రైతులకు వేగంగా రుణాలు అందాలి: ఆర్బీఐ | New RBI governor Urjit Patel facing old interest rate cut battles | Sakshi
Sakshi News home page

రైతులకు వేగంగా రుణాలు అందాలి: ఆర్బీఐ

Published Fri, Sep 30 2016 1:15 AM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM

రైతులకు వేగంగా రుణాలు అందాలి: ఆర్బీఐ - Sakshi

రైతులకు వేగంగా రుణాలు అందాలి: ఆర్బీఐ

ముంబై: దేశీయ రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో... వ్యవసాయ రుణాల ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు రుణాలను వేగవంతంగా పంపిణీ చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది. ఆదాయం పెరగడం అనేది సరైన మూలధన పెట్టుబడులపైనే ఆధారపడి ఉం టుందని ఆర్‌బీఐ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్యాంక్‌లు, లీడ్‌బ్యాంకులకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా బ్యాంకులు సాగు రుణాలకు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రక్రియను పునఃపరిశీలించాలని కోరింది. అవసరమైన చోట ప్రక్రియను సులభంగా మార్చడంతోపాటు నిర్ణీత గడువులోపల రుణాలను మంజూరు చేయాలని నిర్దేశించింది.

పేపర్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫోటోలు మాత్రమే..!
మొండిబకాయిలు పెరిగిపోతుండడం, ‘నేమ్ అండ్ షేమ్’ పాలసీలో భాగంగా బ్యాం కులు ఎగవేతదారుల ఫొటోలను వార్తా పత్రికల్లో ప్రచురించడానికి చర్యలు తీసుకుంటుండడం వంటి  పరిణామాల నేపథ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేవలం ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫొటోలు మాత్రమే పేపర్లలో ప్రచురించే చర్యలు చేపట్టాలని సూచించింది. రుణం చెల్లింపులో డిఫాల్ట్ అయినంత మాత్రాన విచక్షణా రహితంగా అందరి ఫొటోలూ పేపర్లలో ప్రచురించనక్కర్లేదని సూచించింది. దీనిని చాలా సున్నిత అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement