి ఉన్నారు. ఉట్నూరుకు చెందిన అధికారి నిజామాబాద్‌లో డెప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఉట్నూరు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ ఆ ప్రాంతంతో పాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల్లోని షాపులను తనిఖీ చేయాలి. మంచిర్యాల ఇన్స్పెక్టర్ మంచిర్యాలతోపాటు కాగజ్‌నగర్, చెన్నూరు, మందమర్రి ప్రాంతాల్లోని షాపులను తనిఖీ చేయాలి. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ జిల్లా పర్యవేక్షణతోపాటు భైంసా, బోథ్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీ చేయాలి. కానీ ఆయా ప్రాంతాల్లో తనిఖీలు మాత్రం జరగడం లేదు. ఎవరైన నేరుగా కలిసి ఫిర్యాదులిస్తేనే తప్ప నమూనాలు సేకరించరు. తర్వాత సేకరించిన నమూనాను హైదరాబాద్ నాచారంలోని రాష్ట్ర ఫుడ్ ల్యాబోరేటరీకి పంపుతారు. అక్కడ ఆ పదార్థంలో కల్తీ ఉందని తేలితే షాపు యజమానిపై కేసు నమోదు చేస్తారు. సిబ్బంది కొరత వ ల్ల లక్ష్యం మేరకు తనిఖీలు చేయడం లేదని జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ బాపు వివరణ ఇచ్చారు. జిల్లాలో ఆహార, నిత్యావసర వస్తువుల్లో ‘కల్తీ’ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కల్తీ ఇలా.. - అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో కిలో ధర 150 ఉంది. కొందరు వ్యాపారులు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అరటిగెల, ఆలుగడ్డ పేస్ట్ చేసి కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. - పెసరపప్పులో మోట్పప్పు కలిపి విక్రయిస్తున్నారు. మార్కెట్లో పెసరపప్పు రిటైల్ ధర కిలో రూ.120 ఉంది. కానీ ఇందులో కిలో రూ.70లు ఉన్న మోడ్ పప్పు కలిపి అమ్ముతున్నారు. - కందిపప్పు ధర మార్కెట్లో రూ.86 ఉంది. కందిపప్పును పోలి ఉండే రూ.35 కిలో ఉన్న బట్రిపప్పును కలిపి విక్రయిస్తున్నారు. - మార్కెట్లో గసగసాలు కిలో ధర రూ.500 వరకు ఉంటుంది. గసగసాల మాదిరిగా ఉండే రూ.120కిలో ఉన్న రాజ్గిరాను కలుపుతారు. - శనగపిండి ధర కిలో 70 ఉంది. అందులో బటానీ పప్పు కిలో రూ.36 కలుపుతారు. - బిర్యానీ, బగార వంటలకు ఉపయోగించే జాయ్పత్రి మార్కెట్లో కి లో రూ.2,400, పువ్వు 800 ఉంది. అందులో రూ.వెయ్యి ఉండే రాంపత్రిని కలిపి విక్రయిస్తారు. - పురుగులు పట్టిన గోధుమలను గిర్నీలో వేసి పిండి పట్టిస్తారు. - పల్లినూనె కిలో ధర(ప్యాకెట్) రూ.96.. విడిగా రూ.75 ఉంది. దీంతో రూ.21లు తగ్గించాలనే ఉద్దేశంతో వినియోగదారులు చాలామంది విడిగా కొనుగోలు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పల్లినూనెలో పామాయిల్.. కాటన్‌సీడ్ ఆయిల్.. సోయాబీన్ నూనెలు కలిపి విక్రయిస్తున్నారు. - పసుపులో రంపపొడి కలుపుతారు. - పెరుగు గట్టిగయ్యేందుకు అందులో వరి పిండి కలుపుతారు. - జిలకర్ర కిలో రూ.180 ఉంది. అందులో రూ.85 ధర ఉన్న సోంపు కలుపుతారు. - బీపీటీ బియ్యం ధర క్వింటాలుకు రూ.3,600 ఉంది. అందులో తక్కువ ధర కలిగిన రేషన్ బియ్యాన్ని రీ స్లైకింగ్ చేసి కలుపుతారు. - పాలలోనూ పౌడర్ కలుపుతూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. -
కల్తీ నిరోధానికి కఠిన చట్టాలు ఉండాలి
లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ : ఆహార పదార్థాల కల్తీపై వైఎస్సార్ సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలేవీ అంటూ సోమవారం ‘కాలింగ్ అటెన్షన్’ కింద ప్రస్తావించారు. ‘దేశానికి ఉగ్రవాద ముప్పుకంటే కల్తీ ద్వారా పొంచి ఉన్న ముప్పు తీవ్రమైనది. కనీస అవసరాలైన నీళ్లు, పాలు, వంట నూనెలతో సహా కల్తీ లేని పదార్థమంటూ లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. శుద్ధి చేసిన నీరు పేరుతో మార్కెట్లో దొరికే చాలా నీటి సీసాలు శుభ్రత లేనివే. ఇప్పుడు పాలలో కాస్టిక్ సోడా, సబ్బు, యూరియా, ఆయిల్ కలిపి తయారు చేసే సింథటిక్ పాలను కలుపుతున్నారు. సింథటిక్ పాల వల్ల క్యాన్సర్ వస్తుంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఆహార కల్తీకి పాల్పడేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. హత్యాయత్నం సెక్షన్లను వీటికి వినియోగించాలి’’ అని కోరారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారని, ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని కోరారు. ఇదే అంశంపై మరో ఇద్దరు సభ్యులు కూడా మాట్లాడారు. అనంతరం ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా దీనిపై సమాధానమిస్తూ.. ఆహార పదార్థాల కల్తీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. -
కల్తీ ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
తొర్రూరు టౌన్ : కల్తీ ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం తొర్రూరులోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో చోటుచేసుకుంది. ఉదయం 7 గంటలకు విద్యార్థులకు టిఫిన్ పెట్టారు. కొంత సమయానికి ఐదుగురు విద్యార్థులకు విరేచనాలు మొదలయ్యాయి. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి భోజనం వల్లే విరేచనాలవుతున్నాయని డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. వీరితోపాటు మరో ఏడుగురికి కూడా అవే లక్షణాలు కని పించడంతో వెంటనే హాస్టల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ డాక్టర్ రవీందర్‌రెడ్డి హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ, డీఈఓకు సమాచారం అందించారు. ఉదయం అందించిన టిఫిన్, నీటి శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపించనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, నాణ్యమైన ఆహారం అందించాలని యాజమాన్యానికి సూచించారు. -
బాలల ఆరోగ్యానికి ఏదీ ‘రక్ష’
అరకు రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది గిరిజన పేద పిల్లలే. వీరికి మూడు పూటలా కడుపు నిండా భోజనం దొరకడం కష్టమే. పౌష్టికాహరం అంటే ఏమిటో తెలియదు. ఇలాంటి వారికి ఏదైనా సుస్తీ చేస్తే మంచి ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యం చేయించే శక్తి వారి తల్లిదండ్రులకు ఉండదు. అందుకే గత ప్రభుత్వం 2010 నవంబర్ నెలలో ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే మందులు, చికిత్స అందించాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీనితో పాటు చిన్నారుల విద్య ప్రగతిపై కూడ వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ చైర్మన్‌గా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఎంఈఓ సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం ఆరోగ్య రోజుగా పాటించి, అవసరమైన వారిని రిఫరల్ ఆస్పత్రులకు తరలించాలి. వైద్య పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు, హెచ్ఎం కూడా బాధ్యత తీసుకొని సమీక్షించాలి. విద్యార్థులు తరగతిలో సాధించిన మార్కులు గ్రేడుల వివరాలు ప్రగతి రికార్డులో నమోదయ్యాయో లేదో పరిశీలించేలా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పథకంపై అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఇదంతా మూణాళ్ల ముచ్చటగా మారింది. ప్రచారార్భాటాల కోసం కోట్ల రుపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం తర్వాత ఈ పథకాన్ని విస్మరించింది. ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం వల్ల ఏ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నాడో ముందుగానే కనుగొనే అవకాశం లేకుండా పోయింది. హాజరు శాతం పెంచడం కూడా లక్ష్యమే: గిరి గ్రామాల్లోని పిల్లలు సక్రమంగా బడికి వెళ్లకుండా తల్లిదండ్రులతో కలసి వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లి పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఇలాంటి పిల్లలు సాధారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. కల్తీ ఆహారం తీసుకోవడం కూడా సమస్యగా మారుతుంది. ఈ కారణాల వల్ల పిల్లలు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాలేకపోతున్నారు. దీన్ని నివారించి హాజరు శాతం పెంచాలంటే ముందుగా విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి. అందుకు ప్రభుత్వం ‘ఆరోగ్య రక్ష’ కార్డులు జారీ చేసింది. వసతి గృహాల్లో 3 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థులకు ప్రతి నెలా, ప్రతి ఒక్కరి వైద్య వివరాలు కార్డులో నమోదు చేయాలని ఆదేశించింది. ప్రారంభంలో ఆర్భాటంగా కార్డులు అందజేసిన అధికారులు ఆ తరువాత దాని గురించి మరిచిపోయారు. అలాగే అడపా దడపా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇప్పుడేమో ఆస్పత్రులకు పరిమితమయ్యారు. ప్రత్యేక కమిటీలు కూడా ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియడం లేదు. 40శాతం మందికే కార్డులు అరకులోయ మండలంలోని ఏడు గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరంలో ఇచ్చిన ఆరోగ్య రక్ష కార్డులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఆ తరువాత ఏ ఒక్క విద్యార్థికి కార్డులు ఇవ్వలేదు. అప్పట్లో 8,9,10వ తరగతులు చదివిన విద్యార్థులు ఆయా పాఠశాలల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఏ పాఠశాలలో కూడా 40 శాతం మందికి మాత్రమే ఈ కార్డులున్నాయి. ఈ కార్డులున్నప్పటికి వీటిలో ఆరోగ్య పరీక్షలు జరిపిన వివరాలు కానీ, చికిత్స అందించిన వివరాలు వంటివి పొందుపర్చలేదు. విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలు కూడా ఏ విద్యార్థి కార్డులోనూ కనబడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి విద్యార్థికి ఆరోగ్య రక్ష కార్డులు జారీ చేసి, వీరి వివరాలు నమోదు చేయాల్సి ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అవసరమైన వారిని రిఫరల్ అస్పత్రులకు తీసుకువెళ్లి మెరుగైన వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా...ఎవ్వరికీ పట్టడం లేదు. కంఠబౌంషుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 606 మంది ఉండగా 300 మందికి ఆరోగ్య కార్డులు లేవని హెచ్ఎం జానకమ్మ తెలిపారు. -
పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు
ఏటీఅగ్రహారం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం నిషేధించిన అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను, ఆహార పదార్థాలతో మిశ్రమమైన పొగాకు ఉత్పత్తులను జిల్లాలో విక్రయిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జోన్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రభుత్వం మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సోమవారం ఆయన న్యూస్‌లైన్‌కు తెలిపారు. పొగాకు ఉత్పత్తుల(సిగరెట్లు, బీడీలు మినహా) విక్రయాలతోపాటు కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా తనకు (సెల్: 9440379755) తెలియజేయాలని కోరారు. గుట్కా, పాన్‌పరాగ్, మరికొన్ని పొగాకు ఉత్పత్తులపై నిషేధం గడువు ఈనెల 9వ తేదీతో ముగియడంతో నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఈనెల 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు న్యూస్‌లైన్‌కు వెల్లడించారు. నిషేధిత ఉత్పత్తులు ఇవే..పొగాకుతో కలిసి ఉన్న పాన్ మసాలా, గుట్కా, చూయింగ్ టుబాకో, చాప్ టుబాకో, ప్యూర్ టుబాకో, ఖైనీ, కారా, సెంటెడ్ టుబాకో, ఫ్లేవర్ టుబాకోలను ప్రభుత్వం నిషేధించింది. నిషేధించిన పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే సెక్షన్-58 ప్రకారం స్టాక్‌ను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు. మొదటిసారి పట్టుబడిన వ్యక్తులపై రూ.2 లక్షలు జరిమానా, రెండవ విడత అదే వ్యక్తి పట్టుబడితే రూ. 4 లక్షలు జరిమానా విధిస్తారు. మూడవ సారి పట్టుబడితే సదరు వ్యాపారి లెసైన్సును పూర్తిగా రద్దు చేస్తారు. హానికరమైన ఉత్పత్తులు అని పరీక్షల్లో తేలితే రూ.10 లక్షల జరిమానాతోపాటు జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంది. వ్యాపార లెసైన్సులు పొందాలి.. జిల్లాలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులందరూ తప్పనిసరిగా ప్రతిఏటా లెసైన్సులు పొందాలి. వచ్చేనెల 4వ తేదీలోగా లెసైన్సు పొందకుంటే, తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేస్తామని పూర్ణచంద్రరావు తెలిపారు. వీరికి కోర్టులో రూ. 5 లక్షల జరిమానాతోపాటు, ఆరు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.