స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఫైల్ ఫోటో)
ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలకు ఎస్‌బీఐ భారీగా కోత పెట్టింది. ఈ ఛార్జీల కోత 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు తెలిపింది.
అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ 3వేల రూపాయలు.
అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 10 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదు.
తగ్గించిన ఎస్‌బీఐ ఛార్జీల వివరాలు:
తమ కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్‌బ్యాక్‌ల అనంతరం ఛార్జీలకు కోత పెట్టినట్టు ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ పీకే గుప్తా తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలకే బ్యాంకు తొలుత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎస్‌బీఐ వద్ద 41 కోట్ల సేవింగ్స్ అకౌంట్లు ఉండగా.. పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్ల పీఎంజేడీవై, బీఎస్‌బీడీ అకౌంట్లు 16 కోట్లు ఉన్నాయి. 21 కంటే తక్కువ వయసున్న అకౌంట్స్ హోల్డర్స్‌కు కూడా మినిమమ్ ఛార్జీల నిబంధనలను బ్యాంకు వర్తింపచేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment