సాక్షి, భద్రాచలం : భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానానికి మంత్రి చేరుకొని వాటిని సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి కిటకిటలాడింది. మిథిల కల్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు.
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా.. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి వారు సిద్ధమయ్యారు. నేడు(ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, పెళ్లి సామగ్రితో ఆలయానికి చేరుకున్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఏడాదికోసారి శ్రీరామనవమి నా డు భద్రాద్రిలో అంగరంగ వైభంవగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం కోసం అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. దేశ నలుమూలల నుం చి తరలివచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం మహాపట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, శనివారం రాత్రి రామాలయంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమా లను తిలకించిన భక్తు లు పరవశించిపోయా రు.
ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే..
భద్రాద్రి మిథిలా స్డేయంలో ఆదివారం ఉదయం 10.30 గంట ల నుంచి 12.30 గంట ల వరకు జరిగే రామ య్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించి తరించేందుకు ఇప్పటికే భక్తులు భారీగా చేరుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్... ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాల య పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌక ర్యం కల్పించారు.
గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. రామాలయం, మాఢవీధులు, గోదావరి ఘాట్‌లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలు గొందుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మిథి లా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ తంతు నిర్వహిస్తారు.
రామతీర్థంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సీతారాములకు ఆలయ అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment