సాక్షి, ముంబై: ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ఆధ్వర్యంలో జరిగిన తొలి సమీక్ష సమావేశంలో యథాతథ నిర్ణయానికి బ్రేక్ వేసి రేట్ కట్‌కు నిర్ణయించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ) తీర్మానించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంనుంచి 6.25శాతానికి దిగి వచ్చింది. అలాగే బ్యాంకు రేటు 6.75 నుంచి 6.50 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణ అంచనాలను కూడా సవరించింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)లో నలుగురు రేటు కట్‌కు ఆమోదం తెలిపారని శక్తి కాంత దాస్ వెల్లడించారు.
ఆరవ ద్వైమాసిక రివ్యూలో రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటు)ను 6.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో (వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 6.25శాతంనుంచి 6 శాతానికి తగ్గింది. దీంతోస్టాక్‌మార్కెట్లు పాజిటివ్ స్పందిస్తున్నాయి. బ్యాంకింగ్ షేర్లు లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment