సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. అన్నిరకాల రుణాలపై బ్యాంకు వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ను 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించింది. ఆర్‌బీఐ తాజా ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటు యథాతథంగా ఉంచింది సంగతి తెలిసిందే. దీని ప్రకారం బ్యాంకులు సంబంధిత చర్యలు వెంటనే చేపట్టాలని ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా సవరణ ప్రకారం ఎస్‌బీఐ వసూలు చేసే వార్షిక వడ్డీ రేటు 7.90 శాతంగా ఉంటుంది. ఈ రేట్లు రేపు (మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment