differently abled children
-
ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో
CEO of IndiGo Ronojoy Dutta has expressed regret: దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు. ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటన గురించి దత్తా మాట్లాడుతూ..."మా కస్టమర్లకు మర్యాదపూర్వకంగా, దయతో కూడిన సేవను అందించడమే మాకు ముఖ్యం. ఐతే భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది విమానం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను". అని అన్నారు. అంతేకాదు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఘటన తాలుకా వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. Here is the video of the incident that happened at Ranchi airport where @IndiGo6E airlines denies boarding to a special need child along with his child. Seems lack of empathy from Indigo staff, not the first time though. Indigo to issue a statement shortly. @JM_Scindia https://t.co/5ixUDZ009a pic.twitter.com/SyTNgAQIT6 — Dibyendu Mondal (@dibyendumondal) May 8, 2022 (చదవండి: ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింథియా ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్) -
ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని స్పష్టంచేశారు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం కాకూడదని.. ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విటర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి👉 చిరుతతో పోరాటం.. అధికారులపై దాడి.. వైరల్ వీడియో There is zero tolerance towards such behaviour. No human being should have to go through this! Investigating the matter by myself, post which appropriate action will be taken. https://t.co/GJkeQcQ9iW — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 9, 2022 ఏం జరిగింది? హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఇండిగో ఏమంటోంది? రాంచి ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనపై ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. భయంతో ఉన్న ఆ చిన్నారి స్థిమిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం వరకూ గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని.. కానీ ఫలితం లేకపోయిందని తెలిపింది. ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్లో వసతి సౌకర్యం కల్పించామని.. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరుకున్నారని వివరించింది. చదవండి👉🏻 రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న.. ఎంపీల ఓటు విలువ -
మరోసారి చిన్నారి ప్రేమను చాటుకున్న లారెన్స్
తమిళసినిమా: చిన్నారులకు సహాయం చేయడంలో సినీ నటులు, దర్శకుడు రాఘవ లారెన్స్ ముందుంటాడు. ముఖ్యంగా దివ్యాంగ చిన్నారులకు ఆయన అనేక సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా అజిత్ అనే దివ్యాంగ చిన్నారి లారెన్స్ వీరాభిమాని అని, అతడు ఒక్కసారైనా లారెన్స్ను చూడాలని ఇష్టపడుతున్నట్టు తన అభిమాన సంఘం నిర్వాహకుల ద్వారా తెలిసింది. అంతే వెంటనే లారెన్స్ ఆ చిన్నారిని కలుసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. తన చిన్నారి అభిమానితో మన హీరో కొన్ని నిమిషాల పాటు చర్చించి, తర్వాత ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆ దివ్యాంగ చిన్నారి ఆశ నెరవేర్చాడు. ఇలా తనకు చిన్నారులపై ఉన్న ప్రేమను మరోసారి లారెన్స్ చాటుకున్నాడు.ఈ ఫొటోలు, వీడియో దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా రాఘవలారెన్స్ మంచి మనస్సుకు హ్యాట్సాప్ అని అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. -
కలుషిత ఆహారం తిని చిన్నారుల మృతి
చండీగఢ్: వాళ్లంతా దివ్యాంగులు. కొందరికి చూపులేదు, ఇంకొందరు బుద్ధిమాంద్యులు.. అందరూ చిన్నపిల్లలే. అంతసేపు హాయిగా ఆడుకున్నవాళ్లుకాస్తా మధ్యాహ్నం భోజనం తిన్నతర్వాత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. పిల్లలు ఒకొక్కరిగా రాలిపోయారు. పంజాబ్ లోని కపుర్తలా జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం కనిపించిన దృశ్యాలివి. కపుర్తలా జిల్లా కేంద్రంలోని సుఖ్ జీత్ ఆశ్రమంలో కలుషిత ఆహారం తిన్న 33 మంది దివ్యాంగ బాలలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 31 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.