మూడు కోట్ల మంది ప్రయాణికులపై ప్రభావం
మహాకుంభమేళా 2025లో ప్రత్యేక ఏర్పాట్లు
భారతీయ రైల్వే 2024 ప్రారంభంలో మొదలు పెట్టిన ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్(TAG)’ 44వ ఎడిషన్ రేపటి వరకు అందుబాటులో ఉంటుంది. తదుపరి ఎడిషన్‌ను 2025 జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. రైల్వేశాఖ కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు, పాత ఎడిషన్‌లోని కొన్ని అంశాలను సవరించనున్న నేపథ్యంలో దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణికులు ప్రభావితం చెందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నమో భారత్ ర్యాపిడ్ రైల్ (Vande Metro), రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను 2025లో ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు 2024లో 70 కొత్త సర్వీసులు, 64 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.
ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..
మహాకుంభమేళా 2025 ఏర్పాట్లు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబోయే మహాకుంభమేళా(mahakumbh mela)కు భారతీయ రైల్వే ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా రైల్వే ప్రయాణాల్లో అత్యున్నత సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. లక్ష మందికి పైగా ఉండటానికి, 3,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది.
మహాకుంభ్ గ్రామ్
మహాకుంభమేళా జరగబోయే ప్రదేశంలో త్రివేణి సంగమం పక్కనే మహాకుంభ్ గ్రామ్ అనే లగ్జరీ టెంట్ సిటీని ఐఆర్‌సీటీసీ(IRCTC) ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 2025 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ఏర్పాట్లు రానున్న రోజుల్లో రైల్వేశాఖకు భారీగా లాభాలు తీసుకొస్తాయని నమ్ముతుంది.
Comments
Please login to add a commentAdd a comment