సింగరేణి సమరం.. కొనసాగుతున్న కౌంటింగ్‌ | Singareni Elections 2023 Polling, Votes Counting, Winner Live Updates And Latest News Updates In Telugu - Sakshi
Sakshi News home page

Singareni Elections 2023 Updates: పోలింగ్‌ & కౌంటింగ్‌ అప్‌డేట్స్‌

Published Wed, Dec 27 2023 6:51 AM | Last Updated on Wed, Dec 27 2023 8:42 PM

Singareni Elections 2023 Polling And Counting Winner Live Updates - Sakshi

Singareni Elections 2023.. Updates


రామగుండంలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

  • ఆర్జీ-1కౌంటర్‌లో పోలైన 5044 ఓట్ల లెక్కింపు కోసం 5 టేబుల్స్ ఏర్పాటు.
  • ఆర్జీ-2 కౌంటర్‌లో పోలైన 3369 ఓట్ల లెక్కింపు కోసం 3 టేబుల్స్ ఏర్పాటు.
  • ఆర్జీ-3 కౌంటర్‌లో పోలైన 3612 ఓట్ల లెక్కింపు కోసం 4 టేబుల్స్ ఏర్పాటు.
  • అర్ధరాత్రి వరకూ కొనసాగనున్న లెక్కింపు.
  • ఆర్జీ-1కు సంబంధించి పోలైన 32 ఓట్ల బ్యాలెట్ బాక్స్ రావడం ఆలస్యం కావడంతో లేట్ గా ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.
  • కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
  • రామగుండం పరిధిలో ముందుగా వెలువడనున్న ఆర్జీ-2 ఫలితం.
  • తుది ఫలితాల కోసం నెలకొన్న ఉత్కంఠ.
  • అర్ధరాత్రి తర్వాత అధికార గుర్తింపు సంఘం ఎవరనేది తేలనున్న ఫలితం.

కౌంటింగ్‌ ప్రారంభం

  • మంచిర్యాల జిల్లా: శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి మూడు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం
  • శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491
  • పోలింగ్ శాతం 93.03 % నమోదు అయ్యింది..
  • బెల్లంపల్లి డివిజన్‌లో 996 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు... 
  • 96.29 శాతం నమోదు.
  • మందమర్రి ఏరియాలో మొత్తం 4835 మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • పోలింగ్ శాతం 93.38 గా నమోదు.
  • కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.. ముందుగా ఓట్లను యూనియన్‌ల వారీగా ఏర్పాటు చేసిన  బాక్స్‌లో  వేస్తారు.
  • శ్రీరాంపూర్ ఆఫీసర్స్ క్లబ్ మొత్తం తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేశారు.
  • 13 యూనియన్ లకు 13 బాక్సులు ఏర్పాటు.
  • 25 చొప్పున ఓట్లు కట్టలు కడతారు.. ఆపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది లెక్కిస్తారు.
  • ఒక్కో టేబుల్‌కు ఐదుగురు.. మొత్తం తొమ్మిది టేబుల్ లకు 45 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా లో పారంభమైన సింగరేణి ఎన్నికల కౌంటింగ్..

ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ..

  • రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ల్లో 96 శాతంపైగా నమోదైన పోలింగ్.
  • ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ.
  • గోదావరిఖని కమ్యూనిటీ హాల్‌లో కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్న ఎన్నికల సిబ్బంది.
  • బ్యాలెట్ బాక్సుల తరలింపుకు రంగం సిద్ధం.
  • ఆర్జీ-1లో 5 టేబుల్స్, ఆర్జీ-2లో 3 టేబుల్స్, ఆర్జీ-3 లో 4 టేబుల్స్ పై కొనసాగనున్న బ్యాలెట్ పత్రాల లెక్కింపు.
  • రాత్రి 12 గంటలకల్లా వెల్లడి కానున్న ఫలితాలు..
  • సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 95 శాతంకు పైగా నమోదైన పోలింగ్.
  • అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగిసిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్.
  • 95 శాతం పోలింగ్ నమోదు.
  • ఓటు హక్కు వినియోగించుకున్న 37 వేల మంది కార్మికులు.
  • సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్.
  • గెలుపు పై ధీమాతో ఉన్న ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి యూనియన్లు.
  • మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది..
  • ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు...
  • మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి గెలిచిన ఐఎన్‌టీయూసీ

  • మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్‌లో సాయంత్రం 5.00 గంటల వరకు మొత్తం 95 శాతం పోలింగ్ నమోదు
  • 9127 ఓట్లకు గాను పోలైన ఓట్లు 8491.
  • బెల్లంపల్లి డివిజన్లలో  985 ఓట్లకు గాను పోలైన ఓట్లు 959 ఓట్లు.
  • 96.3 శాతం నమోదు.
  • మందమర్రి ఏరియాలో మొత్తం 4835మంది కార్మికులకు గాను 4515 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • పోలింగ్ శాతం 93.38 గా నమోదు.
  • శ్రీరాంపూర్ ఏరియాలో మొత్తం ఓట్లు 9,127 గాను పోలైన ఓట్లు 8,491.. 
  • పోలింగ్ శాతం 95% నమోదు..

మరికొద్ది సేపట్లో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్..

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 85.80  శాతం పోలింగ్ నమోదు.
  • ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న  34128 మంది కార్మికులు.
  • సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్.
  • ఇప్పటివరకు ఆరుసార్లు జరిగిన సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు.
  • మూడుసార్లు ఏఐటీయూసీ గెలవగా, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్‌టీయూసీ గెలిచింది.
  • ఈసారి ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ మధ్య రసవత్తరంగా జరిగిన ఎన్నికల పోరు.
  • మొత్తం పోలైన ఓట్లలో ఎక్కువ ఓట్ల శాతం వచ్చిన యూనియన్ కు గుర్తింపు సంఘ హోదా దక్కనుంది.
  • భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 3 గం. వరకు 86.15% పోలింగ్ నమోదు.
  • ఓటు హక్కు వినియోగించుకున్న 4661 మంది ఓటర్లు.
  • మంచిర్యాల: బెల్లంపల్లి ఏరియాలో 3 గంటల వరకు 88.4% పోలింగ్ నమోదు.
  • శ్రీరామ్ పూర్‌లో 86.7 శాతం
  • మందమర్రి 86.19

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

  • ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో 2pm గంటల వరకు 83.1 శాతం నమోదు...
  • మొత్తం 985 ఓట్లకు గాను 819 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఔ

మంచిర్యాల జిల్లా 

  • మందమర్రి ఏరియా లో మధ్యాహ్నం 3.00 గంటల వరకు  86.19 శాతం పోలింగ్ నమోదు.
  • మొత్తం 4835 ఓట్లకు గాను 4166 ఓట్లు పోలయ్యాయి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

  • సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓట్లు 26,815.
  • పోలైన ఓటింగ్ శాతం 67.42 శాతం.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా:

  • కొత్తగూడెం కార్పొరేట్ 887 ఓట్లు,
  • నమోదైన పోలింగ్ 74.47%.
  • కొత్తగూడెం ఏరియా 1,540 ఓట్లు
  • నమోదైన పోలింగ్  66.06%.
  • ఇల్లందు 500 ఓట్లు,
  • నమోదైన పోలింగ్ 81.56%.
  • మణుగూరు 1,716 ఓట్లు నమోదైన పోలింగ్ 69.98%

సింగరేణి వ్యాప్తంగా మధ్యాహ్నాం 12గం. వరకు నమోదు అయిన ఓట్లు 23,613

సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్‌

12 గంటల వరకు ఆర్జీ రీజియన్‌లో.. 

  • రామగుండం- 1లో 11 పోలింగ్ కేంద్రాల్లో  58.4 శాతం
  • RG -2లో 6 పోలింగ్ కేంద్రాల్లో  50.09 శాతం
  • RG-3 లో 6 పోలింగ్ కేంద్రాల్లో 60.24 శాతం
  • మొత్తం 57 శాతం పోలింగ్ నమోదు


 

  • భూపాలపల్లి సింగరేణిలో మధ్యాహ్నం 12 గం.ల వరకు 61% పోలింగ్ నమోదు.
  • ఓటు హక్కు వినియోగించుకున్న 3,300 కార్మికులు

ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు.. 

  • మంచిర్యాల జిల్లా  శ్రీరాంపూర్ ఏరియాలో 11 గంటల వరకు 53 శాతం పోలింగ్ నమోదు
  • నమోదైన ఓట్లు 4,830


10 గంటలకు పోలింగ్‌ ఇలా..

  • ఇల్లందు ఏరియాలో 45 శాతంపైగా పోలింగ్‌
  • మణుగూరులో 36 శాతం
  • జయశంకర్‌ భూపాలపల్లిలో 45 శాతం పోలింగ్‌
  • శ్రీరాంపూర్‌ ఏరియాలో 42 శాతం పోలింగ్‌
  • మందమర్రి డివిజన్ లో 10 గంటల వరకు 34.93 శాతం పోలీంగ్ నమోదు
  • మందమర్రిలో 4835 ఓట్లకు గాను 1689 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • బెల్లంపల్లి ఏరియాలో అత్యధికంగా..  10.00 గంటల దాకా 48.99 శాతం పోలింగ్ నమోదు
  • రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ పరిధిలో.. 48.99 శాతం పోలింగ్ నమోదు

సత్తుపల్లి జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సింగరేణి కార్మికులను కలుసుకుని మాట్లాడిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఓటేసేందుకు కార్మికుల క్యూ

  • ఉదయం విధులకు హాజరయ్యే కార్మికులతో మొదలైన పోలింగ్‌
  • సాయంత్రం ఐదు గంటలవరకే పోలింగ్‌
  • ఓటేసేందుకు క్యూ కడుతున్న కార్మికులు
  • రాత్రి 7గం. మొదలుకానున్న కౌంటింగ్‌
  • రాత్రి 11గం. కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం


 

  • పెద్దపెల్లి రామగుండం ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 పరిధిలో ఉదయం 9 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు.

8 గంటలకు ఇలా.. 

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
  • ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్
  • 8 గంటల వరకు ... తొలి గంటలో నమోదైన పోలింగ్ 21%
  • పెద్దపల్లిజిల్లా   రామగిరి మండలం సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో ఉదయం 8 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 13.5%
  • మొత్తం 3884 ఓట్లకు గాను 528 మంది కార్మికుల ఓటు హక్కు వినియోగం

కొమురం భీంలో 144 సెక్షన్‌ 

  • ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి.. బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి ఎన్నికల హడావిడి
  • మొత్తం ఐదు పోలింగ్‌ కేంద్రాలు
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • ఓటు హక్కు వినియోగించుకొనున్న 985 మంది సింగరేణి కార్మికులు


నిరసన.. ఫిర్యాదు

  • మంచిర్యాల శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3 గని నిరసన 
  • ఒక అధికారి ప్రచారం నిర్వహిస్తున్నాడని ఓ యూనియన్ నేత ఆరోపణ
  • అధికారులకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏం పని? అంటూ ప్రశ్న 
  • పోలింగ్ హెల్ప్ డెస్క్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సదరు యూనియన్ లీడర్

జీఎం కార్యాలయం నుంచి ఐడెంటిటీ కార్డులు

  • కొనసాగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు
  • ఓటు హక్కు వినియోగించుకునే  కార్మికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి
  • ఐడెంటిటీ కార్డ్‌ లేనివారు జీఎం కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచిస్తున్న సింగరేణి అధికారులు
  • సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న పోలింగ్‌
  • సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లా లో 11 ఏరియాల్లో పని చేస్తున్న 39వేల మంది
  • మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు


ఉమ్మడి ఖమ్మంలో..

  • సింగరేణి ఎన్నికల్లో.. కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరి యాలో నాలుగు పోలింగ్ కేంద్రాలు
  • మణుగూరులో ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • కొత్తగూడెం ఏరియా రుద్రం పూర్‌, సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లో మూడు చొప్పు న పోలింగ్ కేంద్రాలు..
  • ఐదు ఏరియాల్లో 6,587 మంది కార్మికులకు ఓటు హక్కు

గట్టి పోటీ ఈ రెండు యూనియన్ల నడుమే!

  • భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్.
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న ఐదువేల మంది కార్మికులు
  • జిల్లా వ్యాప్తంగా వివిధ గనులపై 09 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు 
  • ఉదయం 7 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు  పోలింగ్
  • పోలింగ్ ను  బ్యాలెట్ పేపర్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్ ద్వారా నిర్వహణ   
  • పోలింగ్ అనంతరం కృష్ణ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్‌కు బ్యాలెట్‌ బాక్సుల తరలింపు 
  • రాత్రి 7 గంటల నుండి రౌండ్ కు 2,500 చోప్పున ఓట్ల లెక్కింపు 
  • చివరకు.. ఫలితాల వెల్లడి
  • బీఆర్‌ఎస్‌ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తప్పుకుందన్న ప్రచారంతో.. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ మధ్యే గట్టి పోటీ

సింగరేణి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • సింగరేణి గుర్తింపు ఎన్నికల సంఘం పోలింగ్‌ ప్రారంభం
  • ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి 
  • 84 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్‌
  • సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్దతిలో సాయంత్రం 5గం. వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • సాయంత్రం 7గం. నుంచి కౌంటింగ్‌
  • మొత్తం 39,809 మంది ఓటర్లు
  • శ్రీరాంపూర్‌లో 15, మందమర్రిలో 11, బెల్లంపల్లిలో ఐదు పోలింగ్‌ కేంద్రాలు 
  • బరిలో 13 కార్మిక సంఘాలు

ఎన్నికల నుంచి తప్పుకున్న టీజీబీకేఎస్‌

  • AITUCకి మద్ధతు ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంస్థ TBGKS(Telangana Boggu Ghani Karimka Sangham)
  • కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే ఈ నిర్ణయమని ప్రకటన

నేడే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు

  • ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • భూపాలపల్లిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,410 మంది కార్మికులు
  • మొత్తం 09 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • బ్యాలెట్ పద్దతిలో సీక్రెట్ ఓటింగ్
  • పోటీలో 13 గుర్తింపు యూనియన్లు

ఎన్నికల్లో ఇలా..

  • తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నేడు జరగనున్నాయి.
  • ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్‌ జరుగుతుంది.
  • బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి.
  • ఓట్ల  కౌంటింగ్‌ ప్రక్రియ రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభం కానుంది.
  • ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే.
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఈ ఎన్నికలపైనా ఆసక్తి నెలకొంది.
  • మొత్తం 11 ఏరియాల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది.
  • తాజా ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(బీఆర్‌ఎస్‌ టీజీబీకేఎస్‌ సపోర్ట్‌) మధ్య జరుగుతున్నాయి.

సింగరేణి ఎన్నికల చరిత్ర ఇది..
సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ప్రభుత్వం.. సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి.

ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో.. నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. 

ఆ తర్వాత కరోనా వైరస్‌ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

రిటర్నింగ్‌ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్‌ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 

2012 నుంచి ప్రతిష్టాత్మకంగా..  
సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్‌ఎస్‌(ప్రస్తుత) అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంద టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement