Penalty fee
-
ట్యాక్స్ ఆడిటింగ్.. సకాలంలో రిపోర్టు సమర్పించకపోతే భారీ పెనాల్టీలు, ఎంతంటే?
ఇప్పుడు ప్రపంచమంతటా వినబడే మాట ఆడిటింగ్. ప్రతి వ్యవహారాన్ని నిర్వహించిన తర్వాత చెక్ చేస్తున్నారు. తనిఖీ అనుకోండి .. సమీక్ష అనుకోండి.. శోధన అనుకోండి. ప్రతి చట్టంలోనూ ‘‘ఆడిటింగ్’’ చేయాలని చెబుతున్నారు. అలా ఆదాయపు చట్టంలో కూడా ఒక ఆడిట్ ఉంది. దాని పేరు ‘‘ట్యాక్స్ ఆడిట్’’. కొన్ని నిబంధనల ప్రకారం వృత్తి నిపుణులు, వ్యాపారస్తుల అకౌంట్స్‌ను ఆడిట్ చేయించాలి. ఎందుకు చేయించాలి? అసెసీలు సరైన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నిర్వహిస్తున్నారా లేదా? సరిగ్గా అన్నీ క్లెయిమ్ చేస్తున్నారా లేదా? మోసపూరితమైన వ్యవహారాలు జరిగాయా? అనేది చూసేందుకు దీన్ని నిర్దేశించారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సక్రమంగా నిర్వహించడం వల్ల ఆదాయపు అధికారులకు పని ఒత్తిడి తగ్గుతుంది. టైమ్ వృధా కాదు. ఈ ఆడిట్ ఎవరు చేస్తారు.. ప్రాక్టీస్ చేస్తున్న సీఏలు మాత్రమే ఈ ఆడిట్ చేయాలి. తర్వాత వారు రిపోర్టును ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ రూపంలో ఇవ్వాలి. ఈ ఆడిట్ ఎవరు చేయించాలి.. ఒక వ్యాపారి అమ్మకాలు, టర్నోవరు, స్థూల వసూళ్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1 కోటి దాటితే ఆడిట్ చేయించాలి. వృత్తి నిపుణులైతే వారి వార్షిక వసూళ్లు రూ. 50 లక్షలు దాటితే ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులు రూ. 1 కోటి దాటినా, రెండు కోట్ల లోపల ఉంటే నిర్దేశించిన శాతం మేరకు ‘‘లాభ’’ శాతం ఆదాయంగా డిక్లేర్ చేస్తే ట్యాక్స్ ఆడిట్ వర్తించదు. అంతే కాకుండా రూ. 10 కోట్ల లోపు టర్నోవరు ఉన్నవారికి వారి నగదు వ్యవహారాలు – వసూళ్లు – చెల్లింపులు టర్నోవరులో 5 శాతం దాటకపోతే వారికీ మినహాయింపు ఉంది. దీనర్థం ఏమిటంటే నగదు వ్యవహారాలను కట్టిపెట్టి అంతా బ్యాంకు ద్వారా చేయించడమే. ఫారం 3 ఇఅ/3 ఇఆ/3 ఇఈ అంటే.. ఇది ఆడిట్ రిపోర్ట్ ప్రొఫార్మా. దీని ప్రకారం అన్ని విషయాలు తెలియజేయాలి. ఇందులో వంద పైగా అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అమ్మకాలు, ఆదాయాలు, అప్పులు, ఆస్తులు, చెల్లింపులు, ఖర్చులు ఇలా అన్నీ ఎంతో వివరంగా ఇవ్వాలి. పూర్తిగా ఇవ్వాలి. వివరణ, విశ్లేషణ ఉంటాయి. తప్పులు, ఒప్పులు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు.. ఒకటేమిటి అన్నింటినీ డేగకన్నుతో చూస్తారు. సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ.. ఈ ఆడిట్ రిపోర్టును సమర్పించడానికి గడువు తేదీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30. ఆడిట్ రిపోర్టుతో పాటు రిటర్నులు కూడా సమర్పించాలి. అన్నింటికీ గడువు తేదీ సెప్టెంబర్ 30. గత సంవత్సరంలో ఈ గడువుని పొడిగిస్తూ వచ్చారు. ఈసారి మాత్రం పొడిగించరండి! భారీ– భారీ పెనాల్టీలు వడ్డిస్తారు.. సకాలంలో ఆడిట్ రిపోర్టు సమర్పించకపోతే పెనాల్టీ వడ్డిస్తారు. రూ. 1,50,000 లేదా టర్నోవరు మీద 5 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తం వడ్డిస్తారు. వడ్డించే ముందు మర్యాదపూర్వకంగా పిలిచి అన్ని వివరాలూ అడిగి, ఆలస్యానికి కారణం సమంజసమేనని అనిపిస్తే వడ్డించరు. లేదంటే వడ్డన తప్పదు. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
పోగ్బా మెరుపు గోల్.. ఫ్రాన్స్ విక్టరీ
మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ సిలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం దూకుడైన అటను ప్రదిర్శించిన ఫ్రాన్స్ గెలుపును సొంతం చేసుకుంది. బంతిని ఎక్కువసేపు తమ ఆదీనంలో ఉంచుకున్నప్పటికీ ప్రథమార్థలో ఫ్రాన్స్ ఆటగాళ్లు ఒక్క గోల్ చేయలేకపోయారు. దీంతో ప్రథమార్ధం గోల్ లేకుండానే ముగిసింది. ఫ్రాన్స్ పక్కా ప్రణాళికతో ద్వితీయార్ధంలో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే 58వ నిమిషంలో పెనాల్టీ కిక్ లభించడంతో ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనియో గ్రీజ్‌మాన్ తొలి గోల్ సాధించాడు. ఈ ఆనందం ఫ్రాన్స్ శిబిరంలో ఎంతో సేపు నిలవలేదు. ఆస్టేలియాకు కూడా పెనాల్టీ కిక్ లభించడంతో 62వ నిమిషంలో జెడినాక్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. ఇక మరోగోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగస్తుందనుకున్న తరుణంలో 81వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా అద్భుత గోల్ సాధించి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని పెంచాడు. మరో గోల్ సాధించడంలో ఇరు జట్లు విఫలమవడంతో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 15 అనవసర తప్పిదాలు చేయగా, ఆస్ట్రేలియా 19 తప్పిదాలు చేసింది. ఫ్రాన్స్ ఆరు సార్లు గోల్ కోసం ప్రయత్రించగా ఆసీస్ గోల్ కీపర్ సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. ఆట సగం పూర్తయినా ఒక్క గోల్ నమోదు కాకపోవటంతో ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. ఈ అసహనంలో చేసిన తప్పిదం వల్ల మ్యాథ్యూ లెకీ, జోష్ రిస్డాన్, ఆజీజ్ బెహిచ్(ఆసీస్), కోరింటిన్ టోలిస్సో(ఫ్రాన్స్) ఆటగాళ్లకు రిఫరీ ఎల్లో కార్డు చూపించారు. -
పట్టణ ప్రజలపై వడ్డీ భారం
కట్టకపోతే తాళం వేస్తున్న మున్సిపల్ సిబ్బంది ♦ జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల బాదుడు ♦ ఒంగోలు కార్పొరేషన్లోనే రూ.17 కోట్లు ♦ మినహాయింపు ఊసెత్తని ప్రభుత్వం ♦ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, అర్బన్: పట్టణ ప్రజలపై వడ్డీ భారం పెరిగిపోతోంది. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించలేదన్న పేరుతో అపరాధ రుసుం పేరుతో నూటికి నెలకు రెండు రూపాయల వడ్డీని వేస్తున్నారు. దీంతో ఆస్తిపన్ను బకాయిలు పెరిగిపోతున్నాయి. దీనిపై పలువురు కోర్టులను ఆశ్రయించగా మిగిలిన వారు ప్రభుత్వం మినహాయింపు ఇస్తే కడతామని కరాఖండిగా చెబుతున్నారు. జిల్లాలో సుమారు 20 కోట్లు రూపాయలపైనే వడ్డీ రూపంలో భారం పడుతున్నట్లు సమాచారం. ఇందులో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లోనే వడ్డీ భారం రూ. 17 కోట్లు ఉంది. ఇది తలకుమించిన భారంగా మారుతోందని టాక్స్‌పేయర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్నులు కూడా అడ్డదిడ్డంగా ఒక శాస్త్రీయ పద్దతి లేకుండా వేయడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసి చెల్లించకుండా ఆపారు. కనీస వసతులు పట్టించుకోకుండా పన్ను చెల్లించని తేదీ నుంచి నెలకు వందకు రెండు రూపాయల వడ్డీ చొప్పున వేసుకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల అసలుకన్నా వడ్డీ ఎక్కువయ్యే పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది పన్నులు వసూలు చేయడంలో నగరపాలక సిబ్బంది నిర్లక్ష్యం వహించి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వని సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఒంగోలులో నగరపాలక సిబ్బంది బృందాలుగా ఏర్పడి పన్నులు చెల్లించని వారి ఆస్తులకి తాళాలు వేస్తున్నారు. పన్నులపై వడ్డీ రాయితీ ఇస్తే పన్నులు కడతామని నగరవాసులు అంటున్నా ఉన్నతాధికారులు మాత్రం అటువంటి అవకాశం లేదని స్పష్టం చేయడంతో అయోమయ పరిస్థితులు నెలకున్నారుు. ♦ నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ అస్తులకి సంబంధించిన పన్నులు రూ.6 కోట్లు పైబడి ఉన్నాయి. ప్రజలకి సంబంధించి రూ.21 కోట్లున్నాయి. మొత్తం రూ.27 కోట్లు పన్నుల రూపంలో ఉంటే మరో రూ.17 కోట్లు వడ్డీ రూపంలో ప్రజలపై భారంగా భయపెడుతోంది. ♦ మార్కాపురంలో మొత్తం అసెస్మెంట్లు 13,744 ఉండ గా డిమాండ్ రూ.3.61 కోట్లుంది. ఇప్పటికి రెండున్నర కోట్ల రూపాయల వరకూ వసూలు కాగా కోటీ 15 లక్షలు వసూలు కావల్సి ఉంది. సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో ఉన్నట్లు అంచనా. ♦ గిద్దలూరు నగరపంచాయతీలో బకాయిలు కోటీ 23 లక్షలుండగా 67 లక్షలు వసూళ్లయ్యాయి. సుమారు నాలుగు లక్షల రూపాయలు వడ్డీల రూపంలో నగర ప్రజలు చెల్లించాల్సి ఉంది. ♦ అద్దంకి మున్సిపాలిటీలో కోటీ 72 లక్షల రూపాయలు ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉండగా, 67.5 లక్షలు వసూలైంది. మూడు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ♦ కందుకూరు మున్సిపాలిటీలో ఐదు కోట్ల 30 లక్షల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 2.15 కోట్లు వసూలు చేశారు. వడ్డీ రూపాయలో చెల్లించాల్సింది2.46 కోట్లు. మిగిలిన మున్సిపాలిటీలలో కూడా వడ్డీలు భారీగానే ఉన్నాయి. ♦ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ రాయితీ ఇస్తే ప్రజలకు మేలు జరగడంతోపాటు మున్సిపాలిటీలకు ఆస్తిపన్ను త్వరగా వసూలయ్యే అవకాశం ఉంది.