నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సైకిల్‌పై వెళుతున్న ఒక యువకుని కారు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
చిట్యాల(నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సైకిల్‌పై వెళుతున్న ఒక యువకుని కారు ఢీకొనడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. సంజీవరెడ్డి(23) అనే యువకుడు వ్యవసాయ పనుల నిమిత్తం సైకిల్‌పై పొలానికి వెళుతుండగా విజయవాడ నుంచి చిట్యాల వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో సంజీవరెడ్డి మృతిచెందాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుని మృతికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. కారును పట్టుకునేందుకు సమీప చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.