న్యూఢిల్లీ : ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న సాకుతో వినియోదారులకు బ్యాంకులు వసూలు జరిమానా లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు వినియోగదారుల నుంచి రూ.5 వేల కోట్లను జరిమానా పేరిట వసూలు చేశాయి. ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ. 6,547 కోట్ల నష్టాన్ని చవి చూసిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) జరిమానాలను వసూలు చేసేందుకు ఇతర బ్యాంకులకు నేతృత్వం వహించింది.
మొత్తం 24 బ్యాంకుల్లో అధికంగా జరిమానాలు వసూలు చేసింది కూడా ఎస్‌బీఐనే. ఏప్రిల్ 2017 నుంచి కనీస బ్యాలెన్స్ నిల్వ చేయకపోతే విధించే జరిమానాను ఎస్‌బీఐ తిరిగి ప్రవేశపెట్టింది. దీంతో ఎస్‌బీఐ జరిమానాల పేరిట అత్యధికంగా రూ.2,433.87 కోట్లు వసూలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.590.84 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment