సాక్షి, మచిలీపట్నం: మత్స్యకారులకు భరోసా లభించింది. చేపల వేట జీవనంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. శుక్రవారం ప్రకటించిన బడ్జెట్‌లో మత్స్యకారులకు పెద్ద పీట వేస్తూ నిధులు కేటా యించడం మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని హర్షం వ్యక్తమవుతోంది.
జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంబడి 49 వేల హెక్టార్లలో మంచినీటి చేపలు, మరో 19 వేల హెక్టార్లలో ఉప్పు నీటి చేపల సాగు చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 30 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. సముద్ర తీరం వెంబడి జిల్లాలోలో 101 మెకనైజ్‌డ్ బోట్లు, 1,458 మోటా రైజ్‌డ్ బోట్లను వినియోగిస్తూ మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం మంజూ రుచేసిన నిధులు సైతం పక్కదారి పట్టించి మత్స్యకారులకు పూర్తిగా మొండి చేయి చూపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి వారిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
నిషేధ భృతి రూ.10 వేలకు పెంపు
ఏటా వేసవిలో సముద్రతీరంలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఆ సమయంలో మత్స్యకారుల జీవన భృతి పేరిట ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ. 4 వేలు ఇచ్చేవారు. అవి కూడా సమయానికి అందేవి కావు. కానీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో జీవన భృతి రూ.10 వేలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయిం పులు చేశారు. సముద్ర తీరంలో ఉన్న 8,980మంది మత్స్య కారులకు ఇక నుం చి ఒక్కొక్కరికి రూ. 10 వేలు సాయంగా అందనున్నాయి. వీటిని 2020 జనవరిలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.
ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూ.1.50 కే
ఆక్వా రైతులకు ఒక యూనిట్‌కు రూ. 2ను వసూలు చేస్తుండగా, ఇక నుంచి రూ. 1.50కే అందించనుంది. దీనికి సంబంధించి రూ. 475 కోట్లు కేటా యింపులు చేసింది. డీజిల్‌ను సబ్సిడీపై అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు రూ. 200 కోట్లు కేటాయించడం వల్ల ఎంఎస్ యాక్ట్ కింద మత్స్యశాఖాధికారుల వద్ద నమోదు చేసుకున్న మెకనైజ్ట్ బోట్లకు నెలకు రూ.3 వేల లీటర్లు, మోటారైజ్డ్ బోట్లకు నెలకు 300లీటర్ల డీజిల్‌ను ఒక్కొక్క లీటర్‌కు రూ. 6.03 చొప్పున సబ్సిడీ పొందే అవకాశం కలిగింది. దీంతోడీజిల్ భారం తగ్గి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు మరింత ఆర్థిక ప్రయోజనం కలుగనుంది.
మత్స్యకారులకు ఎంతో మేలు
ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేకూర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు లేక, ఆర్థిక ప్రయోజనం కలుగలేదు. ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులు ఉన్నందున నిర్ధిష్ట కాలంలో మత్స్యకారులకు సాయం అందుతుందనే నమ్మకం ఉంది.
– లంకే వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్
జిల్లాలో సముద్ర తీరం | 111 కిలోమీటర్లు |
మంచినీటి చేపల సాగు | 49 వేల హెక్టార్లు |
చేపల వేటపై జీవిస్తున్న మత్స్యకారులు | 8,980 మంది |
ఉప్పునీటి చేపల సాగు | 19 వేల హెక్టార్లు |
ఆక్వా సాగు చేస్తున్న రైతులు | 30 వేల మంది |
Comments
Please login to add a commentAdd a comment