ఆ పెనాల్టీ కింద రూ.2000కోట్లు: ఎస్‌బీఐ
ఆ పెనాల్టీ కింద రూ.2000కోట్లు: ఎస్‌బీఐ
Published Mon, Sep 18 2017 9:34 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి, న్యూఢిల్లీ : కనీస మొత్తాన్ని నిల్వ ఉంచని ఖాతాదారులపై విధించే జరిమానాలు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు భారీగానే వసూలు అవుతున్నాయి. జరిమానా కింద మినిమమ్ బ్యాలెన్స్ నిర్వర్తించని పొదుపు ఖాతాలపై రూ.2000 కోట్లు మేర వసూలు చేయనున్నట్టు ఎస్‌బీఐ అంచనావేస్తోంది. ఈ మొత్తాన్ని ఆధార్‌తో అకౌంట్లను అనుసంధానించే వ్యయాలకు వాడనున్నట్టు బ్యాంకు తెలిపింది. డిసెంబర్ 31 లోపల అన్ని పొదుపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ చాలా వ్యయభారంతో కూడుకున్నదని తెలిసిందే. బ్యాంకులు ఇప్పటికే ఇటువంటి ఖాతాలను నిర్వహించడం, కేవైసీ అవసరాన్ని అనుసరించడం వంటి వాటివల్ల అధిక ఖర్చులు ఎదుర్కొంటున్నాయని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌నీష్ కుమార్ చెప్పారు. ఈ వ్యయాలను పూరించడానికి, సేవింగ్స్ అకౌంట్లు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వర్తించని పెనాల్టీలను వాడనున్నట్టు తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్ల పెనాల్టీలను వసూలు చేయనున్నట్టు కూడా అంచనావేస్తున్నారు. ఉన్న 40 కోట్ల అకౌంట్లలో ఆధార్‌తో ప్రతి అకౌంట్‌ను డిసెంబర్ 31 లోపల లింక్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదని కుమార్ తెలిపారు. కానీ అంత తేలికైన పని కాదన్నారు. ఖాతాదారుని సంప్రదించడం, ప్రక్రియను పూర్తిచేయడం, ఐటీలో మార్పులు చేయడం వంటి ప్రక్రియ వల్ల ఆధార్ లింక్, చాలా ఖర్చులో కూడుకున్నదని చెప్పారు. ఈ లావాదేవీలను జాగ్రత్తగా నిర్వర్తించడానికి టెక్నాలజీపై ఎక్కువగా పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రతేడాది టెక్నాలజీపై పెట్టే వ్యయాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యయాలన్నింటిన్నీ పెనాల్టీల నుంచి వసూలైన మొత్తాలతో భర్తీ చేయగలుగుతామని కుమార్ తెలిపారు. జూన్ చివరి వరకు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను పాటించని 60 మిలియన్ సేలింగ్స్ బ్యాంకు అకౌంట్లపై ఎస్‌బీఐ రూ.235.06 కోట్ల పెనాల్టీలను వసూలుచేసింది. ఆర్‌టీఐ ద్వారా దాఖలైన ఫిర్యాదులో ఇది వెల్లడించింది.
Advertisement
Advertisement