సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని సోషల్ డెమొక్రటిక్ ఫోరం డిమాండ్ చేసింది. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులతో విద్యారంగం మరింత నిర్లక్ష్యానికి గురైందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది.
ఈమేరకు సోషల్ డెమొక్రటిక్ ఫోరం అడ్వైజర్ మాధవరావు, కన్వీనర్ ఆకునూరి మురళి తదితరులు సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment