ఐఎన్‌టీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ‘తల్లమల్ల’ | INTUC state working president Thallamalla | Sakshi
Sakshi News home page

ఐఎన్‌టీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ‘తల్లమల్ల’

Published Sat, Sep 3 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

INTUC state working president Thallamalla

రామగిరి : ఐఎన్‌టీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన తల్లమల్ల యాదగిరిని నియమిస్తూ ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సతీశ్‌ కుమార్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాదగిరికి కండువా కప్పి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ ఐఎన్‌టీయూసీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనకు బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు దినేష్‌ శర్మలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు వనమాల రమేష్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రాములు యాదవ్, కోశం జగదీశ్, యాదయ్య, రొయ్య నర్సింహ, పేరుమాళ్ల జనార్ధన్, వెన్నమల్ల వెంకన్న, గద్దగూటి గణేష్, అశోక్, ప్రవీణ్, సాగర్, శ్రావణ్, హరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement