
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్దలతో రాములవారి కల్యాణాన్ని చూసి తరించేందుకు ఆలయాలకు క్యూ కట్టారు. ఇక, భద్రాద్రిలో సీతారాముల కల్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది.
మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం అట్టహాసంగా, కన్నులపండుగగా జరుగుతోంది. స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్.. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక, టీటీడీ తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు. కాగా, సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ‍్యలో తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment