మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఫైన్‌ రూ.235 కోట్లు | SBI collects Rs235 crore in minimum balance fine in 1st quarter | Sakshi
Sakshi News home page

మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఫైన్‌ రూ.235 కోట్లు

Published Sat, Aug 19 2017 8:20 PM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఫైన్‌ రూ.235 కోట్లు

మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఫైన్‌ రూ.235 కోట్లు

ఇండోర్‌ : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిబంధనలు పాటించని వారి ఖాతాల నుంచి భారీమొత్తంలోనే జరిమానా వసూలు చేసింది. నెలవారీ కనీస మొత్తాలను పాటించని ఖాతాలపై విధించిన ఛార్జీలతో ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో రూ.235.06 కోట్లను రాబట్టింది. 388.74 లక్షల అకౌంట్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు ఎస్‌బీఐ పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా నీముచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌడ్‌ దాఖలుచేసిన దరఖాస్తుకు, ఎస్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
 
జూన్‌ 30తో ముగిసిన తొలి క్వార్టర్‌లో నెలవారీ కనీస మొత్తాల నిర్వహణలో విఫలమైన 388.74 లక్షల అకౌంట్ల నుంచి రూ.235.06 కోట్లను వసూలు చేసినట్టు ఎస్‌బీఐ వెల్లడించింది. ముంబైకు చెందిన బ్యాంకు ఆపరేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఈ సమాచారాన్ని అందించారని చంద్రశేఖర్‌ గౌడ్‌ తెలిపారు. అయితే ఏ కేటగిరీ అకౌంట్ల నుంచి ఈ జరిమానాను వసూలు చేసిందో ఎస్‌బీఐ వెల్లడించలేదని చంద్రశేఖర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement