Hotel Owners
-
ఉజ్జయిని: షాపులపై ఓనరు పేరు తప్పనిసరి
భోపాల్: కన్వర్ యాత్ర దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
హైదరాబాద్ హోటళ్లలో కల్తీ.. మంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హోటల్స్ అసోసియేషన్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి.. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు.‘‘హైదరాబాద్ బిర్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నాం. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తాం’’ అని మంత్రి రాజనర్సింహ వెల్లడించారు.కాగా, పురుగులు పట్టిన పిండి.. చింతపండు, బూజు పట్టిన క్యారెట్లు.. గడువు తీరిన సాస్.. కిచెన్లలో అపరిశుభ్రత.. ఇలా జిల్లా పరిధిలో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టుల్లో లభించే ఆహారం ప్రజారోగ్యానికి హానికరంగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నా మొక్కుబడిగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా సాచిపోయిన, బూజు పట్టిన ఆహార పదార్థాలు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. -
వర్కర్‌పై కర్కశత్వం.. రెండేళ్లుగా చిత్రహింసలు.. బెల్టుతో..
సాక్షి,జవహర్‌నగర్: టిఫిన్ సెంటర్లో పని చేస్తున్న వర్కర్‌పై ఓ యజమాని తన కర్కశత్వాన్ని చూపించాడు. రెండు నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా జమ్మిగడ్డ ప్రాంతంలో నిససిస్తున్న తిప్పారపు పవన్‌కుమార్ నాలుగేళ్లుగా తన ఇంటి సమీపంలోని మణికంఠ టిఫిన్ సెంటర్లో పని చేస్తున్నాడు. కాగా హోటల్యజమాని తాడూరి అనిల్ గత రెండేళ్లుగా పవన్‌ను వేధిస్తూ చిత్రహింసలు గురిచేయడమే కాకుండా బెల్ట్‌తో ఒళ్లంగా దారుణంగా కొట్టాడు. బాధితుడు పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని హోటల్ యజమాని తాడూరి అనిల్‌ను శువ్రవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: గమనించాలి: పోలీస్ ఫోన్ నెంబర్లు మారనున్నాయ్! -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
హోటల్లో దిగేవారి వివరాలు అందజేయాలి : సీపీ
విజయవాడ సిటీ : నగరంలోని హోటల్ యజమానులు రూమ్‌లు అద్దెకు తీసుకునే వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందజేయాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి ఆ విధంగా చేయని హోటల్/లాడ్జి యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని హోటల్, లాడ్జి యజమానులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ గతంలో పోలీసు స్టేషన్లకు వివరాలు అందజేయడం వలన తనిఖీల సమయంలో కటుంబంతో సహా వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఎవరైనా వ్యక్తులు గదులు అద్దెకు తీసుకున్న వెంటనే సంబంధిత పోలీసు స్టేసన్‌కు సమాచారం అందే విధంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ రూపొందించామన్నారు. ఆయా లాడ్జీ లు, హోటల్ యజమానులు కంప్యూటర్, నెట్ కనెక్షన్ తీసుకొని గదిని అద్దెకు తీసుకున్న వారి వివరాలను నిర్దేశించిన సైట్లో పొందుపరచాల న్నారు. ఈ వివరాలు వెంటనే సమీప పోలీసు స్టేషన్లకు చేరుతుందన్నారు. జాబితాను విశ్లేషించుకొని అనుమానిత వ్యక్తులపై మాత్రమే విచారణ నిర్వహిస్తామని చెప్పారు. గదులు అద్దెకు తీసుకున్న వారికి అసౌకర్యం లేకుండా భద్రతా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ జీ.వి.జీ.అశోక్‌కుమార్, ఈస్ట్‌జోన్ ఏసీపీ అభిషేక్ మహంతి, సెంట్రల్ జోన్ ఏసీపీ వై.ప్రభాకర నాయుడు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ ఎస్.రమేష్‌బాబు, హోటల్, లాడ్జీల యజమానులు, వారి ప్రతినిథులు పాల్గొన్నారు. -
హోటల్ గదుల ధరలకు రెక్కలు
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారాన్ని సొమ్ము చేసుకుంటున్న యజమానులు న్యూఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ శనివారం ప్రమాణస్వీకారం చేయనుండడంతో వివిధ హోటళ్లలోని గదుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రానుండడంతో హోటల్ యజమానులు గదుల కోసం వచ్చే వారి నుంచి 200 శాతం అధిక ధరలను వసూలు చేస్తున్నారు. పహారాగంజ్-కరోల్‌బాగ్‌లోని హోటళ్లలో మామూలుగా ఉండే రూ.500-1200 గదుల ధరలు ఇప్పుడు రూ.2,500కు చేరుకున్నాయి. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో నగర సందర్శనకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. అయితే రెండు రోజులుగా సందర్శకుల తాకిడి పెరగడాన్ని కూడా సందట్లో సడేమియాగా హోటల్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక హోటళ్లలోని గదులు సందర్శకులతో నిండిపోయాయి. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గదుల ధరలకు రెక్కలొచ్చాయని పహారాగంజ్లోని ఓ హోటల్ యజమాని తెలిపాడు. ఇదే అదునుగా గదుల ధరలను రూ.700 నుంచి రూ. 1,500కు పెంచి అద్దెకు ఇచ్చిన ట్టుమరో యజమాని తెలిపాడుు. మరో రెండు వారాల పాటు ఈ పరిస్థితిలో మార్పు వచ్చే సూచన లేకపోవడంతో గదులు దొరకని సందర్శకులు సహాయం కోసం ఆప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ప్రమాణస్వీకారానికి హాజరయ్యే కార్యకర్తల కోసం ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఎవరికి వారే చేసుకోవాలని కోరినట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.