Minimum balance fine
-
కస్టమర్లకు గట్టి షాక్ ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఖాతాదారులకు అందించే సేవలకు సంబంధించిన చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచి అమలులోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ఖాతా బ్యాలన్స్, బ్యాంక్ లాకర్ ఛార్జీలు, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెంచిన జాబితాలో ఉన్నాయి. కనీస బ్యాలెన్స్: మెట్రో ప్రాంతంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఎబి) పరిమితిని ₹10,000కు పెంచారు. ఇంతకు ముందు పరిమితి ₹5,000గా ఉండేది. త్రైమాసిక కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు గ్రామీణ ప్రాంతాల్లో రుసుమును ₹200 నుంచి ₹400కు, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో ₹300 నుంచి ₹600పెంచినట్లు పీఎన్బీ తెలిపింది. బ్యాంక్ లాకర్ ఛార్జీలు: పీఎన్బీ గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ & మెట్రో ప్రాంతాల్లో తన లాకర్ అద్దె ఛార్జీలను కూడా పెంచింది. పట్టణ ప్రాంతాల్లో లాకర్ ఛార్జీలను ₹500 పెంచారు. బ్యాంక్ లాకర్: జనవరి 15, 2021 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత లాకర్ ని ఏడాదికి ఉచితంగా చూసే సంఖ్య 12(ఇంతకముందు 15)కు తగ్గుతుంది. ఆ తర్వాత లాకర్ తెరిచిన ప్రతిసారి ₹100 చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ అకౌంట్ మూసివేత ఛార్జీలు: కరెంటు ఖాతా తెరిచిన 14 రోజుల తర్వాత ఖాతాను రద్దు చేస్తే రూ.800 అపరాధ రుసుము చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.600గా ఉండేది. కరెంటు ఖాతా తెరిచిన 12 నెలల తరువాత రద్దు చేస్తే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు. పొదుపు ఖాతా లావాదేవీల రుసుము: జనవరి 15 నుంచి పీఎన్బీ నెలకు 3 ఉచిత లావాదేవీలను చేసుకునే అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి ₹50/(బీఎన్ఏ, ఏటీఎమ్, సిడీఎమ్ వంటి ప్రత్నామ్నాయ ఛానళ్లు మినహాయించి) ఛార్జ్ చేస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్ ఖాతాలకు ఇది వర్తించదు. ఇంకా పొదుపు, కరెంట్ ఖాతాల్లో లావాదేవీ ఫీజులను కూడా పెంచింది. ప్రస్తుతం బ్యాంక్ బేస్, నాన్-బేస్ బ్రాంచ్‌లకు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీలను బ్యాంకు అనుమతిస్తుంది. ఆ తర్వాత ఆపై చేసే ప్రతి లావాదేవీకి రూ.25 ఛార్జ్ చేస్తుంది. క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు: పొదుపు, కరెంట్ ఖాతాల రెండింటిపై కూడా నగదు డిపాజిట్ పరిమితిని తగ్గించింది. రోజుకు ఉచిత డిపాజిట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న ₹2 లక్షల నుంచి ₹1 లక్షకు తగ్గించింది. (చదవండి: శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!) -
బ్యాంకుల ‘లీగల్ దోపిడీ’
ప్రస్తుతం దొంగాలకన్నా బ్యాంకులను చూస్తేనే ప్రజలకు ఎక్కువ భయం వేస్తోందంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది బ్యాంకులు అపరాధ రుసుము పేరుతో ప్రజల దగ్గర వసూల్ చేసిన మొత్తం అక్షరాలా ఐదు వేల కోట్ల పై మాటే. చట్ట వ్యతిరేకంగా ఒక మనిషి నుంచి మరో మనిషి సొమ్మును కాజేయడాన్ని ‘‘దొంగతనం’’ అంటారు, మరి రూల్స్ పేరు చెప్పి దోచుకోవడాన్ని ‘‘లీగల్ తెఫ్ట్’’ అనే కదా అనాలి..! ఎస్బీఐ ఇదే ఆర్థిక సంవత్సరం రూ. 6,547కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఆ నష్టంలో దాదా పు సగాన్ని మినిమం బాలన్స్ నిబంధన కిందనే వినియోగదారుల జేబునుంచి వసూలు చేసుకుంది. ఇలా అన్ని జాతీయరంగ బ్యాంకులలో అన్నింటికన్నా ఎక్కువగా వసూలు చేసింది ఒక్క ఎస్బీఐ మాత్రమే. దేశ వ్యాప్తంగా ఉన్న 3 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, 27 ప్రైవేట్ బ్యాంకులు ఒక్క మినిమం బాలన్స్ ఉంచడం లేదనే సాకుతోనే వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. సత్వరమే కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే మోదీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగలక తప్పదు. శ్రీనివాస్ గుండోజు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 99851 88429 -
మినిమమ్ బ్యాలెన్స్‌లపై ఎస్బీఐ ప్రకటన
న్యూఢిల్లీ : ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారుల నుంచి బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర జరిమానాను వసూలు చేశాయని వస్తున్న వార్తలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నెలవారీ నిర్వహించే కనీసం బ్యాలెన్స్‌లను ఏప్రిల్ నుంచి తాము 40 శాతం తగ్గించామని పేర్కొంది. అంతేకాక 40 శాతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లను ఈ నిబంధనల నుంచి మినహాయించామని వెల్లడించింది. కనీస బ్యాలెన్స్ నిర్వహించలేకపోవడంపై విధించే ఛార్జీలు, ఇండస్ట్రీలోనే తమవే అత్యంత తక్కువగా ఉన్నాయని చెప్పింది. ఎస్బీఐ భారీ మొత్తంలో జరిమానాలు విధించింది అని వస్తున్న రిపోర్టులపై బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఎస్బీఐ ఆ నిబంధనల కింద నాలుగు కేటగిరీల్లో బ్రాంచులను క్లాసిఫై చేసింది. రూరల్, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో. బ్రాంచు ఉండే ప్రాంతం బట్టి సగటు నెలవారీ నిల్వలు బ్యాంక్ అకౌంట్లో తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ కస్టమర్ కనుక ఈ నిల్వలను నిర్వహించలేని పక్షంలో, జరిమానాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎస్బీఐ బ్రాంచ్ టైప్ సగటు నెలవారీ నిల్వలు మెట్రో రూ.3000 అర్బన్ రూ.3000 సెమీ-అర్బన్ రూ.2000 రూరల్ రూ.1000 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్లను జరిమానా పేరిట వసూలు చేశాయని బ్యాంకింగ్ డేటాలో వెల్లడైంది. వీటిలో ఎస్బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎస్బీఐ కొన్ని సేవింగ్స్ అకౌంట్లను ఈ సగటు నెలవారీ మొత్తాల నిబంధల నుంచి మినహాయించింది. వాటిలో ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజన్ స్కీన్ జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్, పీఎంజేడీఐ/బీఎస్‌బీడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, పెన్షనర్లు, మైనర్లు, సోషల్ సెక్యురిటీ బెనిఫిట్ హోల్డర్స్ అకౌంట్లు ఈ నిబంధన నుంచి మినహాయింపు పొందుతున్నాయి. ఈ అకౌంట్ల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని ఎస్బీఐ ప్రకటించింది. మొత్తం 42.5 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో సుమారు 40 శాతం అకౌంట్లను కనీస బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక కస్టమర్లు ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి బీఎస్‌బీడీ అకౌంట్లలోకి మారడానికి ఎలాంటి ఛార్జీలను వేయడం లేదని తెలిపింది. -
తగ్గించిన ఛార్జీలు రేపటి నుంచే అమలు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల సగటు నెలవారీ మొత్తాలను నిర్వహించని సేవింగ్స్ అకౌంట్లపై విధిస్తున్న ఛార్జీలను 75 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందబోతున్నారు. అమల్లోకి రాబోతున్న తగ్గింపు ఛార్జీలివే! అంతకముందు మెట్రో, అర్బన్ ప్రాంతాలకు నెలవారీ విధిస్తున్న ఛార్జీ 50 రూపాయల(+జీఎస్టీ) నుంచి 15 రూపాయల(+జీఎస్టీ)కు తగ్గబోతోంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల సేవింగ్స్ అకౌంట్లలో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ 3వేల రూపాయలు. అదేవిధంగా సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల నెలవారీ ఛార్జీలను కూడా 40 రూపాయల(+జీఎస్టీ) నుంచి 12 రూపాయల(+జీఎస్టీ)కు, 10 రూపాయలకు తగ్గించింది. ఈ ఛార్జీల తగ్గింపుతో పాటు ఎలాంటి ఛార్జీలు లేకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌ను బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌గా మార్చుకోవడానికి సదుపాయం కల్పిస్తోంది. దీంతో కస్టమర్లు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్‌లను ఛార్జీలను విధించడం లేదని తెలిసిందే. -
మినిమమ్ బ్యాలెన్స్ ఫైన్ రూ.235 కోట్లు
ఇండోర్ : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు పాటించని వారి ఖాతాల నుంచి భారీమొత్తంలోనే జరిమానా వసూలు చేసింది. నెలవారీ కనీస మొత్తాలను పాటించని ఖాతాలపై విధించిన ఛార్జీలతో ఈ ఏడాది తొలి క్వార్టర్లో రూ.235.06 కోట్లను రాబట్టింది. 388.74 లక్షల అకౌంట్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు ఎస్బీఐ పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా నీముచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ దాఖలుచేసిన దరఖాస్తుకు, ఎస్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. జూన్ 30తో ముగిసిన తొలి క్వార్టర్లో నెలవారీ కనీస మొత్తాల నిర్వహణలో విఫలమైన 388.74 లక్షల అకౌంట్ల నుంచి రూ.235.06 కోట్లను వసూలు చేసినట్టు ఎస్బీఐ వెల్లడించింది. ముంబైకు చెందిన బ్యాంకు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈ సమాచారాన్ని అందించారని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. అయితే ఏ కేటగిరీ అకౌంట్ల నుంచి ఈ జరిమానాను వసూలు చేసిందో ఎస్బీఐ వెల్లడించలేదని చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు.