నిరుద్యోగం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆకలి చంపేస్తున్నా, కడుపు నిండిందని చెప్పాలి. సొంత ఇంట్లోని వ్యక్తుల దగ్గర కూడా ‘‘డబ్బులున్నాయా?’’ అనడిగితే ఉన్నాయంటూ తలూపాలి. ఎందుకంటే ఆకలని, డబ్బులని అడగడంలో నిరుద్యోగం ఒక సిగ్గును తెచ్చిపెడుతుంది. భయపెడుతుంది. అలాంటి ఒకతని చిన్న జీవితాన్ని చదవండి.. ‘చెరిగిపోయిన చిత్రాలు’ కథలో...
మొదటి సినిమా
ఆ అమ్మాయి ఇప్పటివరకూ థియేటర్‌లో ఒక్క సినిమా కూడా చూడలేదు. అసలు థియేటర్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆరోజు ఆ అమ్మాయి వాళ్ల నాన్న, తమ్ముడు సినిమాకు వెళుతున్నారు. ‘‘నువ్వూ వస్తావా?’’ అని అడిగాడు నాన్న, అమ్మాయిని. ఎందుకో ఆ అమ్మాయికి మొదటిసారి సినిమాకు వెళ్లాలనిపించింది. కొత్త బట్టలేస్కొని, తనకిష్టమైన చెప్పులు తొడుక్కొని బయల్దేరింది. బయటేమో ఎర్రటి ఎండ. థియేటర్‌కి వెళ్లాలంటే పక్క ఊరికి వెళ్లాలి. దార్లో చెప్పు తెగిపోయింది. ఆ అమ్మాయికి ఇలా మొదటి సినిమా అనుభవమంతా రకరకాలుగా సాగిపోయింది. ఆ ఒక్కరోజు, ఆమెకు ఆ మొదటి సినిమా ఇచ్చిన అనుభూతిని చదవండి.. ‘మొదటి సినిమా’ కథలో...
హృదయభాష
అతనిది ఒక విచిత్రమైన భాష. చాలా చదివాడు. ఎంత చదివాడంటే, అందరూ మాట్లాడే భాష కాకుండా, కొత్త భాష కనిపెట్టి మరీ మాట్లాడేటంత. ఆ కొత్త భాషే అతనికి లెక్కలేనన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. చావుకు దగ్గరయ్యే వరకూ, అతని సొంత భాష అతణ్ని ఎలా ఇబ్బంది పెట్టింది? చదవండి.. ‘హృదయ భాష’ కథలో...
Comments
Please login to add a commentAdd a comment