ట్రంప్ జీతం చెక్కు
వాషింగ్టన్: : జీవితంలోని ఈ అందాలు, ఆనందాలు మనిషి చేసే పొరపాట్ల వల్లనేనేమో! లేదంటే జీవితం టై కట్టుకుని తప్పులు, పొరపాట్లు వెదకడానికి బిగదీసుకు కూర్చున్న పెద్ద ఆఫీసర్‌లా ఉండిపోయేది కావచ్చు. ట్రంప్‌గారి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకనానీ శుక్రవారం ఒక పెద్ద మిస్టేక్ చేశారు. ‘ట్రంప్ గారు తమ నాలుగు నెలల జీతాన్ని (లక్ష డాలర్‌లు) కోవిడ్ పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ‘హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్’ శాఖకు ఇస్తున్నారు’ అని ప్రకటిస్తూ.. జీతం చెక్కును మీడియా ముందు ప్రదర్శించారు. చెక్కును మాత్రమే చూపెడితే మిస్టేక్ లేకపోయేది. చెక్కుతో పాటు చెక్కుకు కొనసాగింపుగా ఉన్న స్లిప్ మీది ట్రంప్ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు కూడా ఆమెకు సమీపంగా ఉన్న రిపోర్టర్‌ల కంటపడ్డాయి. పెద్ద పొరపాటే. కానీ ట్రంప్‌గారు ఆమెపై సీరియస్ ఏమీ అవలేదు. ‘చెక్కు కదా.. చెక్ చేసుకోవాలి’ అని బ్యాలెన్సింగ్‌గా నవ్వారు.
Comments
Please login to add a commentAdd a comment