
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి
మేళ్లచెరువు : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకో బోమని తిరిగి వడ్డీతో సహా వసూలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన సోమవారం రాత్రి మండలంలోని వేపల మాధవరం గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీఆర్‌ఎస్ నాయకులు తమ పార్టీ నాయకులను ఇబ్బందులు పెడితే సహించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కిష్టపట్టి ప్రాంతంలో ఏ పార్టీ నాయకులు చేయని అభివృద్ధిని తాను చేయించానన్నారు. మండలంలో రోడ్లు, కష్ణానది నుంచి సాగునీరు వంటవి అభివృద్ధి చేశానని రాబోయే ఎన్నికల్లో తనను రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో అయనకు బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాణోతు సైదమ్మ, మాజీ సర్పంచ్ బోగాల మోహన్‌రెడ్డి, బాలరాజు, వెంకయ్య, శ్రీనివాసరెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment