ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలశ్ డిపాజిట్ పథకాన్నిఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ వాస్తవానికి 2023 జూన్ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను జూన్ 30 వరకు అందుబాటులో ఉంచినట్లు ఎస్‌బీఐ తెలిపింది.
ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎస్‌బీఐ కస్టమర్లు ఈ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment