Tourist hub
-
‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడు..
చారిత్రక ప్రాభవానికి, తెలుగు వారి పౌరుషానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన కొండవీడు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మలిచేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. మహోన్నత చరిత్ర, ప్రాచీన సంపద కలిగిన కొండవీడుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిది. హైదరాబాద్‌కు వన్నె తెచ్చిన ‘ఆంధ్రా’ గోల్కొండగా కొండవీడుకు పూర్వవైభవాన్ని తెచ్చే ఆలోచన చేస్తోంది. ఇందుకు ఆద్యుడు మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. రాజన్న 2005 జులైలో రూ.5 కోట్ల నిధులిచ్చి కొండవీడు అభివృద్ధికి తొలిబీజం వేశారు. ఆ బీజమే సందర్శకులను ఆకర్షించే ‘ఘాట్‌రోడ్డు’ అనే మహావృక్షంగా రూపుదాల్చింది. పచ్చని ప్రకృతి.. ఆహ్లాద వాతావరణం సొంతం చేసుకున్న ఈ గిరిదుర్గం నేడు దశల వారీగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యడ్లపాడు: కొండవీడు కోటను అభివృద్ధి చేసే దిశలో భాగంగా నగర వనం నిమిత్తం రూ.13.35 కోట్లు విడుదలయ్యాయి. వీటితో తలపెట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీహెచ్ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే విడదల రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రానున్నారు. చదవండి: ఏడు ఊర్లు కలసి హాల్వి.. దీనికో చరిత్ర ఉంది! అత్యంత ప్రాధాన్యంగా.. నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని ప్రాధాన్యతనిచ్చిన అభివృద్ధి పనుల్లో కొండవీడు పర్యాటకం ఒకటి. శతాబ్దాల ఘన చరిత్రలో భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కొండవీడు ప్రగతికి నడుంబిగించారు. అన్నిశాఖల వారిని సమన్వయం చేసుకు ని బృహత్తర ప్రణాళికలు రూపొందించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రమంతుల్ని సైతం కొండవీడుకు తీసుకువచ్చి పర్యాటకంగా చేయాల్సిన పనులను గురించి వివరించారు. వారితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి నివేదికలను సమర్పించారు. దీంతో కొండవీడు అభివృద్ధికి సుమారు వంద కోట్ల నిధులు వచ్చేలా మార్గం సుగమం అయ్యింది. చూడముచ్చటైన అందాలు! ఘాట్‌రోడ్డు ప్రారంభంలో చెక్‌పోస్టు నిర్మించగా..కొండపై చారిత్రక ప్రాంతం ప్రారంభంలో విభిన్నంగా నిర్మించిన ప్రవేశద్వారం (ఆర్చి) అటవీ అందాలకు ప్రతీకగా దర్శనమిస్తోంది. సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల పార్కు, వాహనాల పార్కింగ్, నడకదారుల ఏర్పాటు ఫ్లోరింగ్ టైల్స్‌తో సుందరీకరణ చేశారు. వాటర్ ఫౌంటెన్, సోలర్ విద్యుత్తు దీపాల ఏర్పాటు తదితర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరుగుదొడ్ల నిర్మాణం, ఆంజనేయస్వామి గుడి పక్కన 10వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్ నిర్మాణం కొనసాగుతోంది. కొండపై ఉన్న చెరువుల గట్లపై నడకదారి..దానికిరువైపులా మొక్కలు..రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం చెట్ల కొమ్మల ఆకారంలో బల్లలు, అక్కడక్కడా చెట్ల చుట్టూ అరుగులు ఏర్పాటు చేసి సుందరీకరణ చేశారు. కొండవీడు రాకపోకలకు అనువుగా రూ.24 కోట్ల వ్యయంతో దింతెనపాడు వయా కొండవీడు, ఫిరంగిపురం రోడ్డు(డీఎస్ రోడ్డు) పనులు కొనసాగుతున్నాయి. చరిత్ర పేజీలో అభివృద్ధి అక్షరాలు లిఖించాలి చారిత్రక, పర్యాటక ప్రాంతాల ప్రగతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొండవీడు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపే చొరవ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఇప్పటికే కోటిన్నర నిధులతో ప్రగతి సాధించగా, తాజాగా వచ్చిన కేంద్ర అటవీ అనుమతులతో రూ.11.80 కోట్ల తో రెండోదశ ఘాట్‌రోడ్డు, రూ.3.5 కోట్లతో విద్యుత్‌సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నాం. ఇలా కొండవీడు చరిత్ర పుస్తకంలో అభివృద్ధి అక్షరాలతో లిఖించిన పేజీల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్ష. – విడదల రజిని, ఎమ్మెల్యే -
కరీంనగర్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం : గంగుల
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణాన్ని టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా బుధవారం తెలంగాణచౌక్, ఐబీచౌరస్తా, నాఖా చౌరస్తాల జంక్షన్ సుందరీకరణ పనులకు గీతాభవన్ చౌరస్తా వద్ద మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతితో కలిసి భూమిపూజ చేశారు. కమలాకర్ మాట్లాడుతూ.. మూడు జంక్షన్ల అభివృద్ధికి రూ.50లక్షలు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను కూడ అభివృద్ధి చేస్తున్నామని, ప్రధాన రహదారుల్లో డివైడర్లు నిర్మించి లైటింగ్ సిస్టమ్ అమర్చి, మధ్యలో మొక్కలు పెంచి అందంగా తయారు చేశామని తెలిపారు. ఇప్పటికే కమాన్, కోర్టు, మంచిర్యాలచౌరస్తా జంక్షన్లను సుందరీకరణ చేశామని తెలిపారు. మిగిలిన తెలంగాణ తల్లి జంక్షన్‌ను త్వరలో సుందరీకరిస్తామని చేస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, కార్పొరేటర్ వాల రమణరావు, తదితరులు ఉన్నారు. పనులు వేగంగా పూర్తిచేయాలి కరీంనగర్ స్మార్ట్‌సిటీ పనులు వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో స్మార్ట్‌సిటీ పనులు, పట్టణ ప్రగతి, హరితహారంపై కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి, సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. స్మార్ట్‌సిటీ 1,2,3 ప్యాకేజీల్లో రూ.290 కోట్లతో చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. రాజా టాకీస్ నుంచి బొమ్మ వెంకన్న ఇంటి వరకు చేపట్టిన రోడ్డును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ చౌక్ నుంచి గాంధీ రోడ్డు వరకు రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలని అన్నారు. స్లాటర్ హౌస్ వేరే చోటికి మార్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి టెండర్లు పిలవాలని తెలిపారు. పార్కుల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతున్నాయని, వేగం చేయాలని కోరారు. హరితహారంలో భాగంగా నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల రోడ్ల మధ్య డివైడర్లలో కోనకార్పస్ మొక్కలు నాటాలని సూచించారు. పుట్‌పాత్ ఆక్రమణపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. డిప్యూటీమేయర్ స్వరూపారాణి, ఎస్ఈ కృష్ణరావు, ఈఈ రామన్, డీసీపీ సుభాశ్, ఏసీపీ శ్రీనివాస్, స్మార్ట్‌సిటీ టీం లీడర్ జగదీశ్, తదితరులు ఉన్నారు. చదవండి: నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి -
ఇక రాత్రిపూట పులులను చూడొచ్చు
సాక్షి, హైదరాబాద్: పర్యావరణహిత పర్యాటక హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ పార్క్‌ను ఏర్పాటు చేసే దిశగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తోంది. గతంలోనే గండిపేట మండలం కొత్వాల్‌గూడలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఏకో టూరిజం పార్క్ ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రణాళిక రూపొందించింది. తాజాగా అదే ప్రాం తంలో నైట్ సఫారీ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించింది. సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో నైట్ సఫారీ పార్క్ అభివృద్ధి చేసిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులతో పురపాలక మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ చర్చలు జరిపా రు. సింగపూర్ నైట్ సఫారీ పార్క్ మాదిరిగా కొత్వాల్‌గూడ సఫారీ పార్క్‌ను అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండటం, హిమాయత్‌సాగర్ సమీపంలో ఉండటంతో నైట్ సఫారీ పార్క్ పర్యాటకుల దృష్టిని ఆకర్షించగలుగుతుందని, హైదరాబాద్‌కు పర్యాటకంగా మంచి పేరు తీసుకొస్తుంద ని అభిప్రాయపడ్డారు. గండిపేట చెరువు అభివృద్ధికి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, ఇంజనీరింగ్ విభాగాధిపతి బీఎల్‌ఎన్‌రెడ్డిలతో కలసి కొత్వాల్‌గూడ ప్రాంతాన్ని సందర్శించిన బెర్నార్డ్ హర్నిసన్ అండ్ ఫ్రెండ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సంసిద్ధతను వ్యక్తం చేయడంలో నైట్ సఫారీ పార్క్‌కు సంబంధించిన డిజైన్లను సెప్టెంబర్‌లోపు సమర్పించాలని మంత్రి సూచించారు. నైట్ సఫారీ పార్క్ అంటే... సింగపూర్‌లో 98.84 ఎకరాల విస్తీర్ణంలో 6 అడవులను రూపొందించారు. మధ్య, మధ్యలో లైట్లుంటాయి. రాత్రి వేళల్లోనే ఈ పార్క్‌లో సందర్శకులకు అనుమతి ఉంది. ఆ వెలుతురులోనే జంతువులు కంటపడుతుం టాయి. అటు, ఇటు తిరుగుతూ అడవిలో ఉన్నట్టుగా నే ఉంటాయి. అక్కడ టాయ్‌ట్రైన్‌లో పర్యాటకులు జర్నీ చేస్తూ రాత్రి సమయాల్లో జంతువులను చూస్తూ వినోదాన్ని పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ నైట్ సఫారీ పార్క్‌ను పోలినట్టుగానే కొత్వాల్‌గూడలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. రాత్రి 7 నుంచి 11 గంటల సమయంలో సందర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండటంతో వీకెండ్లో కుటుంబసభ్యులతో పర్యాటకులు పోటెత్తే అవకాశముంటుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇక కర్ణాటక.. పర్యాటక హబ్
- నూతనంగా 11 థీమ్ పార్క్‌లు - మొత్తం వ్యయం రూ.708 కోట్లు - ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటుకు సన్నాహాలు - ఏడాది పొడవునా పర్యాటకుల ఆకర్షణే లక్ష్యం - పెలైట్ ప్రతిపాదికన స్నో, డిస్నీల్యాండ్, కేబుల్‌కార్ పార్కుల ఏర్పాటు సాక్షి, బెంగళూరు: కర్ణాటకను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం 11 థీమ్ పా ర్కులను రాష్ట్రం నలుమూలలా ప్రారంభించనుంది. అవసరమైన నిధుల కోసం ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకోనుంది. టెం పుల్ టూరిజానికి కర్ణాటక పెట్టింది పేరు. దేశ విదేశాల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో ఉన్న దేవాలయాలు, అందులోని శిల్పా లు తిలకించడానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో రాష్ట్రానికి వచ్చే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మిగిలిన నెలల్లో కర్ణాటక ప్రభుత్వానికి పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం తక్కువగానే ఉం టుంది. దీనినిదృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో వి విధ ప్రాంతాల్లో 12 నెలల పాటూ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా 11 థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా పెలైట్ ప్రతిపాదికన స్నో పార్క్, డిస్నీల్యాండ్ మా దిరి పార్క్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.193 కోట్లుగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్దతిలో పర్యాటక శాఖ సమకూర్చుకోనుంది. అదేవిధంగా మం చి కొండలు, గుట్టలు కలిగిన కర్ణాటకలో కేబుల్ కార్ టూరిజాన్ని అభివృద్ధి చే యడానికి వీలుగా చాముండిహిల్స్, నందిహిల్స్, కెమ్మనగుడి, మధుగిరిల్లో కేబుల్ కార్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కు కోసం పీపీపీ విధానంలో రూ.80 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మూడింటితో సహా మొత్తం 11 థీమ్ పార్కుల ఏర్పాటుకు రూ.708 కోట్లు ఖర్చుకాగలవని పర్యాటక శాఖ అంచనా వేసింది. పర్యాటక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమవనున్నాయని పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
టూరిస్ట్ హబ్‌గా కోస్తా తీర ప్రాంతం