బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక విద్యార్థి తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే తన బ్యాండ్ బ్యాలెన్స్ ఏకంగా రూ.87.63 కోట్లుగా చూపించింది. దీంతో ఐదు గంటల పాటు ఆ విద్యార్ధి కోటీశ్వరుడయ్యాడు.
బీహార్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి 'సైఫ్ అలీ' రూ.500 విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్ళాడు, ఆ సమయంలో తన బ్యాంకు బ్యాలెస్ చెక్ చేస్తే.. రూ.87.65 కోట్లు ఉన్నట్లు చూపించింది. స్క్రీన్‌పైన కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ అతన్ని ఒక్కసారిగి ఆశ్చర్యపరిచింది. సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నాడు.
సైఫ్ ఖాతాలో రూ.87.63 కోట్లు ఉన్న విషయం ఆ ఊరు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ అతడు బ్యాంక్ స్టేట్‌మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్‌కు వెళ్లి చెక్ చేసాడు. అప్పుడు అతని ఖాతాలో కేవలం 532 రూపాయలు మాత్రమే ఉన్నట్లు చూపించింది. అంతే కాకుండా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కొంత సేపు స్తంభించింది.
ఈ వింత సంఘటన కేవలం ఐదు గంటలు మాత్రమే కొనసాగింది. తనకు తెలియకుండానే వచ్చిన అదృష్టం.. తనకు తెలియకుండానే అదృశ్యమైంది. నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్.. సైఫ్ ఖాతాలో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయ్యిందో తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించింది. ఈ తప్పిదం ఎలా జరిగిందన్న దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.
ఇదీ చదవండి: అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..
ఇలాంటి సంఘటనలు మొదటిసారి కాదు
అనుకోకుండా బ్యాంక్ ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయిన సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన డబ్బు వచ్చినట్లే వెనక్కి వెళ్లాయి. కొంతమంది తమకు తెలిసిన వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేయడం వంటివి కూడా చేశారు. కానీ ఆ డబ్బును కూడా అధికారులు మళ్ళీ కట్టించుకున్నారు. అయితే సైఫ్ ఖాతాలో పడ్డ డబ్బు, ఐదు గంటల తరువాత మాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment