bank balance
-
మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
పొదుపు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానా(penalty) చెల్లించాలనేలా బ్యాంకు సిబ్బంది చెబుతుంటారు. అకౌంట్ నిర్వహణ, ఏటీఎం కార్డు ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు.. వంటి వాటికోసం సేవింగ్స్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. లేదంటే నిబంధనల ప్రకారం తిరిగి అకౌంట్(Bank Account) వినియోగించినప్పుడు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి ఒకటికి మించిన బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. దాంతో ప్రధానంగా ఉన్న అకౌంట్లోనే లావాదేవీలు(Transactions) నిర్వహిస్తూ మిగతావాటి జోలికి వెళ్లడంలేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత తిరిగి ఆ అకౌంట్లో లావాదేవీలు చేయాలంటే జరిమానా చెల్లించడం తప్పడం లేదు. కొన్ని చిట్కాలు పాటించి జరిమానా భారాన్ని తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిందే..సేవింగ్స్ ఖాతాలో అవసరమైన మినిమం బ్యాలెన్స్(Minimum Balance) ఎల్లవేళలా ఉండేలా చూసుకోవాలి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (MBA)ను ఎలా లెక్కిస్తారో మీ బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దాని పరిమితికి మించి లావాదేవీలు నిర్వహించడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, మీ మినిమం బ్యాలెన్స్ రూ.10,000 అయితే అవసరమైన ఎంఏబీని మెయింటెన్ చేయడానికి నెలలోపు ఆరు రోజుల పాటు రూ.50,000 మీ అకౌంట్లో ఉండాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ నిబంధనలు ప్రతి బ్యాంకును అనుసరించి మారుతుంటాయి. మీ బ్యాంకులో ఎంఏబీ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా అకౌంట్లో నగదు ఉంచుకోవాలి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుబేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్‌బీడీఏ) అని కూడా పిలువబడే ఈ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాకు మారేందుకు ప్రయత్నించాలి. చాలావరకు సాలరీ అకౌంట్లు ఈ తరహా ఖాతాలుగా ఉంటాయి. ఈ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.రెగ్యులర్ మానిటరింగ్అకౌంట్ బ్యాలెన్స్ అవసరమైన కనీస స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి అలర్ట్‌లు లేదా రిమైండర్లను సెట్ చేసుకోవాలి. ఏదైనా కారణాలతో డబ్బు కట్ అయిన వెంటనే అలెర్ట్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ పాటించవచ్చు.ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్అవసరమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు తరచూ లావాదేవీలు చేసే ప్రధాన అకౌంట్ నుంచి బ్యాలెన్స్ తక్కువగా ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్లను సెట్ చేసుకోవాలి.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుఖాతాను మూసివేయడంఎంత ప్రయత్నించినా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేకపోతే, ప్రస్తుత ఖాతాను మూసివేసి, జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందించే బ్యాంకుతో అనుసందానమై కొత్త ఖాతా తెరవడానికి ప్రయత్నించండి. -
ఐదు గంటల్లో కోటీశ్వరుడైన 9వ తరగతి విద్యార్ధి.. అసలేం జరిగిందంటే?
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.బీహార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్‌పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదుఅనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది. -
మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అంటే సేవింగ్స్ అకౌంట్ ఉంది. అందరూ తమ డబ్బును ఈ ఖాతాలోనే ఉంచుకుంటారు. లావాదేవీలు నిర్వహిస్తారు. కానీ ఇందులో ఉంచే డబ్బుపై సాధారణంగా పెద్దగా వడ్డీ రాదు. అయితే ఇలాంటి మామూలు సేవింగ్స్ అకౌంట్‌పైనా 7.25 శాతం వరకు వడ్డీని పొందవచ్చని మీకు తెలుసా? సేవింగ్స్ ఖాతాపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల లోపు ఉన్న బ్యాలెన్స్‌పై 2.70 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బును ఉంచినట్లయితే, రూ. 50 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే 3.5 శాతం వడ్డీ ఇస్తారు.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచే బ్యాలెన్స్ రూ. 50 లక్షల కంటే తక్కువగా ఉంటే 3 శాతం వడ్డీ అందిస్తుంది. అదే 50 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనంపంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉంటే దానిపై 2.70 శాతం వడ్డీ ఇస్తారు. బ్యాలెన్స్ రూ.10 లక్షల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే 2.75 శాతం, రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఉంటే 3 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ఐడీఎఫ్సీ బ్యాంక్ (IDFC FIRST Bank) సేవింగ్ అకౌంట్ డిపాజిట్లపై అన్ని బ్యాంక్‌ల కంటే అధికంగా వడ్డీ ఇస్తోంది. ఖాతాలో రూ. 5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 3 శాతం వడ్డీని అందిస్తోంది. అదే రూ. 5 లక్షల నుండి రూ. 100 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉంటే, మీరు దానిపై అత్యధికంగా 7.25 శాతం వడ్డీని ఇస్తోంది. రూ. 100-200 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్‌పై 4.50 శాతం వడ్డీ ఇస్తోంది.ఈ వడ్డీని ఎలా నిర్ణయిస్తారు?సాధారణంగా పొదుపు ఖాతా వడ్డీ రేటును త్రైమాసికానికి ఒకసారి లెక్కించి జమ చేస్తారు. ఈ వడ్డీ రేటును రోజువారీ బ్యాలెన్స్ అంటే రోజంతా చేసిన డిపాజిట్లలో ఉపసంహరణలు పోగా మిగిలిన మొత్తం ఆధారంగా నిర్ణయిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చినప్పుడు పొదుపు ఖాతాకు ఎలాంటి మెచ్యూరిటీ వ్యవధి ఉండదు. ఎందుకంటే ఈ రకమైన ఖాతాను సాధారణ పొదుపు, లావాదేవీల కోసం ఉపయోగిస్తారు. పెనాల్టీలు లేదా రుసుము లేకుండా ఈ ఖాతాలో ఎప్పుడైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. ఉపసంహరించుకోవచ్చు. -
అకౌంట్లో జీరో బ్యాలెన్స్.. ఖాతాదారుల గగ్గోలు
బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపం ఖాతాదారుల గుండె ఆగిపోయినంత పనిచేసింది. ఉన్నట్టుండి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ చూపించడంతో కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాదారులకు ఈ పరిస్థితి ఎదురైంది.బ్యాంక్ ఆఫ్ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్ కనిపించడం లేదంటూ గగ్గోలు పెట్టారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ కనిపించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.సాంకేతిక అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్‌లో దీనికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుండి సమస్య గురించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. "ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు" అని కొంతమందికి, బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ''కనెక్షన్ ఎర్రర్'' అని చాలా మందికి పాప్ అప్ మెసేజ్ చూపించింది.బ్యాంక్ ఆఫ్ అమెరికా అంతరాయంతో ప్రభావితమైన కస్టమర్లు తమకు తలెత్తిన ఇబ్బందులను ‘ఎక్స్’ (ట్విటర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. బ్యాంకు యాజమాన్యంపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కస్టమర్లు సమస్య ఎదురైనట్లు సీఎన్ఎన్ వార్త సంస్థకు ఇచ్చిన వివరణలో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. సమస్యను పరిష్కరిస్తున్నామని, ఖాతాదారులకు క్షమాపణలు చెబుతున్నామని బ్యాంక్ పేర్కొంది. -
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
మినిమమ్ బ్యాలన్స్ తప్పుడు వార్తల పై క్లారిటీ..!
-
బ్యాలెన్స్ నిల్
గోల్డ్ మెడల్‌కు రెండే సెకన్ల దూరం. ద్యుతీ చంద్ రీచ్ అవుతుందా? ఇరవై ఐదు లక్షలుంటే అవుతుంది. ఒలింపిక్స్శిక్షణకు ఆ డబ్బు. రెండేళ్ల క్రితమే కదా మూడు కోట్లు వచ్చింది! కోట్లు చూసుకొనుంటే బాగానే ఉండేది. లాక్డౌన్లో పస్తుల్ని చూసింది. కాలే కడుపుల్ని... తన బ్యాంక్ బ్యాలెన్స్‌తో నింపింది. రెండేళ్ల క్రితం ఇరవై రెండేళ్ల వయసులో ద్యుతీ చంద్ కోటీశ్వరురాలు. రెండేళ్ల తర్వాత ఇరవై నాలుగేళ్ల వయసులో ఇప్పుడు ఆమె నిరుపేద! నిరుపేద అంటే తిండికి లేకపోవడం కాదు. ఒలింపిక్స్‌కు శిక్షణ తీసుకోడానికి 25 లక్షల రూపాయలు లేకపోవడం. నాలుగేళ్ల క్రితం రియోలో ఆమె పరుగు మొదటి రౌండ్‌తోనే ఆగిపోయింది. అప్పట్నుంచీ పంతం ఆమెను దహించి వేస్తోంది. అయితే కరోనా లాక్డౌన్లో పూట గడవని వాళ్ల ఆకలితో పోలిస్తే, తన పతకం పెద్దపులేం కాదని ద్యుతీ అనుకున్నట్లుంది. వారి కోసం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్నీ ఖర్చుపెట్టేసింది. కరోనా రాకుండా ఉంటే, ఈ ఏడాది జరగవలసిన టోక్యో ఒలింపిక్స్ జరిగి ఉంటే ఆమె పంతం నెగ్గి, పతకం సాధించుకుని వచ్చేది కావచ్చు. టోక్యోలో ఈ ఏడాది వాయిదా పడిన ఒలింపిక్స్ వచ్చే ఏడాది జూలైలో జరుగుతున్నాయి. ద్యుతీ స్టార్ స్ప్రింటర్. వంద మీటర్లు, రెండొందల మీటర్ల పరుగు పందెంలో బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఆమె తన సొంత రాష్ట్రమైన ఒడిశాలోని భువనేశ్వర్‌లో కఠినమైన సాధనే చేస్తోంది. ఆమె కోచ్ రమేశ్ హైదరాబాద్ నుంచి ఆమె సాధనలోని పురోగతిని ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు ఇస్తున్నారు. వంద మీటర్ల పరుగులో ఇప్పటి వరకు ద్యుతీ రికార్డు 11.22 సెకన్లు, 200 మీ.లో 23.17 సెకన్లు. ఫేస్బుక్లో ద్యుతీ అమ్మకానికి పెట్టిన కారు. తర్వాత ఆ పోస్టును ద్యుతీ తొలగించింది వచ్చే టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె స్వర్ణ పతకం సాధించాలంటే.. 2016 రియోలో ఈ రెండు ఈవెంట్లలో గోల్డ్ మెడల్ గెలుచుకున్న జమైకా ఉమన్ స్ప్రింటర్ ఎలైన్ థాంప్సన్‌ను దాటిపోయేలా అయినా టైమ్‌ని గ్రిప్‌లోకి తీసుకోవాలి. ఎలైన్ 10.71, 21.78 సెకన్లలో రెండు బంగారు పతకాలు సాధించింది. ఎలైన్ గోల్డ్‌కి, ద్యుతీ గోల్డ్ లక్ష్యానికి మధ్య వ్యత్యాసం కేవలం 0.51, 1.39 సెకన్లు మాత్రమే. ఆ సమయాన్ని తగ్గించడానికే ఇప్పుడు ద్యుతీకి 25 లక్షల రూపాయలు కావాలి. జర్మనీలో శిక్షణ తీసుకోవాలని అనుకుంటోంది ద్యుతీ. పంజాబ్‌లోని పాటియాలాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగవలసిన ఫెడరేషన్ కప్ అథ్లెట్ మీట్ కరోనా వల్ల రద్దయిన తర్వాత ప్రాక్టీస్ కోసం ద్యుతీ భువనేశ్వర్‌లోనే ఉండిపోయింది. లాక్డౌన్లో ప్రభుత్వ నుంచి అనుమతి తీసుకుని రోజంతా కళింగ స్టేడియంలోనే గడుపుతోంది. అయితే ఈ దేశీయ సాధన అంతర్జాతీయ పోటీలకు సరిపోదు. అందుకే విదేశాలకు వెళ్లడం కోసం తన లగ్జరీ సెడాన్ బి.ఎం.డబ్లు్య. కారుని ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టింది. అందుకు తనేమీ సంశయించలేదు. స్పాన్సరర్లు ఎవరూ ముందుకు రావడంలేదు మరి. శిక్షణ కోసం తను ఏ దేశానికి వెళ్లవలసిందీ సూచించేది చివరికి ‘అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’నే అయినప్పటికీ ద్యుతీ మాత్రం జర్మనీని ఒక ఎంపికగా పెట్టుకుంది. అయితే ఫేస్బుక్లో కారును అమ్ముతున్నట్లు పోస్టు పెట్టగానే ‘ఆ అమ్మాయికి సహాయం చేయండి’ అని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కామెంట్లు మొదలవడంతో ద్యుతీ ఆ పోస్టును తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఒకటొకటిగా ఆటలు మొదలవుతున్నాయి. యూరప్‌లో ఫుట్‌బాల్, క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఇండియాలో కూడా సెప్టెంబరు నాటికి క్రీడా కార్యకలాపాలు ప్రారంభం కావచ్చనీ, అప్పటికి స్పాన్సరర్లు కూడా దొరికితే దొరకొచ్చనీ ద్యుతీ ఆశిస్తోంది. యవ్వనంలోనే కోట్ల డబ్బును చూసిన ఈ అమ్మాయి.. యవ్వనంలోనే మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం చూస్తోంది. ఏమైంది అంత డబ్బు?! 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో రెండు రజిత పతకాలు సాధించినందుకు ఒడిశా ప్రభుత్వం ద్యుతీకి 3 కోట్ల రూపాయల నజరానా ఇచ్చింది. పేద చేనేత కుటుంబంలోని అమ్మాయి ద్యుతీ. ఆ డబ్బుతో ఆమె సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంది. తల్లిదండ్రుల అప్పులు తీర్చింది. కారు కొనుక్కుంది. కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంది. జాగ్రత్త పడలేదని మనం అనొచ్చు. ఎదురుగా పస్తులు ఉంటున్న వారిని చూస్తున్న కళ్లకు.. బ్యాంకులోని బ్యాలెన్స్‌ని భద్రంగా చూసుకోడానికి మనసొప్పుతుందా? ఏషియన్స్ గేమ్స్‌లో ద్యుతీ సిల్వర్ మెడల్ సాధించినప్పటి చిత్రం -
చెక్కు కదా.. చెక్ చేసుకోవాలి: ట్రంప్
వాషింగ్టన్: : జీవితంలోని ఈ అందాలు, ఆనందాలు మనిషి చేసే పొరపాట్ల వల్లనేనేమో! లేదంటే జీవితం టై కట్టుకుని తప్పులు, పొరపాట్లు వెదకడానికి బిగదీసుకు కూర్చున్న పెద్ద ఆఫీసర్లా ఉండిపోయేది కావచ్చు. ట్రంప్‌గారి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకనానీ శుక్రవారం ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ‘ట్రంప్ గారు తమ నాలుగు నెలల జీతాన్ని (లక్ష డాలర్లు) కోవిడ్ పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ‘హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ శాఖకు ఇస్తున్నారు’ అని ప్రకటిస్తూ.. జీతం చెక్కును మీడియా ముందు ప్రదర్శించారు. చెక్కును మాత్రమే చూపెడితే మిస్టేక్ లేకపోయేది. చెక్కుతో పాటు చెక్కుకు కొనసాగింపుగా ఉన్న స్లిప్ మీది ట్రంప్ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు కూడా ఆమెకు సమీపంగా ఉన్న రిపోర్టర్ల కంటపడ్డాయి. పెద్ద పొరపాటే. కానీ ట్రంప్‌గారు ఆమెపై సీరియస్ ఏమీ అవలేదు. ‘చెక్కు కదా.. చెక్ చేసుకోవాలి’ అని బ్యాలెన్సింగ్‌గా నవ్వారు. -
లోన్ కావాలా నాయనా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణం విషయంలో సిబిల్ స్కోర్, బ్యాంక్ బ్యాలెన్స్, స్టేట్మెంట్ ప్రతి ఒక్కటీ కౌంట్ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా సామాన్యులకు, ఎస్ఎంఈలకు రుణాలు రావు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది గుర్గావ్కు చెందిన మైలోన్‌కేర్.ఇన్. దేశంలోని ప్రముఖ బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందం చేసుకొని గృహ, బంగారు, వ్యాపార వంటి అన్ని రకాల రుణాలను అందిస్తుంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ గౌరవ్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి.. ‘‘ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, మణప్పురం, టాటా క్యాపిటల్ వంటి 24 బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వడ్డీ రేట్లు లోన్‌ను బట్టి 8.65 శాతం నుంచి 13.50 శాతం వరకున్నాయి. గృహ, వ్యక్తిగత, బంగారు, ప్రాపర్టీ, వ్యాపారం వంటి అన్ని రకాల రుణాలతో పాటూ ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్స్ క్రెడిట్ కార్డులను కూడా అందిస్తాం. రూ.5 వేల నుంచి రూ.25 కోట్ల వరకు రుణాలుంటాయి. ప్రస్తుతం 25 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 శాతం మంది ఉంటారు. ఈ ఏడాది రూ. 2,500 కోట్ల రుణాల లక్ష్యం.. కస్టమర్లు మైలోన్‌కేర్‌లో లాగిన్ అయి కావాల్సిన రుణ విభాగాన్ని ఎంచుకొని వ్యక్తిగత వివరాలు, రుణ అవసరాలను తెలిపితే.. ఆల్గరిథం ద్వారా కస్టమర్లకు 2–3 రకాల బ్యాంక్ రుణ అప్షన్లను ఇస్తుంది. వడ్డీ రేటు, కాలపరిమితిని బట్టి కస్టమర్ తనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్ల రుణాలను అందించాం. ఈ ఏడాది రూ.2,500 కోట్ల రుణాలను అందించాలని లక్షి్యంచాం. ప్రస్తుతం నెలకు లక్ష ఎంక్వైరీలు వస్తున్నాయి. రుణాన్ని బట్టి 0.5 నుంచి 3 శాతం వరకు కమీషన్, మార్కెటింగ్ ఫీజు ఉంటుంది. ప్రతి ఏటా 40 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది 150 శాతాన్ని లక్షి్యంచాం. మా మొత్తం ఆదాయంలో 17 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నదే. ఎంఎఫ్, ట్యాక్స్ ప్లానింగ్‌లోకి.. ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తాం. సేల్స్, టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. ఎన్‌క్యుబేట్ క్యాపిటల్ వెంచర్, ఎస్ఏఆర్ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ‘‘త్వరలోనే డిజిటల్ క్రెడిట్ కార్డ్‌లు, యాప్ ఆధారిత పర్సనల్ లోన్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ ప్లానింగ్ విభాగాల్లోకి విస్తరిస్తామని’’ గౌరవ్ వివరించారు. -
బ్యాంక్ బ్యాలెన్స్‌లో బీఎస్పీ టాప్
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ ఖాతాల్లో ప్రస్తుతం రూ.669 కోట్లున్నాయి. బీఎస్పీ తర్వాతి స్థానాల్లో వరుసగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఉండగా ఐదో స్థానంలో అధికార బీజేపీ ఉండటం గమనార్హం. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికల ద్వారా ఈ విషయం వెల్లడయింది. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘానికి అందించిన నివేదిక ప్రకారం.. బహుజన్ సమాజ్ పార్టీకి దేశ రాజధానిలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పార్టీకి చెందిన 8 ఖాతాల్లో రూ.669 కోట్ల నిధులున్నాయి. దీంతోపాటు రూ.95.54 లక్షలు నగదు రూపంలో కూడా ఉన్నట్లు తెలిపింది. ఇదంతా విరాళాల ద్వారానే సేకరించినట్లు బీఎస్పీ పేర్కొందని అధికారులు వివరించారు. రూ.471 కోట్ల నిల్వలతో సమాజ్‌వాదీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీల ఎన్నికల తర్వాత ఈ మొత్తం రూ.460 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో తమకు రూ.24 కోట్ల మేర విరాళాలు అందడంతో నిల్వలు రూ.669 కోట్లకు చేరినట్లు బీఎస్పీ వెల్లడించింది. బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో రూ.196 కోట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ లెక్కలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గత ఏడాది నవంబర్‌లో ఈసీకి సమర్పించిన వివరాల్లో పేర్కొన్నవి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను కాంగ్రెస్ ఈసీకి అందజేయలేదు. అధికార బీజేపీ విషయానికొస్తే.. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టినట్లు వెల్లడించిన ఈ పార్టీ రూ.82 కోట్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు వెల్లడించింది. 2017–18 సంవత్సరాల్లో ఎలక్టోరల్ బాండ్లు, విరాళాల ద్వారా అందిన రూ.1,027 కోట్లలో రూ.758 కోట్లను ఎన్నికల్లో వెచ్చించినట్లు ఈసీకి బీజేపీ తెలిపింది. ఈ విషయంలో రూ.107 కోట్లున్న తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీ వెనుకబడి ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆయా పార్టీల నిధుల్లో 87 శాతం వరకు స్వచ్ఛంద విరాళాల ద్వారా అందినవేనని పేర్కొనగా బీజేపీ మాత్రమే 2017–18 కాలంలో రూ.210 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించినట్లు తెలిపింది. కాగా, ఆయా పార్టీలు ఆదాయ పన్ను రిటర్నుల్లో చూపిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. 2016–17, 2017–18 సంవత్సరాల్లో బీజేపీ అత్యధికంగా రూ.1,034 కోట్లు, రూ.1,027 కోట్లు విరాళాల రూపంలో అందుకున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఆ పార్టీ ఆదాయం రూ.174 కోట్ల నుంచి రూ.52 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా, 2016–17లో కాంగ్రెస్ ఆదాయం రూ.225 కోట్లుగా ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఈసీకి ఆదాయ వివరాలను అందజేయలేదు. సీపీఎం ఆదాయం గత కొద్ది సంవత్సరాలుగా రూ.100 కోట్లుగా ఉంది. -
కాక్టస్
‘‘గుడ్ మార్నింగ్ సర్.... ’’ నవ్వుతూ మేనేజర్‌ను విష్ చేసింది గ్రేస్.. ఆ ఆఫీస్‌లో మొదటి రోజును ఆహ్లాదంగా ఆహ్వానిద్దామని. ‘‘వెరీ గుడ్ మార్నిం.....’’ అసంకల్పితంగానే ఆన్సర్ చేస్తూ తలెత్తిన మేనేజర్ వాక్యం పూర్తి కాకుండానే ఆగిపోయాడు గ్రేస్ చేతిలో ఉన్న మొక్కను చూస్తూ! మొహం మీది చిరునవ్వూ మాయమైంది. సడెన్‌గా బాస్ ఎక్స్ప్రెషన్ మారిపోయే సరికి అయోమయంలో పడింది గ్రేస్. ‘‘ఈజ్ దేర్ ఎనిథింగ్ రాంగ్ విత్ మీ సర్?’’ చాలా వినయంగా అడిగింది. ‘‘వాట్స్ దట్?’’ ఆమె చేతిలో ఉన్న మొక్కవైపు చూస్తూ అన్నాడు చిరాగ్గా. ‘‘ప్లాంట్.. కాక్టస్ ప్లాంట్ సర్’’ అంటూ రెండు చేతులతో పట్టుకున్న చిన్న తొట్టిని ఆయన ముందుకు చాపింది. ‘‘హేయ్.. వాట్ ఆర్ యూ డూయింగ్?’’ అరిచేశాడు. బెదిరిపోయింది గ్రేస్. ‘‘నాకు కాక్టస్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డే కదా.. మీకు ఈ మొక్క ఇచ్చి గ్రీట్ చేద్దా..మ..ని..’’ ’’ బెరుగ్గా అన్నది. ‘‘జస్ట్ షటప్. నాకిలాంటివి నచ్చవ్. కాక్టస్ అంటే అస్సలు నచ్చదు. ఐ హేట్ దట్.. నౌ యు కెన్ గెట్బ్యాక్ టు యువర్ ప్లేస్’’ కోపంగా మేనేజర్. బిక్క మొహం వేసుకొని క్యాబిన్లోంచి బయటకు వచ్చింది గ్రేస్. మేనేజర్ మొహంనిండా చెమటలు. టేబుల్ మీద.. తన సిస్టమ్ పక్కనే ఆ చిన్ని తొట్టిని పెట్టుకొని ప్రేమగా.. ముద్దుగా మొక్కను చూసుకుంది గ్రేస్. ఆమె పెదవుల మీద చిరునవ్వు. ‘‘హాయ్..’’ అంటూ పక్కన కొలీగ్ పలకరింపు వినిపించేసరికి తల తిప్పింది గ్రేస్.‘‘దిస్ ఈజ్ శీతల్.. ’’ గ్రేస్‌ను పరిచయం చేసుకుంది కొలీగ్. ‘‘ఓ.. హాయ్.. ఐయామ్ గ్రేస్’’ షేక్ హ్యాండ్ ఇచ్చింది గ్రేస్. ‘‘ఇదీ.. ’’అంటూ గ్రేస్ టేబుల్ మీదున్న మొక్కను చూపిస్తూ ఆగింది శీతల్. ‘‘కాక్టస్..’’ఉత్సాహంగా చెప్పింది గ్రేస్. ‘‘అదే.. ఆఫీస్‌కు తెచ్చుకునేంత ఇష్టమా?’’ ఐబ్రోస్ ముడి వేసింది శీతల్.‘‘ప్రాణం’’ వాటి ముళ్లు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఆ తొట్టిని హత్తుకుంటూ తన్మయత్వంగా చెప్పింది గ్రేస్. ‘‘ఇంతకుముందు ఈ క్యుబికల్ ఆరుషి అనే అమ్మాయి వాడేది. ఆమెకూ అంతే! కాక్టస్ అంటే పిచ్చి. రెండు,మూడు తెచ్చిపెట్టుకుంది. ఒకటి టేబుల్ మీద, రెండు ఫుట్‌రెస్ట్ పక్కన. వండర్ అనిపించేది..’’ శీతల్. ‘‘తనెక్కడ ఇప్పుడు?’’ అడిగింది ఆత్రంగా గ్రేస్. ‘‘అక్కడ’’పైకి చూపిస్తూ చెప్పింది శీతల్. ‘‘ఓ.. పై ఫ్లోర్లోనా?’’ గ్రేస్.‘‘నో.. చనిపోయింది’’ శీతల్. ‘‘అయ్యో.. సో సారీ .. ఎలా?’’ అడిగింది నొచ్చుకుంటూ గ్రేస్. ‘‘తెలీదు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది శీతల్. అంత హఠాత్తుగా ఆమె మూడ్ ఎందుకు మారిందో అర్థం కాలేదు గ్రేస్‌కు. ‘‘ఎనీవే.. ’’ అని నిట్టూరుస్తూ పనిలో పడిపోయింది. ఇంతలోకే మేనేజర్ గది లోంచి కాల్ వచ్చింది గ్రేస్‌కి. గబగబా వెళ్లింది. కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు. ఒద్దిగ్గా కూర్చుంది. ఆమె చేయాల్సిన పనుల గురించి చెప్తున్నాడు. తల వంచుకొనినోట్ చేసుకుంటోంది. ఆమెనే తధేకంగా చూస్తున్నాడు. చివాల్న తలెత్తింది. షాక్ అయ్యాడు మేనేజర్. ‘‘కాక్టస్ ఈజ్ మై ఫేవరేట్’’ అంది నవ్వుతూ. మళ్లీ ముచ్చెమటలు మేనేజర్‌కి. బజర్ నొక్కబోయాడు బయట ఉన్న బాయ్‌ని పిలవడానికి. అది మోగలేదు. ఆమె నవ్వుతూనే ఉంది. లేచి డోర్ తెరవ బోయాడు. తెరుచుకోలేదు.. ఆమె నవ్వుతూనే ఉంది. అరుస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.తడారి పోతోంది. ఆమె నవ్వుతూనే ఉంది. మెడలో ఉన్న టై బిగిసుకుపోయి ఊపిరి రావట్లేదు. తలుపు బాదుతున్నాడు.. శబ్దం రావట్లేదు. ఆమె నవ్వుతూనే ఉంది.. కాక్టస్ ఈజ్ మై ఫేవరేట్ సర్.. అంటోంది. ఇంతలోకే బాయ్ డోర్ తెరిచేసరికి ఆ విసురికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు మేనేజర్. కళ్లు తేలేసిన బాస్‌ను చూసి.. ‘‘సర్... సర్.. ఏ మైంది సర్..’’ అంటూ మంచినీళ్ల గ్లాస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బాయ్. ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ.. ‘‘ఆరుషి.. ఆరుషి’’ అంటూ ఏదో చెప్పబోతున్నాడు. ‘‘ఏంటి సర్’’అంటూ ఎదురుగా చూశాడు బాయ్. ఎవరూ లేరక్కడ. ‘‘సర్ .. ఎవరూ’’ అంటూ మళ్లీ రెట్టించాడు బాయ్.మేనేజర్‌కీ ఆ కుర్చీ ఖాళీగానే కనిపించింది. బాయ్‌ని తోసేసి బయటకు వచ్చి గ్రేస్ క్యుబికల్ వైపు చూశాడు. సీరియస్‌గా తన సిస్టమ్‌లో తలపెట్టి కనిపించింది. అతని కాళ్లు వణుకుతున్నాయి. అలాగే వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు. ఇంటర్‌కమ్ మోగుతోంది.. వణుకుతున్న చేయితోనే లిఫ్ట్ చేశాడు. ‘‘హలో.. సర్’’ అవతలి నుంచి ‘‘యె..’’ జీరబోయేసరికి గొంతు సవరించుకుని ‘‘యెస్’’ అన్నాడు మేనేజర్. పీలగానే ఉంది స్వరం. ‘‘సర్.. ఈరోజు మీ సెక్షన్లో జాయిన్ కావాల్సిన గ్రేస్ రాత్రి జరిగిన ఆ బస్ యాక్సిడెంట్లో చనిపోయిందట సర్’’ చెప్పింది హెచ్ఆర్ ఎంప్లాయ్. షాక్ అయ్యాడు మేనేజర్. ఫోన్ రిసీవర్‌ను అలాగే వదిలేసి బయటకు వచ్చాడు. గ్రేస్ క్యుబికల్ వైపు చూశాడు. గ్రేస్ లేదు. కాక్టస్ ఉంది. చిత్రంగా గాలికి కదులుతూ! అతని మనసులో ఆరుషిలా.. ఆరుషీని ఎంతలా ప్రేమించాడు! కానీ ఆమె లెక్కచేయలేదు. ఫ్లాట్.. గోల్డ్..బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాడు బదులుగా! ఛీ.. థూ అని ఊసింది. తుడిచేసుకున్నాడు సిగ్గులేకుండా. ఆ రోజు.. ఆరుషి బర్త్ డే.కేక్‌తోపాటు డైమండ్ బ్రేస్లెట్ ముందు పెట్టాడు. రెండిటినీ తోసేసింది. కారణం అడిగాడు. ‘‘నీకు ఆల్రెడీ పెళ్లవడం’’ అంది. ‘‘ డైవోర్స్ ఇచ్చేస్తాను’’అన్నాడు. ‘‘అయినా నో’’ అంది మొండిగా. ‘‘ఎందుకు’’ అడిగాడు అంతే మొండిగా. ‘‘నాకు ఇష్టంలేదు. నో అంటే నో అంతే’’ అంది. అవమానం అతనిలో. తుడుచుకోవడానికి ఆత్మాభిమానమూ అడ్డొచ్చింది. అహం రెచ్చగొట్టింది. ఆమెను పట్టుకోబోయాడు.తప్పించుకుంది. పట్టుబట్టాడు. టెర్రస్ మీదకు పరిగెత్తింది. తనూ వెళ్లాడు. కార్నర్ చేశాడు. ఆమె భుజాలు పట్టుకొని మొహంలో మొహం పెట్టాడు. తప్పించుకోవడానికి జరిగిన గింజులాటలో అతని పట్టు సడలి రక్షణగా ఉన్న అల్యూమినియం రెయిలింగ్ మీదకు ఒరిగింది. అప్పటికే అతుకులుఊడిన ఆ రెయిలింగ్ ఆమె బరువుకి విరిగింది..ఆ నాలుగో అంతస్తు మీద నుంచి ఆమె జారింది. తల పగిలింది. రక్తపు మడుగులో అచేతనంగా ఆరుషి. - ∙సరస్వతి రమ -
ఎలుకల మందు ఇచ్చి కన్నతల్లిని కడతేర్చాడు
-
కన్నతల్లిని కడతేర్చాడు
ప్రకాశం, నాగులుప్పలపాడు: జీవితంలో క్రమశిక్షణ లోపించి చెడు వ్యసనాలకు అలవాటైన కొడుకు జన్మనిచ్చిన తల్లినే హతమార్చాడు. ఈ హృదయవిదారక ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. హత్య విషయం గ్రామంలో చర్చనీయాంశం అయినప్పటికీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాగా విషయం గ్రహించిన ఎస్సై అజయ్‌బాబు కేసును సుమోటోగా స్వీకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తల్లి పోషణపై ఆధారపడిన నిందితుడు గత ఏడాది డిసెంబర్ 31న జరిగిన ఘటన తర్వాత ఆ మరుసటి రోజే మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే అది హత్యగా అనుమానాలు రావడంతో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ మురళీ కృష్ణ, ఎస్సై అజయ్‌బాబు సమాచారం మేరకు.. ఉప్పుగుండూరు గ్రామంలో దొడ్ల సుబ్బరత్నం అనే మహిళ బస్టాండ్ సెంటర్లో జామకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త చాలా ఏళ్ల క్రితం మరణించడంతో ఒక్కగానొక్క కొడుకు రంజిత్‌కుమార్‌ను పోషిస్తోంది. 10 సంవత్సరాల క్రితం తన అక్క మనుమరాలు ప్రసన్నను కొడుకుకు ఇచ్చి వివాహం చేసింది. ఇద్దరు బిడ్డలు కలిగిన తరువాత భర్త ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ప్రసన్న తన పుట్టిల్లు తెనాలికి చేరింది. అప్పటి నుంచి రంజిత్ బాధ్యత లేకుండా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బులు కోసం తల్లిని వేధిస్తుండేవాడు. కాగా తన ఇంటి పక్కనే ఉన్న మణి అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ విషయంలో మృతురాలు సుబ్బరత్నం కొడుకును పలుమార్లు హెచ్చరించడంతో పాటు మణిని కూడా హెచ్చరించింది. దీంతో మృతురాలిపై కక్ష పెంచుకున్న కొడుకు ప్రియురాలు మణి మీ అమ్మ తనను తీవ్రంగా దూషిస్తుందని తెలపడంతో సుబ్బరత్నంను చంపాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 31 రాత్రి వంకాయ కూరలో ఎలుకల మందు కలిపి సుబ్బరత్నంకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత చర్చి దగ్గర జరుగుతున్న డ్రామా చూసి తిరిగి వచ్చేసరికి తల్లి మృత్యువుతో పోరాడుతోంది. దీంతో రాత్రి 3 గంటల సమయంలో నిందితురాలు మణి కాళ్లు పట్టుకోవడంతో రంజిత్ కుమార్ తన తల్లి గొంతు నులిమి హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించారు. అయితే ఈ పెనుగులాటలో కాళ్లకు, మోచేతులకు గాయాలయ్యాయి. బంధువులు ఈ గాయాలు ఏంటని అడగడంతో షుగరు ఎక్కువై మంచం మీద నుంచి కింద పడిందని.. నిద్రలోనే ప్రాణాలు పోయినట్టు నమ్మబలికాడు. ప్రవర్తనలో తేడా పట్టించింది.. అయితే 2వ తేదీ నుంచి మృతురాలి కుమారుడు రంజిత్ ప్రవర్తనలో తేడా కనిపించడంతో పాటు అక్కడక్కడ తల్లిని తానే చంపానని చెప్పుకున్నాడు. సమాచారం సేకరించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఆదివారం తహసీల్దార్ సుజాత, సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రిమ్స్ డాక్టర్ రాజ్ కుమార్ శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మీ ఇంట్లో పెళ్లికి ఐటీ వాళ్లొచ్చేస్తారు!
పెళ్లి ఖర్చుకి.. బ్యాంక్ బ్యాలెన్స్‌కు ముడి ⇒ లెక్క తప్పిందా.. పన్ను కట్టాల్సిందే ⇒ అప్పు తెచ్చుకున్న సొమ్ముకూ పత్రాలుండాల్సిందే ⇒ నెలవారీ ఖర్చులపైన కూడా నిఘా ⇒ ప్రతి పైసాకూ లెక్కచెప్పాల్సిందే నవంబర్ 8, 2016న రూ.1,000, రూ.500 నోట్ల రద్దుతో షాకిచ్చిన కేంద్రం.. తాజాగా ఆదాయపు పన్ను చట్ట సవరణతో మరొక ఝలక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను పరిశీలన పేరిట సామాన్యులను వేధించబోమని పదే పదే వల్లెవేస్తున్నా.. తాజా చట్ట సవరణతో మాత్రం వేధింపులు తప్పేలా లేవు. వ్యక్తులు తమ ఆదాయానికి, వ్యయానికి సరైన వివరణ ఇవ్వలేకపోతే ఐటీ చట్టం ప్రకారం 35 శాతం నుంచి 83 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. తాజా చట్ట సవరణతో పన్ను చెల్లింపుదారులకు ఎదురయ్యే 5 ప్రధాన ఇబ్బందులివే.. అప్పు తెచ్చుకున్నా తిప్పలే స్నేహితుడి నుంచో లేక తెలిసిన వాళ్ల నుంచో అప్పు తెచ్చుకున్నా సరే ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారించే అధికారం ఉంది. ఒకవేళ మీరు సంబంధిత సొమ్మును అప్పుగా తీసుకొచ్చినట్లు నిరూపించలేని పక్షంలో సంబంధిత సొమ్ము పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఒక్కసారిగా మీకు బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయినా సరే వివరణ ఇవ్వాల్సిందే. అది కూడా నిరూపించలేకపోతే పన్ను తిప్పలు తప్పవు. వారసత్వ బంగారం వారసత్వంగా వచ్చిన బంగారం, నగలు లేదా వ్యవసాయ ఆదాయం ద్వారా వాటిని కొనుగోలు చేసినా సరే ఆదాయ పన్ను చట్టాలు వర్తించవు. అయితే సంబంధిత వ్యక్తి వాటిని నిరూపించలేకపోతే మాత్రం ఐటీ చట్టం పరిధిలోకి వచ్చేస్తాడు. అంటే నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. సీడ్మనీకి పత్రాలుండాలి చిన్నతరహా పరిశ్రమలు, స్టార్టప్స్ కంపెనీని ప్రారంభించే సమయంలో పెట్టే సీడ్మనీకి సంబంధించిన పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. ఐటీ అధికారులకు రికార్డులను సమర్పించడంలో విఫలమైతే మూలధన మొత్తం మీద అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి ఖర్చుకూ లెక్క అప్పు తెచ్చి మరీ పిల్లల పెళ్లిళ్లు చేయడం దేశంలో సర్వసాధారణం. అయితే తాజా ఐటీ నిబంధనలతో మాత్రం పెళ్లి ఖర్చులను కూడా ఐటీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌కు, పెళ్లి ఖర్చుకూ మధ్య వ్యత్యాసముంటే మాత్రం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు పెరిగితే నెలవారీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగినా సరే ఐటీ ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే ఐటీ విభాగం మీ బ్యాంక్ ఖాతాలపై దృష్టి పెడుతుంది. పెరిగిన నెలవారీ ఖర్చులను ఎలా భరించారో? అంత సడెన్‌గా ఖర్చులకు డబ్బులెక్కడి నుంచి వచ్చాయో వివరణ అడగొచ్చు. సంతృప్తికరమైన వివరణ ఇవ్వటంలో విఫలమైతే మీకు భారీ జరిమానా తప్పదు. -
ఇక హాయిగా విడాకులు తీసుకోవచ్చు..!
ఇప్పటివరకు మనం ఎన్నో యాప్స్ గురించి విన్నాం, యూజ్ చేశాం. అయితే యూకేకు చెందిన కొందరు సాఫ్ట్ వేర్ డెవలపర్స్ ఓ కొత్త యాప్ ను రూపొందించనున్నారు. బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత తలెత్తనున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్రేకప్ యాప్ తయారు చేస్తున్నారు. గతంలో భార్యాభర్తలు బ్రేకప్ చెప్పేసి విడాకులు తీసుకునేవారు. అయితే ఈ తతంగం జరగడానికి కొన్ని నెలల సమయంతో పాటు లాయర్లను కలవడం ఇలా ఎన్నో ఉంటాయి. ఇక నుంచి సామరస్యపూర్వకంగా, హాయిగా పార్ట్ నర్ గా గుబ్ బై చెప్పవచ్చు. భార్యాభర్తల విడాకుల వ్యవహారం ఖర్చు కూడా వేల పౌండ్స్(భారత కరెన్సీలో లక్షల రూపాయలు) అవుతుంది. వీటిని అధిగమిస్తూ న్యూ యాప్ రూపొందితే కేవలం పదుల పౌండ్ల ఖర్చు మాత్రమే పడుతుంది. లీగల్ సమాచారం, భార్యాభర్తల పరస్పర ఒప్పంద అంగీకారం, లాయర్లకు సంబంధించిన ఇతర ముఖ్యమైన వివరాలు ఈ యాప్ లో అందుబాటులో ఉంచుతారు. కోర్టుల చుట్టూ తిరగటం, ఎందుకు బ్రేకప్ చెప్పారు, ఏమైందంటూ సవాలక్ష ప్రశ్నల నుంచి తప్పించుకునే కొత్త యాప్ దోహద పడుతుందని అక్కడి సెలబ్రిటీలు భావిస్తున్నారు. 2013 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఇంగ్లండ్, వేల్స్ లలో కలిపి 1.15 లక్షల విడాకులు జరిగాయని ఇందులో 42 శాతం మంది ఏడాది ముగిసేలోపే బ్రేకప్ చెప్పారని గణాంకాలు చెబుతున్నాయి. కోర్టు, లాయర్ అంటూ ఈ వ్యవహారం లీగల్ గా ముగియడానికి దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చుపెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రేకప్ యాప్ ట్రయల్స్ జరుగుతున్నాయని, సెప్టెంబర్ లో వాడుకలోకి రానున్నట్లు ఫ్యామిలీ కౌన్సెలర్, ఐటీ కన్సల్టెంట్ అయిన పిప్ విల్సన్ వివరించారు. -
మిస్టర్ పర్ఫెక్ట్
మీరు నల్లగా ఉండొచ్చు. ఇతరులకు నచ్చకపోవచ్చు. మీకు పిల్లలు లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు! ఎన్ని సమస్యలైనా ఉండనీ... ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ అంటున్నాడు తరుణ్ గిద్వానీ! అందుకోసం ఆయన వీకెండ్స్‌లో... మార్కెట్లోనో, బస్టాండ్‌లోనో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఐదు నుంచి ఆరు గంటలు ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ బోర్డ్ పట్టుకుని నిలబడతాడు. 25 ఏళ్ల ఈ హైదరాబాదీ చేస్తున్న ఈ నిస్వార్థ కృత్యం... అనేకమందిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తరుణ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. అరోరా కాలేజీలో బీఎస్సీ చదివి, రెండేళ్ల కిందట లెండ్హండ్ ఎన్జీవోలో ఉద్యోగం కోసం పుణేకి వెళ్లాడు. అక్కడ సహచరులతోపాటు చాలా మంది సమస్యలను దగ్గరగా చూశాడు. తానూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎంతోమంది చిన్న సమస్యలకే కుంగిపోతున్నారని తెలుసుకున్నాడు. వారి మనసును మార్చేందుకు ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ ప్లకార్డుకు అంకురార్పణ చేశాడు. పుణేలోని కొరేగావ్ పార్క్‌లో ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ ప్లకార్డు పట్టుకొని నిలుచున్నప్పుడు చూసిన కొందరు... గర్ల్స్ను అట్రాక్ట్ చేసేందుకు ఇలా చేస్తున్నాడని అపోహపడ్డారు. కొందరు తను చేస్తున్న పనిని పొగిడారు. తనవల్ల కొంతమంది ముఖాల్లోనైనా చిరునవ్వు కనిపిస్తే చాలనుకున్నాడు. రెండు నెలల కిందట హైదరాబాద్‌కు బయలుదేరినప్పుడు.. తనకు వీడ్కోలు పలకడానికి వచ్చిన జనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు తరుణ్. అయితే సిటీకి వచ్చాక ఖాళీగా ఉండలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, సికింద్రాబాద్ స్టేషన్, దిల్సుఖ్నగర్ బస్టాప్... ఇలా వివిధ ప్రాంతాల్లో ‘యూ ఆర్ పర్ఫెక్ట్’ బోర్డుతో అందరినీ ఆలోచింపజేశాడు. ఆ బోర్డును చూసిన ఒకావిడ ‘ఓ మై గాడ్... ఇంతకుముందు నాకెవ్వరూ ఇలా చెప్పలేదు’ అని సంతోషిస్తుంటే ఆనందం కలిగిందంటాడు తరుణ్. జీవితం మీద నిరాసక్తతతో ఉన్న కొందరిలో ఆశలు చిగురింపజేసినా... తను చేస్తున్న పనికి ఫలితం దక్కినట్టేనని చెబుతున్నాడు. పుణేలో ఉద్యోగానికి మళ్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణ్ గిద్వాని... ఈ మంచి పనిని కొనసాగిస్తాడని ఆశిద్దాం. ..:: వాంకె శ్రీనివాస్ -
పెట్టుబడికి నయా రూట్..
బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉండేలా చూసుకో.. స్టాక్ మార్కెట్లు.. షేర్లూ అంటూ రిస్కులు తీసుకోకు.. పదో పరకో ఉంటే బంగారాన్ని కొని దాచిపెట్టుకో .. అప్పుడూ, ఇప్పుడూ పెట్టుబడికి సంబంధించి కామన్‌గా వినిపించే సలహాలివి. అయితే, అన్నింటి ధరలు భగ్గుమంటూ భయపెడుతున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఈ సాధనాలు మాత్రమే పట్టుకుని కూర్చుంటే పనయ్యే పరిస్థితి లేదు. మారుతున్న కాలాన్ని బట్టి పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటూ ఉండటం తప్పనిసరి. రేట్ల పెరుగుదలకు మించి రాబడులు అందించే సాధనాలతో రిస్కు చేయడానికి, కొంగొత్త వ్యూహాలతో దూకుడుగా దూసుకెళ్లేందుకు సై అంటోంది ప్రస్తుత తరం. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉంటున్న సాధనాలపై, గతకాలం..ప్రస్తుతం మారుతున్న ఇన్వెస్ట్మెంట్ విధానాలపై ఈ కథనం. మొత్తం కుటుంబంతో కలసి సరదాగా ఏ మాల్‌లోనో సినిమాకి వెళ్లాలంటే.. వెయ్యి నోటు సరిపోవడం లేదు. చదువుల ఫీజులు, వైద్యం ఖర్చులూ ఏటా పది, ఇరవై శాతం మేర పెరిగిపోతున్నాయి. ఎంత పొదుపు చేసినా, ఎంత ఆదా చేసినా ఈ ఖర్చులను ఎదుర్కొనేందుకు సరిపోవడం లేదు. అందుకే రిస్కు ఎక్కువున్నప్పటికీ మరింత ఎక్కువ రాబడినిచ్చే వాటిపై ఆసక్తి పెరుగుతోంది. మారుతున్న కాలాన్ని బట్టి ఆర్థికపరమైన నిర్ణయాలూ మార్చుకుంటూ ఉండాలి. బంగారం.. ఈటీఎఫ్‌లు.. కొన్నాళ్ల క్రితం దాకా బంగారంలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఆభరణాలు, కడ్డీల రూపంలో మాత్రమే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మొదలైనవి వచ్చేశాయి. ఆభరణాల తరహాలో వీటికి మేకింగ్ చార్జీలు, తరుగుదల వంటి గొడవలు ఉండవు. ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు జరుగుతుంది కాబట్టి బంగారాన్ని భద్రపరచుకోవడం గురించి చింత ఉండదు. మంచి రేటు వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ధర తగ్గితే మళ్లీ కొనుక్కోవచ్చు. పండుగల వేళ కాస్తయినా బంగారం కొనుక్కోవడం మంచిదని పెద్దాళ్లు చెబుతుంటారు. అలా కొనుక్కోవాలనుకుంటే.. అచ్చం బంగారంగానే కాకుండా.. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో కూడా ప్రస్తుతం కొనుక్కునే అవకాశం ఉంది. అయితే, ఒక్క విషయం.. వెండి, బంగారం, ప్లాటినం ఇలాంటివి ఆభరణాల రూపంలో తీసుకున్న పక్షంలో అలంకారానికి ఓకే గానీ.. ప్రధాన ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా వీటిని మాత్రమే పెట్టుకుంటే చిక్కే. ఎందుకంటే డబ్బు ఎంత అవసరమైనా కూడా బంగారు ఆభరణాలను అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా చాలా మందికి రుచించదు. కాబట్టి ఎక్కువగా ఆయా ఆభరణాలు అలంకారప్రాయంగానే ఉంటాయి. అలాగని, పెట్టుబడుల విషయంలో పుత్తడిని పూర్తిగా విస్మరించనూ లేము. కనుక, పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా ఐదు నుంచి పది శాతానికి మించకుండా చూసుకుంటే చాలు. బీమా ప్రాధాన్యం.. గతంలో బీమాను పెట్టుబడి సాధనంగా కూడా భావించి.. ఏళ్ల తరబడి రకరకాల సంప్రదాయ పాలసీలు కట్టుకుంటూ వెళ్లేవారు. ఎప్పుడో ఇరవై ముఫ్ఫై ఏళ్ల తర్వాత పిల్లలకు ఉపయోగపడుతుందంటూ వివిధ పాలసీలకు బోలెడు ప్రీమియంలు పోసేవారు. తీరా చూస్తే సదరు పిల్లలు పెద్దయ్యాక.. లక్షో, లక్షన్నరో చేతికొచ్చేవి. అన్నేళ్ల పాటు కట్టిన ప్రీమియంలపై కేవలం అయిదారు శాతం వార్షిక రాబడి వస్తే ఉపయోగం ఏముంది. అలాగే, పన్నుపరంగా ప్రయోజనాలు పొందే ఉద్దేశంతో తీసుకున్న పాలసీలు కొన్ని ఉంటాయి. వీటిని తక్షణావసరం కోసం తీసుకున్నా చివరిదాకా మోయక తప్పని పరిస్థితీ ఉండేది. ఇప్పుడు కూడా ఇలాంటి ఉదంతాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం బీమాపై దృక్పథం మారుతోంది. దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కాకుండా రిస్కు నుంచి రక్షణనిచ్చేదిగా పరిగణించడం మొదలైంది. పాలసీదారుకి అనుకోనిది ఏమైనా జరిగినా కుటుంబం ఆర్థికపరమైన కష్టాలు లేకుండా చూడటమే జీవిత బీమా ప్రధానోద్దేశం. దీనిపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో.. ఇందుకు అనుగుణంగా టర్మ్ పాలసీలకు ఆదరణ పెరుగుతోంది. కనుక, రకరకాల పాలసీలు కాకుండా లైఫ్‌స్టయిల్‌ని బట్టి రూ. 50 లక్షలు, రూ. 1 కోటి దాకా టర్మ్ ప్లాన్లను తీసుకోవడం ద్వారా తక్కువ వ్యయాలతో కుటుంబానికి పెద్ద స్థాయిలో ఆర్థిక భద్రతనిచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆన్లైన్లో తక్కువ ప్రీమియాలకే టర్మ్ పాలసీలు దొరుకుతున్నాయి. వార్షికంగా సుమారు 8-15 వేలు ప్రీమియం కడితే (30-35 ఏళ్ల వ్యక్తి) దాదాపు ముఫ్ఫై ఏళ్ల పాటు రూ. 1 కోటి కవరేజీ ఇచ్చే టర్మ్ పాలసీలూ ఉన్నాయి. ఈ స్థాయిలో కవరేజీ కోసం ఇతర పాలసీల్లోనైతే సుమారు రెట్టింపు స్థాయిలో ప్రీమియాలు ఉంటున్నాయి. కనుక టర్మ్ ప్లాన్లను తీసుకోవడం ద్వారా బోలెడు మిగులుతుంది. నెలకు రూ. 1,500 చొప్పున ఏదైనా మంచి ఈక్విటీ ఫండ్‌లో గానీ సుమారు ముప్ఫై ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే.. కనీసం 15 శాతం రాబడి అంచనా వేసుకున్నా దాదాపు రూ. 1 కోటి పైగా నిధి తయారవుతుంది. షేర్లు.. ఫండ్లు.. స్థిరాస్తి.. ద్రవ్యోల్బణం ధాటికి రూపాయి కరిగిపోతోంది. మొన్న రూపాయికి వచ్చిన వస్తువు..ఇప్పుడు పదిరూపాయలు పెడితే గానీ రావడం లేదు. రేపో ఎల్లుండో ఆ ధర ఇరవైకి పెరిగిపోతుంది. మరోవైపు సంప్రదాయ సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్లపై వచ్చే రాబడులు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. దీంతో మళ్లీ జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. కనుక, ధరల పెరుగుదలకు మించిన రాబడి వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తేనే రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు ఎంతో కొంత కూడబెట్టుకోగలిగేది. ఇందుకోసం అప్పటి తరహాలో కేవలం సురక్షితమైన ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి వాటిపై ఆధారపడితే సరిపోదు. రిస్కులు ఉన్నా దీర్ఘకాలంలో అధిక రాబడులు ఇచ్చే సత్తా ఉన్న ఏకైక సాధనం షేర్లే అన్నది ఫైనాన్షియల్ ప్లానర్ల మాట. ప్రస్తుతం నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేసే అవకాశం లేని వారి కోసం మ్యూచువల్ ఫండ్స్ సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. నెలకు రూ. 1,500 కాకుండా మరింత దూకుడుగా రూ. 10,000-20,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే.. 15 శాతం రాబడితో ఏకంగా రూ. 10 కోట్ల పైచిలుకు పోగుపడే అవకాశముంది. ఇది చక్ర వడ్డీ మహిమ. అయితే, ఇది జరగాలంటే సాధ్యమైనంత ముందు నుంచే ఈక్విటీలు, మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. క్రమక్రమంగా కేటాయింపులు పెంచుకుంటూ పోవాలి. ఇక ప్రాపర్టీల కొనుగోలు విషయానికొస్తే.. గతంలో దాదాపు ముఫ్పై అయిదు- నలభై ఏళ్ల వయసులో సొంత ఇంటి కొనుగోలు ఆలోచన చేస్తుండే వారు. ఇప్పటి తరం ఇరవైల నుంచే ప్లాన్ చేస్తోంది. మెట్రో నగరాల్లో భారీ రేట్లు పెట్టలేని పరిస్థితుల్లో చిన్న పట్టణాల్లోనూ, శివార్లలోనూ చౌకగా తీసుకుంటున్నారు. క్రమంగా వీటి విలువ పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా ప్రయోజనాలు పొందుతున్నారు. బ్యాంకు బ్యాలెన్సు.. గతంలో బ్యాంకు బ్యాలెన్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. అయితే ప్రస్తుతం ధరల భారాన్ని ఎదుర్కొనాలంటే బ్యాంకు ఖాతాల్లో డబ్బుపై వచ్చే రాబడి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. లక్షల మొత్తాన్ని దాచి ఉంచినా.. వచ్చే రాబడి స్వల్పమే. పూర్తిగా సేవింగ్స్ ఖాతాలైతే నాలుగైదు శాతం మాత్రమే ఉంటోంది. కనుక ప్రస్తుతం అంతకు మించి రాబడులు ఇచ్చే సురక్షితమైన సాధనాలు మరికొన్ని వచ్చి చేరాయి. ఆ కోవకి చెందినవే లిక్విడ్ ఫండ్స్. వార్షికంగా చూస్తే ఇవి బ్యాంకు డిపాజిట్ల కన్నా మరింత అధిక రాబడులే ఇస్తున్నాయి. అలాగని, మరీ బ్యాంకుల్లో ఏమాత్రం ఉంచకూడదని కూడా కాదు. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ విధానాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి వచ్చే జీతంలో మినిమం బ్యాలెన్స్‌కు పైబడి.. నెలవారీ ఖర్చులతో పాటు మరో 10 శాతం అదనంగానే ఖాతాలో ఉంచుకోవడం మంచిది. దీనివల్ల మినిమం బ్యాలెన్స్‌ను కదపాల్సిన అవసరం ఉండదు. పెనాల్టీలు కట్టుకోవాల్సిన సమస్యా తలెత్తదు. విహార యాత్రలు, బీమా ప్రీమియంలు మొదలైన వాటి కోసం కూడా లిక్విడ్ ఫండ్స్‌తో ప్లాన్ చేసుకోవచ్చును. -
పట్టింపులు, పంతాలకు పోయి..
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : అధికారాన్ని చేజిక్కించుకోవాలని, గెలుపు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ప్రత్యర్థులతో పోటీపడి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు ఆ ఖర్చులు చూసి బెంబేలెత్తుతున్నారు. తెలిసిన వారి నుంచి కొంత, అధిక వడ్డీలకు మరికొంత అప్పులు తీసుకురాగా, ఎన్నికలు, ఫలితాల వెల్లడి తరువాత లెక్కలు వేసుకుంటే గెలిచిన అభ్యర్థులతోపాటు, ఓడిన అభ్యర్థుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంకొందరు స్థిరాస్తులు అమ్మి, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఖాళీ చేసుకున్నారు. వీరికి బాధ తక్కువగా ఉన్నప్పటికీ అప్పులు తెచ్చిపోటీ చేసిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. అధికారంపై మనిషికి మమకారం పెరిగితే అది ఎంత వరకైనా తీసుకెళ్తుందని, ఏదైనా చేయిస్తుందంటూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలిసొచ్చింది. మనమే గెలుస్తామన్న ధీమాతో ఉన్నదంతా ఊడ్చి అప్పు తెచ్చి ఎన్నికల్లో నిలిచారు. అంచనాలు తలకిందులై చివరకు ఓటమి వరించడంతో బిక్క మొహాలు వేశారు. పట్టుదలకు, పంతాలకు పోయి అప్పుడు చేసిన ఖర్చులతో చేసిన అప్పులను ఎలా తీర్చాలోనంటూ తల పట్టుకుంటున్నారు. పరిమితికి మించి ఖర్చులు మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో చాలా మంది పట్టుదలకు పోయి ఓట్ల వేటలో విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,095 మంది, 636 ఎంపీటీసీ స్థానాల్లో 2,710 మంది, 52 జెడ్పీటీసీలకు గాను 267 మంది, 10 అసెంబ్లీ స్థానాల్లో 107 మంది, 2 ఎంపీ స్థానాల్లో 25 మంది మొత్తంగా అన్ని ఎన్నికల్లో కలిపి 4,204 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో సగానికి పైగా అభ్యర్థులు పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సమాచారం. పోటీ చేసిన వారిలో చాలా మంది మధ్య తరగతి వారే కావడంతో వారు అప్పులు చేయాల్సి వచ్చింది. చాలామంది అభ్యర్థులు ఉన్న ఆస్తులు అమ్ముకోవడంతోపాటు, వడ్డీలకు అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, యువజన సంఘాలకు, కుల సంఘాలను మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడంతోపాటు, విందులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక్కొక్కరు పోటీని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలియడంతో, తమ వద్ద ఉన్న బంగారం, భూముల దస్తావేజులు, ఇళ్లను సైతం తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారు. మొదట అనుకున్న దానికంటే మూడు నుంచి పది రెట్లు అధికంగా డబ్బు ఖర్చు కావడంతో, ఇప్పుడు చేసిన అప్పులను తీర్చేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. గెలిచినా.. ఓడినా.. అప్పులే.. ఎన్నికల్లో అభ్యర్థులు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పట్టుదలకు పోయారు. వెనక్కు చూడకుండా ఖర్చు చేస్తూనే వెళ్లారు. ఎన్నికలు ముగిసిన తరువాత లెక్కలు చూసుకుని బిక్కముఖం వేశారు. జిల్లా వ్యాప్తంగా వేల మంది ఎన్నికల పుణ్యమా అని అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపొందిన వారు చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలని ఆలోచిస్తుండగా, ఓడిన వారు ఓటమి భారంతో ఒకవైపు, అప్పుల తిప్పలతో మరోవైపు ఇబ్బంది పడుతున్నారు. ఓడినా, గెలిచినా మిగిలింది అప్పులేనంటూ పోటీ చేసిన అభ్యర్థులు నిర్వేదం చెందుతున్నారు. ఓటరు మాత్రం ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా, నా ఓటు మీకేనంటూనే తన పని తాను కానిచ్చేశాడని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.