రాష్ట్ర బడ్జెట్‌లో తమ శాఖకు రూ.5,116.40 కోట్లు కేటాయించాలని రెవెన్యూ శాఖ కోరింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్‌సింగ్, సాంబశివరావు (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ) ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం వివిధ శాఖల మంత్రులు, అధికారులతో విభాగాల వారీగా సమావేశమయ్యారు.