విజయవాడ సిటీ : నగరంలోని హోటల్ యజమానులు రూమ్‌లు అద్దెకు తీసుకునే వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందజేయాలని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి ఆ విధంగా చేయని హోటల్/లాడ్జి యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని హోటల్, లాడ్జి యజమానులతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ గతంలో పోలీసు స్టేషన్లకు వివరాలు అందజేయడం వలన తనిఖీల సమయంలో కటుంబంతో సహా వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించామన్నారు.
ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ఎవరైనా వ్యక్తులు గదులు అద్దెకు తీసుకున్న వెంటనే సంబంధిత పోలీసు స్టేసన్‌కు సమాచారం అందే విధంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ రూపొందించామన్నారు. ఆయా లాడ్జీ లు, హోటల్ యజమానులు కంప్యూటర్, నెట్ కనెక్షన్ తీసుకొని గదిని అద్దెకు తీసుకున్న వారి వివరాలను నిర్దేశించిన సైట్‌లో పొందుపరచాల న్నారు. ఈ వివరాలు వెంటనే సమీప పోలీసు స్టేషన్లకు చేరుతుందన్నారు. జాబితాను విశ్లేషించుకొని అనుమానిత వ్యక్తులపై మాత్రమే విచారణ నిర్వహిస్తామని చెప్పారు. గదులు అద్దెకు తీసుకున్న వారికి అసౌకర్యం లేకుండా భద్రతా చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీ జీ.వి.జీ.అశోక్‌కుమార్, ఈస్ట్‌జోన్ ఏసీపీ అభిషేక్ మహంతి, సెంట్రల్ జోన్ ఏసీపీ వై.ప్రభాకర నాయుడు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ ఎస్.రమేష్‌బాబు, హోటల్, లాడ్జీల యజమానులు, వారి ప్రతినిథులు పాల్గొన్నారు.
హోటల్‌లో దిగేవారి వివరాలు అందజేయాలి : సీపీ
Published Sun, Apr 5 2015 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement