మాస్కో: ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ సిలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం దూకుడైన అటను ప్రదిర్శించిన ఫ్రాన్స్ గెలుపును సొంతం చేసుకుంది. బంతిని ఎక్కువసేపు తమ ఆదీనంలో ఉంచుకున్నప్పటికీ ప్రథమార్థలో ఫ్రాన్స్ ఆటగాళ్లు ఒక్క గోల్ చేయలేకపోయారు. దీంతో ప్రథమార్ధం గోల్ లేకుండానే ముగిసింది. ఫ్రాన్స్ పక్కా ప్రణాళికతో ద్వితీయార్ధంలో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే 58వ నిమిషంలో పెనాల్టీ కిక్ లభించడంతో ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనియో గ్రీజ్‌మాన్ తొలి గోల్ సాధించాడు. ఈ ఆనందం ఫ్రాన్స్ శిబిరంలో ఎంతో సేపు నిలవలేదు. ఆస్టేలియాకు కూడా పెనాల్టీ కిక్ లభించడంతో 62వ నిమిషంలో జెడినాక్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు.
ఇక మరోగోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగస్తుందనుకున్న తరుణంలో 81వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా అద్భుత గోల్ సాధించి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని పెంచాడు. మరో గోల్ సాధించడంలో ఇరు జట్లు విఫలమవడంతో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 15 అనవసర తప్పిదాలు చేయగా, ఆస్ట్రేలియా 19 తప్పిదాలు చేసింది. ఫ్రాన్స్ ఆరు సార్లు గోల్ కోసం ప్రయత్రించగా ఆసీస్ గోల్ కీపర్ సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. ఆట సగం పూర్తయినా ఒక్క గోల్ నమోదు కాకపోవటంతో ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. ఈ అసహనంలో చేసిన తప్పిదం వల్ల మ్యాథ్యూ లెకీ, జోష్ రిస్డాన్, ఆజీజ్ బెహిచ్(ఆసీస్), కోరింటిన్ టోలిస్సో(ఫ్రాన్స్) ఆటగాళ్లకు రిఫరీ ఎల్లో కార్డు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment