మినిమమ్‌ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

మినిమమ్‌ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్‌

Published Fri, Jan 5 2018 10:40 AM

SBI to cut minimum balance requirement - Sakshi

ముంబై : దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మినిమమ్‌ బ్యాలెన్స్‌లపై మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతుంది. కనీస నిల్వల మొత్తాన్ని 75 శాతం తగ్గించాలని ఎస్‌బీఐ ప్లాన్‌చేస్తోంది. ప్రస్తుతం మెట్రోల్లో రూ.3000, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో రూ.2000, రూరల్‌ ప్రాంతాల్లో రూ.1000గా ఉన్నాయి. అదేవిధంగా నెలవారీ పరిమితిని కూడా క్వార్టర్లీకి మార్చాలని చూస్తోంది.  మినిమమ్‌ బ్యాలెన్స్‌   మొత్తాలను నిర్వహించని ఖాతాల నుంచి సేకరిస్తున్న ఫీజుల ఆదాయంపై ప్రతికూల వార్తలు వెలువడుతున్న క్రమంలో బ్యాంకు ఈ నెలవారీ మొత్తాన్ని రూ.1000కి తగ్గించాలని చూస్తోంది. నెలవారీ మొత్తాలను నిర్వహించని కస్టమర్ల పెనాల్టీ వివరాలను ఆర్థికమంత్రిత్వ శాఖ సమర్పించిన అనంతరం ఎస్‌బీఐకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విధించే పెనాల్టీ కంటే ఎస్‌బీఐ విధిస్తున్న పరిమితులే ఎక్కువగా ఉన్నాయి తెలిసింది. ఇటీవలే బొంబై-ఐఐటీ ప్రొఫెసర్‌ విడుదల చేసిన అధ్యయన రిపోర్టులో కూడా మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిర్వహించని ఖాతాలపై బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు అసంమజసంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్‌బీఐ మొత్తం 40.5 కోట్ల సేవింగ్స్‌ అకౌంట్‌ కస్టమర్లను కలిగి ఉంది. ఆరేళ్ల విరామం అనంతరం 2017 ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐ ఈ నెలవారీ సగటు నిల్వల ఛార్జీలను పునఃప్రవేశపెట్టింది. పలు విమర్శల అనంతరం అక్టోబర్‌ 1 నుంచి ఈ ఛార్జీలను కొంత తగ్గించింది. 

ప్రస్తుతమున్న ఛార్జీలు
మెట్రో ఏరియాలు - రూ.3000
రూ.2999 నుంచి రూ.1500 మధ్యలోకి బ్యాలెన్స్‌ పడిపోతే, రూ.30 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
రూ.1499 నుంచి రూ.750 బ్యాలెన్స్‌ వారు రూ.40 పెనాల్టీ భరించాలి.
రూ.750 కంటే తక్కువుంటే రూ.50 ఫైన్‌

సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో - రూ.2000
రూ.1999 నుంచి రూ.1000 వారికి జరిమానా రూ.20
రూ.999 నుంచి రూ.500 బ్యాలెన్స్‌లకు రూ.30 ఫైన్‌
రూ.500 కంటే తక్కువుంటే రూ.40 ఫైన్‌

రూరల్‌ ప్రాంతాల్లో  : రూ.1000
రూ.999 నుంచి రూ.500 బ్యాలెన్స్‌లకు : రూ.20 ఫైన్‌
రూ.499 నుంచి రూ.250 బ్యాలెన్స్‌లకు : రూ.30 ఫైన్‌
రూ.249 కంటే తక్కువకు : రూ.40 జరిమానా 

Advertisement
 
Advertisement
 
Advertisement