deatails
-
ఉజ్జయిని: షాపులపై ఓనరు పేరు తప్పనిసరి
భోపాల్: కన్వర్ యాత్ర దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
లెక్క లేదు
నగర పాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ నియామకాలకు లెక్క లేదు. వీరు ఎక్కడ పని చేస్తున్నారో ఉన్నతాధికారులు అడిగినా.. సమాధానం చెప్పే దిక్కు లేదు. వీరి జీతాల చెల్లింపుల్లో అవినీతికి అడ్డూఅదుపూ లేదు. బడ్జెట్లో ఏటికేడు జీతాల లెక్కలు రెట్టింపైనా ఎవరెవరికి పంచుతున్నారో రికార్డు లేదు. ‘ఏమిటిది ?.. ఏం జరుగుతోంది.. వెంటనే లెక్కలు తేల్చండి’ అంటూ కమిషనర్ మండిపడినా 20 రోజులుగా ఆయా విభాగాల అధికారులు ఖాతరు చేసింది లేదు. ఇప్పటి వరకు పని చేసిన సిబ్బందికి ఈ నెల జీతాలు వచ్చిందీ లేదు. ఇదీ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు. సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల్లో సిబ్బంది కొరత ఉండటంతో అవుట్ సోర్సింగ్ ద్వారా కొందరిని నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. వీరికి నగరపాలక సంస్థ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇంజినీరింగ్ విభాగంలో 930 మంది, ప్రజారోగ్య విభాగంలో 1667 మంది సిబ్బంది అవుట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరెక్కడ పని చేస్తున్నారో ఆయా విభాగాల అధికారులకే తెలియని పరిస్థితి. డిప్యూటేషన్ల పేరుతో రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం వంటి అనేక విభాగాల్లో వీరిని కేటాయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు అవినీతి అధికారులు అసలు ఎవరూ పని చేయకుండానే ఉన్నట్లుగా లెక్కలు చూపుతూ నెల నెలా జీతాలు మార్చుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ఇళ్లలో పనులకూ వీరే.. ప్రజారోగ్య విభాగంలో 1667 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లిస్తుండగా, సుమారుగా 300 మంది వరకు నగరపాలక సంస్థతోపాటు, వివిధ శాఖల అధికారుల ఇళ్లల్లో పని చేస్తున్నట్లు సమాచారం. సొంత పనులకు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగించుకుంటూ జీతాలు మాత్రం నగరపాలక సంస్థ ద్వారా చెల్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఇంజినీరింగ్ విభాగంలో 930 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నట్లు చెబుతుండగా, ఇటీవల ఏఈలు తమ వద్ద పని చేసే సిబ్బంది లెక్కలు ఎస్ఈకి సమర్పించారు. ఇందులో మాత్రం 888 మంది మాత్రమే పని చేస్తున్నట్లుగా చూపడం చూస్తుంటే మిగతా సిబ్బంది ఎక్కడైనా పని చేస్తున్నారా ? లేక వారు లేకుండానే బినామీ పేర్లతో జీతాల డబ్బులు కాజేస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో అనేక మంది అధికారుల ఇళ్లల్లో డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులుగా వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా రెట్టింపు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల ఖర్చు ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం 2016–17 సంవత్సరానికిగాను రూ. 25 కోట్లు ఖర్చు చేయగా, 2017–18 సంవత్సరానికి అది సుమారుగా రూ. 50 కోట్లకు చేరింది. బిల్లులు నిలిపివేసి నివేదిక కోరిన కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది మార్చి జీతాల బిల్లులను వివిధ శాఖల అధికారులు కమిషనర్ శ్రీకేష్ లత్కర్‌కు ఆన్లైన్ ద్వారా పేర్లు లేకుండా పంపారు. అయితే వీటిపై అనుమానం వ్యక్తం చేసిన కమిషనర్ జీతాలు నిలిపివేసి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎక్కడెక్కడ పని చేస్తున్నారు ? వారి వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. 20 రోజులుగా నివేదిక ఇవ్వని అధికారులు లెక్కలు చూపితే అధికారుల ఇళ్లలో పని చేసే వారితోపాటు అసలు పనిచేయని వారి గుట్టు సైతం బయటపడుతుందని భయమో ఏమోగానీ 20 రోజులు దాటుతున్నా ఇంత వరకు వివరాలు కమిషనర్‌కు అందించలేదు. దీంతో నిజంగా పని చేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేయాలని గత కమిషనర్ అనురాధ అధికారులను ఆదేశించినప్పటికీ ఇంత వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కంప్యూటర్ ఆపరేటర్‌ను మంత్రి పేషీకి పంపాం: రామచంద్రారెడ్డి, ఏసీ గుంటూరు నగరపాలక సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న అవుట్ సోర్సిం గ్ఉద్యోగిని డిప్యూటేషన్‌పై మంత్రి పేషీకి పంపుతూ ఆర్డర్ ఇచ్చాం. మిగతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిప్యూటేషన్‌పై ఇతర విధులు నిర్వర్తిస్తున్నట్లు మా దృష్టిలో లేదు. అకౌంట్ సెక్షన్లో కొంత ఆలస్యం కావడంతోపాటు, కమిషనర్ సెలవులో ఉండటంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి. -
నెట్టింటి చిచ్చు!
తికమక పెడుతున్న వెబ్‌ల్యాండ్ – రాత్రికి రాత్రి మారిపోతున్న భూముల వివరాలు – పెరుగుతున్న భూ వివాదాలు – విలువ లేని ఈ–పాస్ పుస్తకాలు – తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ – దోచుకుంటున్న అధికారులు, దళారులు – ప్రభుత్వ నిర్ణయంపై గుర్రు ప్రయివేట్ భూమి.. వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమి...(పోటో: 43బి – చిన్న చెంచన్న ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన 1–3 సర్వే నెంబర్లో 7.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో నేరడుచెర్ల గ్రామానికి చెందిన ముసలన్న, చిన్న చెంచన్న, పెద్ద చెంచన్న, శ్రీనివాసులు, శివమ్మల పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లోని భూములపై 1924 నుంచే రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది ప్రయివేటు భూమిగా పేర్కొంటు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీకి రెకమెండ్ చేశారు. కర్నూలు(అగ్రికల్చర్): వెబ్‌ల్యాండ్ ప్రక్రియ కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. మొన్నటి వరకు ఆన్లైన్లో ఒకరి పేరు మీదున్న భూమి.. రాత్రికి రాత్రి మరొకరి పేరిట మారిపోతోంది. టెక్నాలజీ ఆధారంగా తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లు.. వీఆర్వోలు.. అక్రమార్కులు రైతుల తలరాత మార్చేస్తున్నారు. భూమి విలువను బట్టి ఆన్లైన్లో ఎక్కించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ చేస్తుండటం చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ వివాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే టైటిల్డీడ్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లోని వివరాలతోనే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలలుగా ఈ–పాసు పుస్తకాలు జారీ చేస్తుండగా.. వీటికి విలువ లేదని ప్రభుత్వమే ప్రకటిస్తోంది. రైతులకు భూములు ఉన్నాయనడానికి ఇవి ఆధారం మాత్రమేనని.. అన్నింటికీ వెబ్‌ల్యాండ్ వివరాలే ప్రామాణికమని తేల్చడం గందరగోళానికి తావిస్తోంది. ఆన్లైన్లో సవరణలకు పేరుకుపోతున్న దరఖాస్తులు వెబ్‌ల్యాండ్‌లో భుముల వివరాలను సర్వే నెంబర్ల వారీగా నమోదు చేయడంలో వీఆర్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పట్టాదారు పాసు పుస్తకంలో ఎన్ని ఎకరాలు నమోదు చేసి ఉంటే వెబ్‌ల్యాండ్‌లోనూ అన్నే ఎకరాలు న మోదు చేయాలి. వీఆర్ఓలు మాత్రం తక్కువగా నమోదు చేయడం.. వందలు, వేలాది సర్వే నెంబర్లను ఎగ్గొట్టడం వల్ల రైతులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వీటిని సవరించుకోవాలంటే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో భూముల వివరాలను సవరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 45వేల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇందులో మామూళ్లు ఇచ్చుకున్న వాటిని ఆమోదిస్తూ.. తక్కిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇలాంటి దరఖాస్తులే దాదాపు 25వేల వరకు ఉండటం గమనార్హం. ప్రభుత్వ భూముల జాబితాలో ప్రయివేటు భూములు ప్రయివేటు భూములను సైతం రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూములుగా చూపించారు. ఇందువల్ల వేలాది మంది రైతులు భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక అల్లాడుతున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్నాయనే కారణంతో 1915 నుంచే రిజిస్ట్రేషన్లు అయిన భూములను నేడు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా కనపర్చారు. వీటికి దశాబ్దాల క్రితమే పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. అయితే తాజాగా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ భూమిగా ముద్రవేయడం వల్ల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. సొంత భూమిపైనే ప్రభుత్వం రైతులకు హక్కు లేకుండా చేసింది. జిల్లాలో దాదాపు 1.20 లక్షల సర్వే నెంబర్లను ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చి 1.60 లక్షల రైతుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది.