పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్‌ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్‌లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్‌లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..
సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.
ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్‌లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్‌లో నగదు ఉంచుకోవాలి.
జీరో బ్యాలెన్స్ ఖాతాలు
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్‌లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.
రెగ్యులర్ మానిటరింగ్
అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్‌లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.
ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్స్
అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌లను సెట్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలు
ఖాతాను మూసివేయడం
ఎంత ప్రయత్నించినా అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment