srirama navami celebrations
-
Bhadrachalam: భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సాక్షి: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సీతారాముల కల్యాణ క్రతువు సాగింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణితో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.అభిజిత్ లగ్నంలో..చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. సాధారణంగా నవమి రోజున అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయించారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేశారు. అనంతరం మంగళ హారతి అందించారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్లారు. -
ఒంటిమిట్టలో మార్మోగిన రామనామ స్మరణ
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా రామనామ స్మరణ మార్మోగింది. టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా శ్రీకోదండరామస్వామికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే అందజేసిన ముత్యాల తలంబ్రాలను స్వామి కల్యాణవేదిక వద్ద తలంబ్రాలలో కలిపారు. అనంతరం స్వామి స్నపన తిరుమంజనంలో ఎమ్మెల్యే మేడా దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి దంపతులు.. ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పెన్నా సిమెంట్స్ అధినేత వేణుగోపాల్‌రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, క్యూలైన్ల వంటి ఏర్పాట్లు టీటీడీ చేసింది. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఏకశిలానగరి (ఒంటిమిట్ట)లో శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శుక్రవారం ధ్వజారోహణ చేయనున్నారు. -
భక్త కోటికి తారక మంత్రం.. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక ఈ వేడుక
శ్రీరామ చంద్రమూర్తి జీవిత కథే రామాయణం. ఆ రామాయణాన్ని అనుసరిస్తే చాలు మనం ఎలా వ్యవహరించాలో అర్ధం అయిపోతుంది. ఎలా ఉండకూడదో ఎలా నడుచుకోకూడదో కూడా తెలిసిపోతుంది. మనకి కర్తవ్య బోధ చేస్తూ దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్లే కాంతి బాటే రామాయణం. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ రామనామమే భక్తకోటికి తారక మంత్రంగా ఉండిపోయింది. ఎన్ని యుగాలు దాటినా అదే మంత్రం లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. రామ రాజ్యం రావాలంటే రాముడు చూపిన బాటలో ధర్మాన్ని ఆచరించడమొక్కటే మార్గం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. రామరాజ్యం యావత్ ప్రపంచానికే ఆదర్శ రాజ్యం ఏ రాజ్యం అయితే సుభిక్షంగా ఉంటుందో ప్రజలంతా ఏ చీకూ చింతా లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారో ఏ రాజ్యంలో అయితే ప్రజలు మానసిక క్షోభలు పడకుండా మనశ్శాంతిగా ఉంటారు ఏ రాజ్యంలో అయితే ప్రజలు ఆకలి దప్పులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారో దాన్ని రామరాజ్యం అంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదే రామరాజ్యం. అందుకే రాముడి పాలనలో అందరూ పిల్లా పాపలతో హాయిగా జీవించారు. వన వాసం పూర్తి చేసుకుని తండ్రి మాటను దక్కించాడు. సత్య నిష్ఠ పాటించాడు. తిరిగి అయోధ్య చేరి రాజ్యాధికారం చేపట్టాడు. పాలకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించాలన్న సూత్రాన్ని రాముడు పాటించాడు. తన రాజ్యంలో ఓ మామూలు మనిషి తన సతీమణి సీత గురించి చేసిన వ్యాఖ్యలకు కూడా గౌరవం ఇచ్చాడు. సీత గురించి తనకు తెలిసినా ప్రజల నుండి ఓ విమర్శ వచ్చినపుడు పాలకుడిగా తాను జవాబుదారుగా ఉండాలనుకున్నాడు రాముడు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతోన్నా.. కడలి అంతటి దుఖాన్ని దిగమింగుకుని సీతను అడవుల్లో వదిలి రావల్సిందిగా తమ్ముడు లక్ష్మణుణ్నే ఆదేశించాడు రాముడు. అందులో ఓ మంచి పాలకుడు ఎలా వ్యవహరించాలన్న నీతి ఉంది. అది పాలకులందరికీ ఆదర్శమే అంటారు మేధావులు. అధికారం తమ చేతుల్లో ఉంది కదా అని ప్రజల మాటలు పట్టించుకోకుండా ఉంటే అది ధర్మ బద్ధమైన పాలన అనిపించుకోదని రాముడు అనుకున్నాడు కాబట్టే సీతను అడవులకు పంపాడు. సీతారాముల జీవన యానమే రామాయణం. అది పరమ పవిత్రం. తర తరాలకూ ఆదర్శనీయం. అందుకే అది నిత్య పారాయణ గ్రంధం కూడా. రామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు తెలీని ఆనందం ఆవహించేస్తుంది. ఒక్క సారి చదివితే మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంటుంది. చదువుతున్న కొద్దీ కొత్తగానే ఉంటుంది. అదే సమయంలో మధురంగా అమృతంలా ఉంటుంది. అందుకే యుగాల తరబడి రామాయణం కల్పవృక్షంలా వెలుగుతూనే ఉంది. శ్రీరామ నవమి అంటే లోకానికి పండగ. జనులందరికీ పండగ. సీతారాముల కళ్యాణం అంటే అదో వేడుక. తర తరాలుగా వెంటాడే ఆనందపు కానుక. -
రాములోరి కల్యాణం.. తరలివచ్చిన శివపార్వతులు, జోగినిలు(ఫొటోలు)
-
భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం (ఫొటోలు)
-
భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో రాములవారి కల్యాణాన్ని చూసి తరించేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం అట్టహాసంగా, కన్నులపండుగగా జరుగుతోంది. స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక, టీటీడీ తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. కాగా, సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు..
బుట్టాయగూడెం: చెట్టును, పుట్టను దేవుళ్లగా కొలవడం హిందూ సంస్కృతిలో భాగం. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతితో మమేకం కావడం దీనిలోని ఉద్దేశం. ప్రత్యేకించి గిరిజన సంప్రదాయాలు వినూత్నంగా ఉంటాయి. తరతరాలుగా తాతముత్తాతల నుంచి వచ్చిన ఆనవాయితీలను కొనసాగిస్తూ భావితరాలకు అందిస్తున్న గిరిజన తెగలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాయక్‌పోడు గిరిజనులు ఒకరు. చెట్టు మానులను కొయ్య రూపాలుగా మార్చి ఏటా శ్రీరామనవమికి పూజలు చేయడం బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం నాయక్‌పోడు గిరిజనుల ప్రత్యేకం. గ్రామంలో 50 నాయక్‌పోడు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామ దేవతగా గంగానమ్మవారు పూజలందుకుంటున్నారు. అయినా గ్రామస్తులంతా సీతారాములను ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా అడవిలోని నాలుగురకాల చెట్ల మానులను సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వీరంతా. గ్రామంలో రామాలయం ఉన్నా తామంతా ఇలానే దేవుళ్లకు పూజలు చేస్తామని శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు వనుము వీర్రాజు, కుసినే మణికుమార్, కుసినే వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు రకాల మానుల నుంచి.. శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యులు అడవికి వెళ్లి చెండ్ర, పాల, ఊడిగ, రావిచెట్ల మానులు సేకరిస్తారు. చెండ్ర చెట్టు మానును రాముడిగా, పాలచెట్టు మానును సీతాదేవిగా, ఊడిగ చెట్టు మానును లక్ష్మణుడిగా, రావిచెట్టు మానును ఆంజనేయుడిగా చెక్కించి గ్రామ మధ్యలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇలా ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తామని వీరు చెబుతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామంలో వినూత్న ఆచారంతో సీతారాముల కల్యాణం జరగడం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది. అదే మాకు జయం అడవిలోని చెట్ల మానులు తీసుకువచ్చి విగ్రహాలుగా మలిచి పూజలు చేస్తాం. ఇది మా ఆనవాయితీ. ఇదే మాకు జయం, శ్రీరామరక్ష. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. –గురువింద రామయ్య, లక్ష్మీపురం చదవండి: అపురూప దృశ్యం.. ఆవిష్కృతం గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. -
శ్రీసీతారాముల కళ్యాణ వైభోగం
-
భద్రాద్రి సీతారాముల కల్యాణం
-
రాములోరి పెళ్లిపై కరోనా ప్రభావం
-
తిరుమలలో శ్రీరామ నవమి ఆస్ధానం
-
రాములోరి కల్యాణానికి క్షీరపురి గోటి తలంబ్రాలు
సాక్షి, చీరాల అర్బన్: జగదభిరాముడు.. కోదండ రాముడు.. రఘురాముడు.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే నీలమేఘశ్యాముడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలన అనే మాటకు అర్థం చెప్పిన మహోన్నతుడు. అటువంటి ఏకపత్నీవ్రతుడు శ్రీరామచంద్రమూర్తి కల్యాణమంటే జగత్కల్యాణమే. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణం చూసినా, వినినా ఎంతో పుణ్యం. అంతటి కల్యాణ ఘట్టంలో తమకు ఏదో ఒక భాగస్వామ్యం కావాలని ఎంతో మంది కోరుకుంటారు. కల్యాణంలో ప్రధానంగా వినియోగించేవి తలంబ్రాలు. ఆ తలంబ్రాలను గోటితో ఒలిచే మహద్భాగ్యం క్షీరపురి వాసులకు ఆరోసారి దక్కింది. చీరాలకు చెందిన రఘురామభక్త సేవా సమితి చైర్మన్ పొత్తూరి బాలకేశవులు 2013లో శ్రీరామనవమి కల్యాణం తిలకించేందుకు భద్రాచలం వెళ్లారు. అక్కడ కల్యాణంలో స్వామివారికి గోటితో ఒలిచిన తలంబ్రాలను ఉభయ గోదావరి జిల్లాలతోపాటు పలు జిల్లాల నుంచి భక్తులు దేవస్థానానికి సమర్పించారు. ఆ అవకాశాన్ని తమకు అందించాలని ఆయన దేవస్థాన యాజమాన్యాన్ని కోరారు. దీంతో 2014లో చీరాల వాసులకు అవకాశం దక్కింది. అప్పటి నుంచి ఏటా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి చీరాల నుంచి కూడా గోటి తలంబ్రాలు స్వామివారికి అందుతున్నాయి. 2020లో జరిగే కల్యాణానికి కూడా ఆరోసారి ఆ అదృష్టం చీరాలవాసులకు దక్కింది. ఈ మేరకు దేవస్థాన అధికారుల నుంచి అనుమతి లభించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమాన్ని మహిళలు సోమవారం ప్రారంభించారు. పలు మహిళా సమాజాల ద్వారా, అలానే పలు దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి శ్రీరామనవమి నాటికి భక్తిశ్రద్ధలతో భద్రాద్రికి చేరుస్తారు. అరుదైన అవకాశం ఆరుసార్లు తమను వరించడం పూర్వ జన్మ పుణ్యంగా భావిస్తున్నట్లు బాలకేశవులు చెబుతున్నారు. 150 క్వింటాళ్లకు అనుమతి భద్రాచలంలో 2020లో నిర్వహించే శ్రీరామనవమి పర్వదినానికి ఉపయోగించే తలంబ్రాలను 150 క్వింటాళ్లకు ఆలయ అధికారుల నుంచి అనుమతి వచ్చింది. కల్యాణానికి వినియోగించే మొత్తం 150 క్వింటాళ్ల తలంబ్రాలు క్షీరపురి వాసులే అందించడం కోటి నోములు ఫలం. తలంబ్రాలతోపాటు పసుపు 225 కిలోలు, కుంకుమ 450 కిలోలు, గులాం 450 కిలోలు, నూనె 225 కిలోలు, సెంటు(జాస్మిన్) 75 లీటర్లు, రోజ్ వాటర్ 75 లీటర్లు, 100 కిలోల లోపు ముత్యాలు అందించాలని అనుమతి పత్రంలో ఆలయ అధికారులు కోరారు. గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం -
అడవికొలనులో ఆమెకు ఒక్కరోజు
పశ్చిమగోదావరి, నిడమర్రు: అడవికొలను గ్రామంలో ప్రతి శ్రీరామనవమికి ఓ ఆచారం ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలోని మహిళలకు ఈ ఒక్కరోజు పురుషులు పూర్తి స్వేచ్ఛనిస్తారట. మహిళలు తమకు నచ్చినట్టు విహరించేందుకు, తీర్థంలో నచ్చినవి కొనుక్కునేందుకు అవకాశం కల్పిస్తారట. ఇది పూర్వ నుంచి వస్తున్న ఆచారమట. అన్నట్టు తీర్థంలోకి మహిళలకు మాత్రమే ప్రవేశమట. ఈ తీర్థం ఆదివారం గ్రామంలో జరిగింది. రాముని రథోత్సవం అనంతరం మహిళలకు ప్రత్యేకం తీర్థం నిర్వహించారు. ఈ తీర్థంలో మహిళలకు అవసరమైన అన్ని వస్తువులనూ అందుబాటులో ఉంచారు. దుస్తులు, ఫ్యాన్సీ, సౌందర్య వస్తువుల స్టాళ్లూ పెట్టారు. దీంతో తీర్థంలో మహిళలు సందడి చేశారు. ఈ గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఈ ఆచారం వస్తున్నట్టు ఉత్సవకమిటీ అధ్యక్షుడు పోశింశెట్టి రామమూర్తి తెలిపారు. కడప జిల్లా పులివెందుల, అడవికొలను గ్రామంలో మాత్రమే ఈ ఆచారం ఉన్నట్టు చెబుతున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరుకూ మహిళలకు తీర్థంలో అవకాశం కల్పిస్తారని, అక్కడి నుంచి పురుషులు తీర్థంలో పాల్గొంటారని వెల్లడించారు. -
భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం
-
కల్యాణం.. వైభోగం
ఇల్లందకుంట(హుజూరాబాద్): అపర భద్రాద్రి ఇల్లందకుంటలో సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఉదయాన్నే ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. స్వామి వారిని ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేడుకల్లో మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభుత్వం తరఫున కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఈవో సుదర్శన్ స్వామివారికి సమర్పించిన పట్టు వస్త్రాలను పూజారులు ఉత్సవ మూర్తులకు అలంకరించారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైకి మేళతాలాలతో తీసుకొచ్చారు. అర్చకులు శేషం రామాచార్యులు, వంశీధరాచార్యులు, శేషం సీతారామాచార్యులు వేదమంత్రోశ్ఛారణ మధ్య కల్యాణం తంతు ప్రారంభించారు. మొదట స్వామివారికి యజ్ఞోపవీతం చేయించారు. అభిజిత్ లగ్న సుముహూర్తమున మధ్యాహ్నం 12:30 గంటలకుసీతారాములకు జీలకర్రబెల్లం కార్యక్రమాన్ని జరిపించారు. వేలాది మంది భక్తుల శ్రీరామానామ స్మరణ మధ్య రామయ్య సీతమ్మవారికి తాళి కట్టారు. నేత్రపర్వంగా సాగిన ఈ వేడుకను తిలకించిన భక్తజనం పులకించిపోయారు. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మారుమోగింది. ప్రముఖుల హాజరు.. ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి జిల్లాలోని అందరు అధికారులు హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేడకలకు హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్–జమున దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, కాంగ్రెస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి, ప్యాట రమేష్, తుమ్మేటి సమ్మిరెడ్డి, సర్పంచ్ కంకణాల శ్రీలత, ఎంపీటీసీ రామ్‌స్వరణ్‌రెడ్డి, రాష్ట్ర సహకార సంఘూల అధ్యక్షుడు తక్కళ్లపల్లి రాజే«శ్వర్రావు, మాజీ మార్కెట్ చైర్మన్ పింగిళి రమేశ్, చుక్కా రంజిత్, దేశిని కోటి, ఎంపీపీ గంగారపు లత, జెడ్పీటీసీ అరుకాల వీరశలింగం, రామ్ నర్సింహారెడ్డి, జిల్లా వైద్యధికారి రామ్‌మనోహర్‌రావు, తదితరులు హాజరై పూజలు చేశారు. భారీగా బందోబస్తు.. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే బైపాస్ రూట్లలో వాహనాలను మళ్లించారు. వీఐపీ పాసులు ఉన్నప్పటికీ భక్తుల అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు కొంత మందిని అడ్డుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రొటోకాల్ ప్రకారం ముందు అనుకున్న ప్రకారమే మంత్రులు, ఎమ్మెల్యేలతో కొంత మందిని మాత్రమే లోపలికి పంపించి మిగతా వారిని ఆపివేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కల్యాణం వేడుకలు సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. మహా అన్నదానం.. శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. వేడుకలకు హాజరైన భక్తులకు జమ్మికుంట రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యాక్రమం నిర్వహించారు. అందరికీ సరిపడా భోజనాలు చేయించారు. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు. సామాజిక సేవ.. వేసవి కాలం కావడం, ఎండ ఎక్కువగా ఉండడంతో ఇల్లందకుంట పీహెచ్సీ ఆధ్వర్యంలో ముందస్తుగానే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సత్యసాయి సేవా సంస్థ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు కళ్యాణ మండపంలో మంచి నీటిని, మజ్జిగను పంపిణీ చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మజ్జిగ ట్యాంకర్‌ను పంపించగా, ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాగునీరు సరఫరా చేశారు. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
-
నేడు భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
సాక్షి, భద్రాచలం : భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానానికి మంత్రి చేరుకొని వాటిని సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి కిటకిటలాడింది. మిథిల కల్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా.. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి వారు సిద్ధమయ్యారు. నేడు(ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, పెళ్లి సామగ్రితో ఆలయానికి చేరుకున్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాదికోసారి శ్రీరామనవమి నా డు భద్రాద్రిలో అంగరంగ వైభంవగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం కోసం అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. దేశ నలుమూలల నుం చి తరలివచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం మహాపట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, శనివారం రాత్రి రామాలయంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమా లను తిలకించిన భక్తు లు పరవశించిపోయా రు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే.. భద్రాద్రి మిథిలా స్డేయంలో ఆదివారం ఉదయం 10.30 గంట ల నుంచి 12.30 గంట ల వరకు జరిగే రామ య్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించి తరించేందుకు ఇప్పటికే భక్తులు భారీగా చేరుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్... ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాల య పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌక ర్యం కల్పించారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. రామాలయం, మాఢవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలు గొందుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మిథి లా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ తంతు నిర్వహిస్తారు. రామతీర్థంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సీతారాములకు ఆలయ అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. -
సీతారామ కల్యాణం చూచువారలకు చూడముచ్చట
తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి. శ్రీరామచంద్రుని జన్మతిథి అయిన చైత్రశుద్ధ నవమినాడు భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రమూర్తులకు తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమినాడు కల్యాణవేడుకకు శ్రీకారం చుడతారు. శ్రీరాముడిని, సీతాదేవిని పెళ్లికుమారుని, పెళ్లి కుమార్తె్తను చేస్తారు. ఆ రోజున వసంతోత్సవం జరుపుతారు. ఇరువురు మూర్తులకు పసుపు వచ్చని నూలు వస్త్రాలు ధరింపజేస్తారు. పసుపు, కుంకుమ, చందనం, సుగంధద్రవ్యాలు కలిపిన జలంతో ‘వసంతం’ తయారు చేస్తారు. దీనిని సీతారాములపై చిలకరింపచేస్తారు. ఆ ఏడాది కల్యాణోత్సవాన్ని నిర్వహించే అర్చకులు, సతీ సమేతంగా పసుపుకొమ్ములను రోళ్లలో దంచుతారు. ఈ పసుపుతో సీతమ్మకు మంగళస్నానం చేయిస్తారు. శ్రీరామునికి సున్నిపిండి, సుగంధద్రవ్యాలు, శీకాయపొడి కలిపిన మిశ్రమంతో మంగళస్నానం చేయిస్తారు. అనంతరం మంగళాక్షతలను కలిపే కార్యక్రమం మొదలుపెడతారు. ఎక్కడా విరగని మేలిరకమైన, పరిశుద్ధమైన బియ్యంతో తలంబ్రాలు తయారుచేస్తారు. వీటిలో బియ్యంతో పాటు పసుపు, కుంకుమ, ఆవునెయ్యి, సుగంధద్రవ్యాల పొడి, గులాల్ కలుపుతారు. వీటితోపాటు విద్యుద్దీపాలు, పుష్పమాలాలంకరణలతో వర్ణరంజితంగా, నూతన శోభతో కల్యాణఘట్టానికి ముస్తాబవుతుంది భద్రగిరి.సీతారాముల పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ రోజున భద్రాద్రి అంతటా. భద్రాద్రిలోని ఆలయంలో సీతారాముల్ని ఫాల్గుణపౌర్ణమి నుంచి ప్రతిరోజూ నూతనవస్త్రాలు, సుగంధభరిత పుష్పాలు, పత్రాలతో అలంకరిస్తారు. బుగ్గన చుక్కలతో, నుదుటన కల్యాణ తిలకాలతో లోకోత్తర సౌందర్యంతో మెరిసిపోతుంటారు సీతమ్మ, రామయ్య. అందుకే ఉత్సవమూర్తులను దర్శించుకోవటానికి కల్యాణానికంటే ముందుగానే ఆలయానికి చేరుకుంటారు భక్తులు. సీతమ్మకు ఒడిబియ్యాన్ని, రాముడికి నూతనవస్త్రాలను సమర్పించి కల్యాణ సంరంభం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. కల్యాణానికి ముందురోజు రాత్రి జరిగే ఎదుర్కోలు వేడుక ఒక మనోజ్ఞమైన ఘట్టం. భద్రాచల రాజవీధిలో అర్చకులు, భక్తులు ఆడ, మగ పెళ్లివారిగా విడిపోయి సునిశిత, హాస్య, వ్యంగ్య చమత్కారోక్తులతో సీతమ్మ ఘనత ఇదీ, రామయ్య గొప్పతనం ఇదీ అంటూ హాస్యభరితంగా వాదించుకుంటారు. చిరరకు సీతారాములిద్దరూ ఒకరికొకరు సమవుజ్జీలు, ఒకరికొకరు తగినవారు అని నిర్ణయానికి వచ్చి ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటారు. వసంతం చల్లుకుంటారు. నవమినాడు జరిగే కల్యాణానికి తరలిరావల్సిందిగా ఇరుపక్షాలు ఒకరికొకరు ఆహ్వానపత్రికలు ఇచ్చిపుచ్చుకుంటారు. కల్యాణం అంటే సీతారాములదే. ప్రతి ఏడాది కల్యాణం జరుగుతున్నా ఏయేటికాయేడు మరింత కొత్తగా, ఉత్సాహంగా జరుగుతుంది కల్యాణోత్సవంలోని ప్రతి ఘట్టం. ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరని దృశ్యం సీతారాముల కల్యాణోత్సవ సంబరం. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాతండ్రి అంటూ భక్తివాత్సల్యాలతో సీతారామకల్యాణాన్ని వీక్షిస్తారు భక్తకోటి. ఆ ఉత్సవానికి వ్యాఖ్యానాన్నీ అందిస్తారు.మాతా రామః మత్పితా రామచంద్రఃభ్రాతా రామః మత్సఖా రాఘవేశఃసర్వస్వం మే రామచంద్రః దయాళుఃనాన్యం దైవ నైవజానే న జానేనా తల్లి రాముడు, తండ్రి రామచంద్రుడు, అన్నదమ్ములు రామడు, స్నేహితుడు రాముడు, రామచంద్రుడే నా సర్వస్వం, వేరే దైవమే నాకు తెలియదు, నేను ఎరుగను అని ఈ శ్లోకం అర్థం. ఇలా తన కుటుంబంలో రాముడిని, రాముడినే తన కుటుంబంగా భావించిన వ్యక్తులు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని, ఉత్తమ కుటుంబాన్ని పొందగలుగుతారు. గోపరాజు పూర్ణిమాస్వాతి శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకాన్ని శుభలేఖలపై ముద్రించని వారు, దానిని చూడనివారు అరుదు. శ్రీరామ కర్ణామృతంలోని ఈ శ్లోకం సీతారాముల తలంబ్రాల వేడుక గురించి రమ్యంగా వర్ణించారు. సీతమ్మ తెల్లని ముత్యాలు దోసిటిలోకి తీసుకోగా అవి ఎర్రబడ్డాయట. వాటిని రామయ్యపై పోయగా అవి రాముడి తలపాగాపై తెల్లగా, శరీరం మీద పడగానే నీలంగా మారాయట. చివరికి కిందపడేటపుడు మళ్లీ తెల్లగా మారాయట. తెలుపును స్వచ్ఛతకు, సత్వగుణానికి ప్రతీకగా ఎరుపు, నలుపు, నీలాలు రజ, తమో గుణాలకు ప్రతీకలుగా భావిస్తే సత్వగుణాన్ని కలిగి ఉన్న మనుషులను ఏ చెడుగుణాలు పాడు చేయలేవని స్వఛ్చంగా ఉన్న సంసార జీవితాన్ని ఏ శక్తులూ నాశనం చేయలేవని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకున్న జంటలు నూరేళ్లు ఆనందంగా జీవిస్తారు. -
రాములోరి కల్యాణానికి ముస్తాభైన అంబికాబాగ్
-
మహానందిలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
-
ప్రసాదం తిని 70 మంది ఆస్పత్రిపాలు
సాక్షి, బల్లికురవ: రాములోరి కల్యాణమైన తర్వాత 16 రోజుల పండగ సందర్భంగా ఆదివారం కమిటీ సభ్యులు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఆ వడపప్పు, పానకం తాగిన వారిలో 70 మంది మంగళవారం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఈ సంఘటన మండలంలోని సూరేపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. గత నెల 25న శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం జరిపించారు. ఈ నెల 8వ తేదీన 16 రోజుల పండగ వెడుకలు నిర్వహించారు. హాజరైన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. వడపప్పు, పానకం తాగిన వారిలో గుర్రాల శ్రీనివాసరావు, కొమ్మాలపాటి రామాంజమ్మ, గుర్రా సింగరకొండ, కోటేశ్వరరావు, బొంతునాగమ్మ, బొంతు ఆంజనేయులుతో పాటు మొత్తం 70 మంది వరకు ఉన్నారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. స్థానికులు భయపడి గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సయ్యద్ అమీర్ ఆలీకి సమాచారం ఆందించారు. వైద్యశిబిరం ఏర్పాటు సమాచారం అందుకున్న వైద్యాధికారి గ్రామంలో తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడపప్పులో తేడా వల్లే ఇలా జరిగిందని, భయపడాల్సిన పనేమీ లేదన్నారు. నీరసంగా ఉన్న వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కొందరికి సెలైన్లు పెడుతున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఎండకు బయట తిరగకుండా ఉండాలని వైద్యుడు సూచించారు. -
కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం
మేళ్లచెరువు : కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకో బోమని తిరిగి వడ్డీతో సహా వసూలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన సోమవారం రాత్రి మండలంలోని వేపల మాధవరం గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ నాయకులను ఇబ్బందులు పెడితే సహించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కిష్టపట్టి ప్రాంతంలో ఏ పార్టీ నాయకులు చేయని అభివృద్ధిని తాను చేయించానన్నారు. మండలంలో రోడ్లు, కష్ణానది నుంచి సాగునీరు వంటవి అభివృద్ధి చేశానని రాబోయే ఎన్నికల్లో తనను రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు గ్రామంలో అయనకు బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాణోతు సైదమ్మ, మాజీ సర్పంచ్ బోగాల మోహన్‌రెడ్డి, బాలరాజు, వెంకయ్య, శ్రీనివాసరెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
సాక్షి, రంగారెడ్డి : జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చూడముచ్చటైన సీతారాముల జంటను చూడటానికి చిన్నాపెద్దా తరలివచ్చారు. పూజారులు స్వామివార్లను పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. సీతమ్మవారికి తాళి బొట్టు కట్టే సమయం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు. మేళతాళాలతో ఆ అందమైన దృశ్యాన్ని చూసి తరించారు. చలువ పందిళ్ల నీడలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తృప్తి పొందారు. సీతారాముల కల్యాణం సందర్భంగా ఆలయ పూజారులు సీతారాముల కథను కళ్లకు కట్టినట్టుగా వినిపించారు. రామాయణంలోని కీలక ఘట్టాలను భక్తుల ముందు ఆవిష్కరింపజేశారు. -
‘ర్యాలీలతో రాముడి పేరు చెడగొడుతున్నారు’
సాక్షి, కోల్‌కతా: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ర్యాలీలతో శ్రీరాముడి పేరును చెడగొడుతున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమి రోజు ర్యాలీల సందర్భంగా జరిగే మత ఘర్షణలపై సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయుధాలతో శోభాయాత్రలు జరపాలని దేవుడు ఎవరికైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. కొంత మంది అవివేకులు ఆయుధాలతో ర్యాలీలు చేస్తూ దేవుడి పేరు చెడగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. శాంతీయుతమైన ర్యాలీలకు మాత్రమే తాను అనుమతి ఇస్తానని, ఆయుధాలతో ఇతరుల ఇంట్లోకి వెళ్లి హత్యచేసే ర్యాలీలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత పరమైన ర్యాలీలు నిర్వహించినప్పుడు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, గతేడాది దుర్గ మాత శోభాయాత్ర, మొహర్రం పండుగలు ఒకే రోజున వచ్చినప్పుడు కూడా సీఎం మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి మత ఘర్షణలు జరగకుండా జగ్రత్తలు తీసుకున్నారు. మన దేశంలో సాధారణంగా సిక్కు మతస్థులు ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించడం చూస్తుంటాం. అయితే మత పరమైన ర్యాలీలలో కత్తులు, తుపాకులతో ప్రదర్శనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. -
వటపత్రశాయి అలంకారంలో కోదండరాముడు
ఒంటిమిట్ట(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో ఆదివారం ఉదయం కోదండరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరాముడు రోజుకో అవతారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నాడు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వేములవాడలో వైభవంగా రామయ్య కల్యాణం
వేములవాడ: కరీంనగర్ జిల్లాలోని ప్రఖ్యాత రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మహాభిషేకం, ఎదురుకోలు ఉత్సవం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు కొద్దిసేపటి క్రితమే స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి సుమారు 4 లక్షల మంది భక్తులు హాజరైనట్టు ఆలయ అధికారులు తెలిపారు. -
భద్రగిరిలో నేడు రాములవారి కల్యాణం
ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ రాక భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శనివారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. శ్రీ రామనవమి రోజున భద్రగిరిలో జరిగే స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణ తంతు శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభమౌతుంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారు సీతమ్మ వారి మెడలో మాంగల్యధారణ గావిస్తారు. ఈ కమనీయ తంతును మిథిలా స్టేడియంలో 36 వేల మంది వరకు భక్తులు కూర్చొని తిలకించేందుకు ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూలర్లను సైతం ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణం జరిగే మిథిలా స్టేడియూన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు వారి కోసం ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామాలయూనికి విద్యుత్ దీపాలను అలంకరించటంతో విద్యుత్ కాంతుల నడుమ శోభాయమానంగా కనిపిస్తోంది. భక్తులందరికీ స్వామి వారి ప్రసాదాలను అందించేందుకు సుమారు 2 లక్షల లడ్డూల ప్రసాదాలను సిద్ధం చేశారు. 60 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈసారి అందరికీ ముత్యాల తలంబ్రాలను అందించాలనే ఉద్దేశంతో రూ. 50 లకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాంనాయక్ శుక్రవారం భద్రాచలంలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రాకతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో ఇదే వేదికపై వచ్చే ఆదివారం స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. దీనికి గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. ఖమ్మం చేరుకున్న కేసీఆర్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే శుక్రవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. రాత్రి భద్రాచలంలో బస చేశారు. శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ప్రభుత్వం తరఫున సీఎం తీసుకురావడం ఆనవాయితీ. ఇప్పటిదాకా అందరు సీఎంలూ నేరుగా నవమి నాడే వాటిని తీసుకురాగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న సీతారాముల కల్యాణ వేడుకలో పాల్గొనేందుకు కేసీఆర్ మాత్రం ఒక రోజు ముందే సకుటుంబంగా భద్రాచలం వచ్చారు. కల్యాణానికి రాత్రి బస చే సిన తొలి సీఎం అయ్యారు.అందరు సీఎంలూ హెలికాప్టర్లో రాగా కేసీఆర్ రోడ్డు మార్గాన వచ్చారు. ఖమ్మం సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద తుమ్మల నాగేశ్వరరావు తదితర మంత్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వైభవంగా ఎదుర్కోలు ఉత్సవం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రికి పెళ్లి సందర్భంగా వారివారి వంశాల గొప్పతనాన్ని గురించి చెప్పుకునే ఈ వేడుక భక్తులకు కనువిందు చేసింది. మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ కొంతమంది సీతమ్మ వారివైపు, మరికొంతమంది రామయ్య వారివైపు చేరి ఈ వేడుకను నిర్వహించారు. గతంలో రాజవీధిలో ఈ వేడుకలను నిర్వహించేవారు. ఈ ఏడాది స్వామివారిని భక్తులంతా దర్శించుకునేందుకు వీలుగా కల్యాణ మండపం వద్దనే నిర్వహించారు. కల్యాణ మూర్తులకు ప్రభుత్వం తరఫున అందజేసిన పట్టువస్త్రాలను స్వామివార్లకు ధరింపజేశారు. హిందూముస్లింల ఐక్యతను చాటుతూ భక్తులందరికీ పన్నీరును చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. నేడు భద్రాద్రి రాముడికి టీటీడీ పట్టు వస్త్రాలు సాక్షి , తిరుమల: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి శనివారం టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించనుంది. ఈవో సాంబశివరావు దంపతులు పట్టువస్త్రాలు అందజేసి అక్కడ నిర్వహించే కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అలాగే విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరామచంద్ర మూర్తి ఆలయానికి, అదే జిల్లాలోని మరో రామాలయానికి కూడా సుమారు పదిహేనేళ్లుగా టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. ఇప్పటికే ఆయా ఆలయాలకుతిరుమల ఆలయం నుంచి పట్టువస్త్రాలు పంపారు. 2న ఒంటిమిట్ట కోదండరామునికి శ్రీవారి పట్టు వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా నవమి వేడుకల్ని నిర్వహించే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామునికి కూడా టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించనుంది. ఏప్రిల్ 2వ తేది రాత్రి 8 గంటల తర్వాత టీటీడీ ఈవో సాంబశివరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీవెంకటేశ్వర భక్తి చానెల్లో పలు ఉత్సవాలను ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. పదడుగుల అగర్బత్తి వెలిగించిన కేసీఆర్ భార్య ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో పది అడుగుల బత్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంత్రి కేటీఆర్ భార్యతో కలసి శుక్రవారం రాత్రి వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరులోని అంబికా దర్బార్ అగర్బత్తిల కంపెనీ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా పది అడుగుల ఎత్తులో ఉన్న అగర్బత్తిని వెలిగిస్తారు. ఈ ఏడాది దీనిని ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపం సమీపంలో ఏర్పాటు చేశారు. ఆరుగురు కార్మికులు వారం రోజుల పాటు శ్రమంచి ఈ అగర్బత్తిని తయారు చేసినట్లుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ఉపేందర్, ఆనందరావు, కుమార్ రాజా, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ నవమి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నకాలంలో నవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించేది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేవారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. దీంతో వచ్చే మార్చి 28న నిర్వహించనున్న నవమి వేడుకలకు ఒంటిమిట్టలోని రామాలయాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. అయితే దీనికి సంబంధించి జీవో విడుదల కావాల్సి ఉంది.