
సాక్షి, ముంబై : ఆర్‌బీఐ రేటు కోత ప్రకటించిన వెంటనే స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. రేట్ కట్ అంచనాలతో ఆరంభంలో భారీగా ఎగిసన సూచీలు ఆర్‌బీఐ ప్రకటన తరువాత కుప్పకూలాయి. సెన్సెక్స్ 120 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయింది. అనంతరం ఫైనాన్స్ సంస్థలకు ఊరటనివ్వడంతో మళ్లీ పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 214 పాయింట్లుకుప్పకూలి 37906 వద్ద, నిఫ్టీ 77పాయింట్ల పతనమై 11243 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలూ నష్టపోతున్నాయి. కోటక్ మహీంద్ర, గ్రాసిం, జీ, బీపీసీఎల్, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నష్టపోతుండగా ఐన్ఫోసిస్, ఎం అండ్ ఎం, టీసీఎస్, హీరో మోటో కార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంకు, రిలయన్స్ లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment