సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.
‘‘హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం’’ అని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.
కాగా, పురుగులు పట్టిన పిండి.. చింతపండు, బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్.. కిచెన్లలో అపరిశుభ్రత.. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో లభించే ఆహారం ప్రజారోగ్యానికి హానికరంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా సాచిపోయిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment