భోపాల్: కన్వర్ యాత్ర దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది.
క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.
నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment