సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఆడియో టేపులతో సహా ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్‌వోసీ ఇచ్చేందుకు రూ. కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. దీంతో బుధవారం ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు
ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్
Published Wed, Sep 9 2020 3:22 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM
Advertisement
Advertisement
Advertisement