సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా పెరుగుతుండగా అభివృద్ధియేతర వ్యయం ఏటా తగ్గుతోందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. వడ్డీల చెల్లింపుల వ్యయం కూడా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి తగ్గుతోందని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై రూపొందించిన అధ్యయన నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. 2020 – 21 నుంచి 2022 – 23 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను విశ్లేషించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది.
సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించే నిధులను అభివృద్ధి వ్యయంగా పరిగణించాలని పేర్కొంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితరాలపై చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం.. నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాలపై వ్యయం పెరుగుతోంది. 2021 – 22 నుంచి 2022 – 23 వరకు మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మించి రాష్ట్రం అభివృద్ధి వ్యయం చేస్తోంది.
► 2020 – 21 (అకౌంట్స్)లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 63.0 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం 72.0 శాతానికి పెరిగింది.
ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం 29.7 శాతం నుంచి 21.6 శాతానికి తగ్గింది.
► 2020 – 21 రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపుల వ్యయం 13.1 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల్లో 10.2 శాతానికి తగ్గింది.
► ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య వ్యయం 2020 – 21లో రూ.9,990.6 కోట్లు ఉండగా 2021–22లో రూ.16,659.5 కోట్లకు పెరిగింది. 2022–23లో రూ.17,988.2 కోట్లకు చేరుకుంది.
Andhra Pradesh: అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి
Published Fri, Jan 20 2023 2:17 AM | Last Updated on Fri, Jan 20 2023 8:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment