bhdrachalam
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి
సాక్షి, భద్రాచలం : భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానానికి మంత్రి చేరుకొని వాటిని సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి కిటకిటలాడింది. మిథిల కల్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది. కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా.. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి వారు సిద్ధమయ్యారు. నేడు(ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, పెళ్లి సామగ్రితో ఆలయానికి చేరుకున్నారు. భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాదికోసారి శ్రీరామనవమి నా డు భద్రాద్రిలో అంగరంగ వైభంవగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం కోసం అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. దేశ నలుమూలల నుం చి తరలివచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం మహాపట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా, శనివారం రాత్రి రామాలయంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమా లను తిలకించిన భక్తు లు పరవశించిపోయా రు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే.. భద్రాద్రి మిథిలా స్డేయంలో ఆదివారం ఉదయం 10.30 గంట ల నుంచి 12.30 గంట ల వరకు జరిగే రామ య్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించి తరించేందుకు ఇప్పటికే భక్తులు భారీగా చేరుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్... ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాల య పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌక ర్యం కల్పించారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. రామాలయం, మాఢవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలు గొందుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మిథి లా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ తంతు నిర్వహిస్తారు. రామతీర్థంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా జరిగాయి. ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సీతారాములకు ఆలయ అనువంశిక ధర్మకర్త పుసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. -
జల కళ
సాక్షి, ఖమ్మం: ఎడతెరపి లేకుండా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో జిల్లాలో వాగులు, వంకలు జళకళ సంతరించుకున్నాయి. ఈ వర్షం అన్ని పంటల సాగుకు అనుకూలం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వర్షపాతం. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కలిపి సోమవారం 270 సెం.మీ వర్షం పడింది. అత్యధికంగా చింతూరులో 15.3 సెం.మీ, అత్యల్పంగా దమ్మపేటలో 1.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు పడుతుండడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలోకి కొంతమేర నీరు చేరింది. కొత్తగూడెం, పాల్వంచ పరిధిలో ముర్రేడు, కిన్నెరసాని నదులు ఓ మోస్తరుగా ప్రవహిస్తున్నాయి. కొత్తగూడెం మండలంలోని సింగభూపాలెం చెరువు పూర్తిగా నిండిపోయింది. వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లోకి వరద నీరు చేరడంతో ఉత్పత్తి స్తంభించిపోయింది. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలో 53 వేల టన్నుల మేర ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. భద్రాచలం డివిజన్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గుండాల మండలంలోని మల్లన్న వాగు, జల్లేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గుండాల మండల కేంద్రానికి మండలంలోని ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు నీటిమట్టం 17 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులకు ఈరాత్రికి చేరే అవకాశముంది. ఎగువ ప్రాంతంలోని నందిపాడు, తిరుమలకుంట, కావడిగుండ్ల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ నిండే అవకాశముందని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారు. తాగు, సాగునీటికి ఉపయోగించే అంకమ్మ చెరువు అలుగు వరకు నీళ్లు చేరాయి. ముల్కలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టులోకి వర్షపు నీరు తక్కువ గా చేరింది. ఇలాగే రెండు రోజులు వర్షాలు కురిస్తే రిజర్వాయర్ నిండనుంది. కుక్కునూరు మండలంలోని గుండేటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కుక్కునూరు, బెస్తగూడెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలంలోని యడవల్లి వద్ద ఎద్దువాగుపై బ్రిడ్జి నీటమునిగింది. దీంతో కోయిదా- వేలేరుపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వైరా రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఈవో x ఉద్యోగులు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈవో రఘునాథ్, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈవో వేధిస్తున్నార ని ఆరోపిస్తూ సహాయ నిరాకరణ చేపట్టిన ఉద్యోగులు, అర్చకు లు ఆందోళనను ఉధృతం చేశారు. ఈవో పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మం డపానికి ఎదురుగా ఆదివారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. దేవస్థానం స్థానాచార్యులు కె.ఇ.స్థలశాయి, ఉపప్రధానార్చకులు కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు, ఎస్.శ్రీనివాసాచార్యులు, అర్చకులు బి.రామకృష్ణబాబు, ఉద్యోగులు కె.సతీష్, టి.వెంకటరత్నం, కృష్ణమాచారి, వెంకన్న దీక్షల్లో కూర్చున్నారు. భక్తులకు అంతరాయం... ఉద్యోగులు, అర్చకులు రిలే నిరాహార దీక్ష చేస్తుండడంతో ఆదివారం భక్తులకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో స్వామివారికి చేరువగా వెళ్లి పూజలు చేయించుకోవాలనుకున్న భక్తులు సాధారణ పూజలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు, ఆదివారం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అందరికీ సరిపడా ప్రసాదం(పులిహార) అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఆలయ ఉద్యోగులంతా సహాయ నిరాకరణలో ఉండటంతో కార్యాలయ తలుపులు కూడా తెరుచుకో లేదు. ముదురుతున్న వివాదం... రామాలయంలో ఈవో, అర్చకులకు మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఈవో వివిధ కారణాలతో ఉద్యోగులను వే ధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటి వరకూ వినిపించ గా, ఇది మత పరమైన అంశాలకు ముడిపడటంతో వివాదం మరింత రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవో రఘునాధ్ కూడా ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధర్వణ వేదపండితులైన జి.మురళీ కృష్ణమాచార్యులను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు ఈవోకు అనుకూలంగా ఉన్న అర్చకులు అంటున్నా రు. కాగా, మత పరమైన ఈ వివాదంలో ఆలయం బయట ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు కూడా కల్పించుకోవటంతో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో కల్పించుకొని వివాదం సమసిపోయేలా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దీక్షలకు జేఏసీ మద్దతు... అర్చకులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను జేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ఉద్యోగులు, అర్చకులకు ఈవో ఇచ్చిన మెమోలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను ఈవో వేధిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికే టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈవోపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన మెమోలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలన్నారు. ఈవో ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్వో సాయిబాబా పాల్గొన్నారు. కాగా దీక్షలకు పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎస్కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ సంఘీభావం తెలిపారు.