Minimum account balance penalty
-
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్‌లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
మినిమమ్ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్
ముంబై : దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మినిమమ్ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. కనీస నిల్వల మొత్తాన్ని 75 శాతం తగ్గించాలని ఎస్బీఐ ప్లాన్చేస్తోంది. ప్రస్తుతం మెట్రోల్లో రూ.3000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.2000, రూరల్ ప్రాంతాల్లో రూ.1000గా ఉన్నాయి. అదేవిధంగా నెలవారీ పరిమితిని కూడా క్వార్టర్లీకి మార్చాలని చూస్తోంది. మినిమమ్ బ్యాలెన్స్ మొత్తాలను నిర్వహించని ఖాతాల నుంచి సేకరిస్తున్న ఫీజుల ఆదాయంపై ప్రతికూల వార్తలు వెలువడుతున్న క్రమంలో బ్యాంకు ఈ నెలవారీ మొత్తాన్ని రూ.1000కి తగ్గించాలని చూస్తోంది. నెలవారీ మొత్తాలను నిర్వహించని కస్టమర్ల పెనాల్టీ వివరాలను ఆర్థికమంత్రిత్వ శాఖ సమర్పించిన అనంతరం ఎస్బీఐకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే పెనాల్టీ కంటే ఎస్బీఐ విధిస్తున్న పరిమితులే ఎక్కువగా ఉన్నాయి తెలిసింది. ఇటీవలే బొంబై-ఐఐటీ ప్రొఫెసర్ విడుదల చేసిన అధ్యయన రిపోర్టులో కూడా మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు అసంమజసంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్బీఐ మొత్తం 40.5 కోట్ల సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లను కలిగి ఉంది. ఆరేళ్ల విరామం అనంతరం 2017 ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ ఈ నెలవారీ సగటు నిల్వల ఛార్జీలను పునఃప్రవేశపెట్టింది. పలు విమర్శల అనంతరం అక్టోబర్ 1 నుంచి ఈ ఛార్జీలను కొంత తగ్గించింది. ప్రస్తుతమున్న ఛార్జీలు మెట్రో ఏరియాలు - రూ.3000 రూ.2999 నుంచి రూ.1500 మధ్యలోకి బ్యాలెన్స్ పడిపోతే, రూ.30 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.1499 నుంచి రూ.750 బ్యాలెన్స్ వారు రూ.40 పెనాల్టీ భరించాలి. రూ.750 కంటే తక్కువుంటే రూ.50 ఫైన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో - రూ.2000 రూ.1999 నుంచి రూ.1000 వారికి జరిమానా రూ.20 రూ.999 నుంచి రూ.500 బ్యాలెన్స్‌లకు రూ.30 ఫైన్ రూ.500 కంటే తక్కువుంటే రూ.40 ఫైన్ రూరల్ ప్రాంతాల్లో : రూ.1000 రూ.999 నుంచి రూ.500 బ్యాలెన్స్‌లకు : రూ.20 ఫైన్ రూ.499 నుంచి రూ.250 బ్యాలెన్స్‌లకు : రూ.30 ఫైన్ రూ.249 కంటే తక్కువకు : రూ.40 జరిమానా -
ఆ పెనాల్టీ కింద రూ.2000కోట్లు: ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : కనీస మొత్తాన్ని నిల్వ ఉంచని ఖాతాదారులపై విధించే జరిమానాలు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు భారీగానే వసూలు అవుతున్నాయి. జరిమానా కింద మినిమమ్ బ్యాలెన్స్ నిర్వర్తించని పొదుపు ఖాతాలపై రూ.2000 కోట్లు మేర వసూలు చేయనున్నట్టు ఎస్బీఐ అంచనావేస్తోంది. ఈ మొత్తాన్ని ఆధార్‌తో అకౌంట్లను అనుసంధానించే వ్యయాలకు వాడనున్నట్టు బ్యాంకు తెలిపింది. డిసెంబర్ 31 లోపల అన్ని పొదుపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ చాలా వ్యయభారంతో కూడుకున్నదని తెలిసిందే. బ్యాంకులు ఇప్పటికే ఇటువంటి ఖాతాలను నిర్వహించడం, కేవైసీ అవసరాన్ని అనుసరించడం వంటి వాటివల్ల అధిక ఖర్చులు ఎదుర్కొంటున్నాయని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు. ఈ వ్యయాలను పూరించడానికి, సేవింగ్స్ అకౌంట్లు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వర్తించని పెనాల్టీలను వాడనున్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల పెనాల్టీలను వసూలు చేయనున్నట్టు కూడా అంచనావేస్తున్నారు. ఉన్న 40 కోట్ల అకౌంట్లలో ఆధార్‌తో ప్రతి అకౌంట్‌ను డిసెంబర్ 31 లోపల లింక్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదని కుమార్ తెలిపారు. కానీ అంత తేలికైన పని కాదన్నారు. ఖాతాదారుని సంప్రదించడం, ప్రక్రియను పూర్తిచేయడం, ఐటీలో మార్పులు చేయడం వంటి ప్రక్రియ వల్ల ఆధార్ లింక్, చాలా ఖర్చులో కూడుకున్నదని చెప్పారు. ఈ లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించడానికి టెక్నాలజీపై ఎక్కువగా పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రతేడాది టెక్నాలజీపై పెట్టే వ్యయాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యయాలన్నింటిన్నీ పెనాల్టీల నుంచి వసూలైన మొత్తాలతో భర్తీ చేయగలుగుతామని కుమార్ తెలిపారు. జూన్ చివరి వరకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను పాటించని 60 మిలియన్ సేలింగ్స్ బ్యాంకు అకౌంట్లపై ఎస్బీఐ రూ.235.06 కోట్ల పెనాల్టీలను వసూలుచేసింది. ఆర్టీఐ ద్వారా దాఖలైన ఫిర్యాదులో ఇది వెల్లడించింది.