చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి.
కపుర్తలా జిల్లా కేంద్రంలోని సుఖ్ జీత్ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిన్న 33 మంది దివ్యాంగ బాలలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
కలుషిత ఆహారం తిని చిన్నారుల మృతి
Published Tue, Aug 2 2016 1:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
Advertisement