RBI bank
-
అప్పులు చేయడంలో బిజీగా మారిన ఏపీ సర్కారు
-
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. రూ.7581 కోట్ల నోట్లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది మే 19న రూ. 2000నోట్ల ఉపసంహరణను ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండువేల రూపాయల నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి. కానీ ఇంకా సుమారు రూ. 7581 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నట్లు సమాచారం.ఆర్బీఐ ప్రకారం.. ఇప్పటికి 97.87 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలుస్తోంది. 2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఇది 2024 జూన్ 28 నాటికి రూ. 7581 కోట్లకు తగ్గింది. అంటే మిగిలిన మొత్తం నోట్లు మళ్ళీ బ్యాంకులకు చేరాయి.2024 జూన్ 28 నాటికి వెనక్కు వచ్చిన పెద్ద నోట్లు 97.87 శాతం. నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తరువాత కూడా.. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. దీనికోసం దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలు తమ నోట్ల మార్పిడి కోసం డబ్బును ఏదైనా ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చు.Withdrawal of ₹2000 Denomination Banknotes – Statushttps://t.co/L2SXdYpCTR— ReserveBankOfIndia (@RBI) July 1, 2024 -
రామోజీ రావు ముమ్మాటికి ఆర్థిక నేరస్థుడేనని తేల్చిన ఆర్బీఐ
-
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిషేధంపై..క్లారిటీ ఇచ్చిన పేటీఎం
-
ఏపీలో అభివృద్ధి వ్యయం పరుగులు.. ఆర్బీఐ అధ్యయన నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వ్యయం గత మూడేళ్లుగా పెరుగుతుండగా అభివృద్ధియేతర వ్యయం ఏటా తగ్గుతోందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. వడ్డీల చెల్లింపుల వ్యయం కూడా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి తగ్గుతోందని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్లపై రూపొందించిన అధ్యయన నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. 2020 – 21 నుంచి 2022 – 23 వరకు ప్రధాన ఆర్థిక సూచికలను విశ్లేషించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవల వ్యయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించే నిధులను అభివృద్ధి వ్యయంగా పరిగణించాలని పేర్కొంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితరాలపై చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం.. నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాలపై వ్యయం పెరుగుతోంది. 2021 – 22 నుంచి 2022 – 23 వరకు మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మించి రాష్ట్రం అభివృద్ధి వ్యయం చేస్తోంది. ► 2020 – 21 (అకౌంట్స్)లో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 63.0 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల ప్రకారం 72.0 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో అభివృద్ధియేతర వ్యయం 29.7 శాతం నుంచి 21.6 శాతానికి తగ్గింది. ► 2020 – 21 రెవెన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపుల వ్యయం 13.1 శాతం ఉండగా 2022 – 23 బడ్జెట్ అంచనాల్లో 10.2 శాతానికి తగ్గింది. ► ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుధ్య వ్యయం 2020 – 21లో రూ.9,990.6 కోట్లు ఉండగా 2021–22లో రూ.16,659.5 కోట్లకు పెరిగింది. 2022–23లో రూ.17,988.2 కోట్లకు చేరుకుంది. -
స్థిర రేటుపై గృహ రుణాలు
లేహ్: దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ స్థిర రేటుపై గృహ రుణాలను తీసుకురావాలనుకుంటోంది. ఇవి స్థిర రేటు (ఫిక్స్డ్) నుంచి అస్థిర రేటు(ఫ్లోటింగ్)కు మారే గృహ రుణాలు. అంటే ప్రారంభం నుంచి నిరీ్ణత కాలం వరకు (సుమారు ఐదు పదేళ్లు) ఒకటే వడ్డీ రేటు కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి మార్కెట్ రేట్లకు అనుగుణంగా గృహ రుణంపై రేటు మారుతుంటుంది. ఈ విధమైన గృహ రుణాలను ఆఫర్ చేయవచ్చా? అన్న దానిపై ఆర్బీఐ నుంచి స్పష్టత కోరినట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. లేహ్ వచి్చన సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల రిటైల్ రుణాలను ఫ్లోటింగ్ రేటు ఆధారంగానే అందించాలని, రుణాలపై రేట్లు రెపో వంటి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ రేట్ల ఆధారంగానే ఉండాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిన విషయం గమనార్హం. ఆర్బీఐ నూతన మార్గదర్శకాల విడుదల అనంతరం ఫ్లోటింగ్ రేటు రుణాల విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై స్పష్టత లేదన్నారు రజనీష్ కుమార్. కస్టమర్లు కోరుకుంటున్నారు.. కొంత మంది కస్టమర్లు గృహ రుణాలపై రేట్లు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అటువంటి వారి కోసం ఫిక్స్డ్–ఫ్లోటింగ్ రేటు ఉత్పత్తులను అందించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. వీటిల్లో ఐదు లేదా పదేళ్ల వరకు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందన్నారు. కొంత కాలం తర్వాత ఫ్లోటింగ్ రేటుకు మార్చడం... భవిష్యత్తు పరిస్థితులను బ్యాంకు అంచనా వేయలేకపోవడం వల్లనేనన్నారు. సాధారణంగా గృహ రుణాల కాల వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తుల నిర్వహణ బాధ్యతల విషయంలో 30 ఏళ్ల కాలానికి స్థిర రేటు ఉత్పత్తిని ఆఫర్ చేయడం కష్టమని వివరించారు. ఎస్బీఐ గరిష్టంగా 30 ఏళ్ల కాలానికే గృహ రుణాలను అందిస్తోంది. ప్రస్తుతానికి ఎంసీఎల్ఆర్ ఆధారిత ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను ఆఫర్ చేస్తోంది. రెపో రేటు ఆధారిత ఫ్లోటింగ్ రుణాలపై రేట్లు తరచుగా మారే పరిస్థితులు ఉంటుంటాయి. ఆర్బీఐ రేపో రేటును సవరించినప్పుడల్లా బ్యాంకులు కూడా ఆ మేరకు మార్పులు చేయాల్సి వస్తుంది. -
రుణాలు అందేనా?!
సాక్షి, మెదక్: పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా(కుదువ) పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు పెట్టుబడి ఏటా పెరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గురువారం ప్రకటించిన పరపతి విధానంలో పూచీకత్తు లేకుండా పొందే పంట రుణ పరిమితిని రూ.1.60 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రైతులకు మేలు చేయనుంది. ఇకపై రైతులు తనఖా పెట్టకుండానే రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ఇది అమలు కానుంది. దీంతో జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరగనుంది. మెదక్ జిల్లాలో 2.50 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో ప్రతీ ఏడాది 1.50 లక్షల మంది రైతులు వేర్వేరు బ్యాంకుల్లో వ్యవసాయ పంట రుణాలు తీసుకుంటున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పరిగణలోకి తీసుకుని పంటల వారిగా రైతులకు బ్యాంకర్లు రుణాలు అందిస్తుంటారు. రైతులు పంట రుణాలు పొందాలంటే తప్పనిసరిగా తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టాల్సిందే. ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు రూ. లక్షలోపు రుణాలు ఇవ్వాలని నిబంధన ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల బ్యాంకర్లు తప్పనిసరిగా తనఖా పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి తనఖా లేకుండా రైతులు రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. రుణ పరిమితి పెరగడం వల్ల రైతులు పంటల సాగుకు అవసరమైన డబ్బుల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేల ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఎకరాకు ఇచ్చే ఆర్థిక సహాయం రూ.10వేలకు పెంచనుంది. దీంతో రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రూ.6 ఆర్థిక సహాయ అందజేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి. బ్యాంకర్ల తీరు మారేనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఆర్బీఐ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే బ్యాంకర్ల తీరు మాత్రం రైతులకు ఏమాత్రం మింగుడుపడని విధంగా ఉంది. ప్రతీ ఏటా బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యం పెట్టుకున్నప్పటికీ రెండేళ్లుగా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.720 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.450 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రబీలో రూ.480 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా డిసెంబర్ వరకు రూ.60 కోట్ల రుణాలు ఇచ్చారు. రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. తనఖా లేకుండా రుణాలు ఇచ్చే మొత్తాన్ని రూ.1.60 లక్షలకు పెంచిన నేపథ్యంలో రుణాల మంజూరులో బ్యాంకర్ల వైఖరి మారుతుందో లేదో వేచి చూడాలి. ఆర్బీఐ నిర్ణయంతో రైతులకు మేలు : పరశురాం నాయక్ తనఖా లేకుండా ఇచ్చే పంట రుణాల పరిమితిని ఆర్బీఐ రూ.1.60 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రైతులకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. తనఖా లేకుండా పంట రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతాయన్నారు. ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చి అన్నదాతలకు అండగా నిలవాలని కోరారు. -
ప్రపంచ ఆర్థిక రికవరీకి అడ్డు: రాజన్
కోచి/న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటే అది ప్రపంచ ఆర్థిక రంగ రికవరీకి విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘‘ఈ విషయంలో ఆందోళన కలిగించే ఎన్నో అంశాలున్నాయి. దీన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం’’ అని రాజన్ పేర్కొన్నారు. అయితే, ఒక దేశం చర్యకు, మరో దేశం ప్రతిస్పందించే విధానం నుంచి బయటపడతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వాణిజ్య యుద్ధం అనే పదాన్ని వినియోగించడం ఇష్టం లేదు. ఎందుకుంటే వారు ఇంకా ఆ దశలో లేరు. అయితే, ఈ విధమైన చర్యలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక రంగ రికవరీకి హాని కలుగుతుంది. అమెరికా పూర్తి బలంగా ఉండి, ఉద్యోగాలు తగినన్ని ఉన్న తరుణంలో ఈ విధంగా చేయడం సరికాదని భావిస్తున్నా’’ అని రాజన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో, బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఏకపక్షంగా చర్యలు తీసుకుంటే స్పందిస్తాం: ప్రభు అమెరికా రక్షణాత్మక చర్యలతో ప్రపంచం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎగుమతుల పెంపునకు మార్గాలను అన్వేషించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. చైనా సహా తన వాణిజ్య భాగస్వాములకు వ్యతిరేకంగా అమెరికా కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ‘‘నిబంధనలకు లోబడి, పారదర్శక, భాగస్వామ్య వాణిజ్య విధానాన్ని భారత్ బలంగా విశ్వసిస్తుంది. ఒకవేళ ఏ దేశమైనా ఏకపక్షంగా చర్యలకు దిగితే దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తగు రీతిలో ఎదుర్కొంటాం’’అని ప్రభు స్పష్టం చేశారు. ఎగుమతుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త మార్కెట్లు, కొత్త ఉత్పత్తులకు అవకాశాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. భారత్ చొరవ చూపాలి: ఫిక్కి ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు ఆవరిస్తుండటంతో వాటిని తగ్గించేందుకు భారత్ చురుకైన పాత్ర పోషించాలని ఫిక్కి కోరింది. ప్రపంచ వాణిజ్య ప్రగతిని అవి దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విధానాలు వాణిజ్య ఘర్షణకు తెరతీసిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) విధానాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఓ ముఖ్య దేశంగా భారత్‌కు ప్రపంచ దేశాల్లో ఆమోదం పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీవో బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించింది. -
రైతులకు వేగంగా రుణాలు అందాలి: ఆర్బీఐ
ముంబై: దేశీయ రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో... వ్యవసాయ రుణాల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు రుణాలను వేగవంతంగా పంపిణీ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. ఆదాయం పెరగడం అనేది సరైన మూలధన పెట్టుబడులపైనే ఆధారపడి ఉం టుందని ఆర్బీఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్యాంక్‌లు, లీడ్బ్యాంకులకు జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇందులో భాగంగా బ్యాంకులు సాగు రుణాలకు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రక్రియను పునఃపరిశీలించాలని కోరింది. అవసరమైన చోట ప్రక్రియను సులభంగా మార్చడంతోపాటు నిర్ణీత గడువులోపల రుణాలను మంజూరు చేయాలని నిర్దేశించింది. పేపర్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫోటోలు మాత్రమే..! మొండిబకాయిలు పెరిగిపోతుండడం, ‘నేమ్ అండ్ షేమ్’ పాలసీలో భాగంగా బ్యాం కులు ఎగవేతదారుల ఫొటోలను వార్తా పత్రికల్లో ప్రచురించడానికి చర్యలు తీసుకుంటుండడం వంటి పరిణామాల నేపథ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేవలం ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫొటోలు మాత్రమే పేపర్లలో ప్రచురించే చర్యలు చేపట్టాలని సూచించింది. రుణం చెల్లింపులో డిఫాల్ట్ అయినంత మాత్రాన విచక్షణా రహితంగా అందరి ఫొటోలూ పేపర్లలో ప్రచురించనక్కర్లేదని సూచించింది. దీనిని చాలా సున్నిత అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది.